• January 15, 2022

Chaysam: సమంతతోనే బెస్ట్ అనిపించింది : నాగ చైతన్య

Chaysam: సమంతతోనే బెస్ట్ అనిపించింది : నాగ చైతన్య

    Chaysam సమంత నాగ చైతన్యలను తెరపై చూసి ముచ్చటపడని తెలుగు సినీ అభిమాని ఉండడు. ఏమాయ చేశావే సినిమాతో ఈ జోడి కలిసింది. అక్కడి నుంచి ఈ ఇద్దరూ ఎన్కో సినిమాల్లో నటించారు. ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ ఇలా మొత్తం నాలుగు సినిమాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. అలా ఈ ఇద్దరూ మొదటి నుంచి కూడా మంచి స్నేహితులుగా ఉంటూ వచ్చారు.

    చివరకు అది ప్రేమగా మారింది. పెళ్లి పీఠలెక్కింది. ఇక ఇప్పుడు విడాకులతో ఆ బంధం వీగిపోయింది. పర్సనల్ జీవితాలు ఎలా ఉన్నా కూడా వీరిద్దరి ప్రొఫెషనల్ లైఫ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చేసిన నాలుగు సినిమాల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్లే. అలా ఈ ఇద్దరూ జోడికి అందరూ ఫిదా అయ్యారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చారు.

    ఈ ఇద్దరూ విడిపోయిన సమయంలోనూ అభిమానులు ఎక్కువగా బాధపడ్డారు. మీకు కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ ఇరువురి అభిమానులు హర్ట్ అయ్యారు. అయితే విడాకుల నిర్ణయం ఎవరు తీసుకున్నా? ఎందుకు తీసుకున్నా? కూడా ఆ నిర్ణయం మాత్రం చాలా మందికి నచ్చలేదు కొంత మంది సెలెబ్రిటీలకు కూడా ఈ నిర్ణయం నచ్చలేదు.

    అంతలా ఈ జోడి అందరి మీద ప్రభావం చూపింది. ఇక తాజాగా నాగ చైతన్యకు తాను పని చేసిన హీరోయిన్లతో ఎవరి బెస్ట్ కెమిస్ట్రీ వర్కవుట్ అయింది? అనే ప్రశ్న ఎదురైంది. దానికి నాగ చైతన్య ఏ మాత్రం తడముకోకుండా సమంత అని రిప్లై ఇచ్చాడు. నిజంగానే సమంత నాగ చైతన్యల కెమిస్ట్రీకి జనాలు అంతా కూడా ఫిదా అయిపోయారు.

    Leave a Reply