- January 4, 2022
మీరు లేకపోతే నేనేం చేయలేను!.. కమెడియన్, హీరోతో సమంత చిల్

సమంత ప్రస్తుతం లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేసేస్తోంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఫుల్ హ్యాపీగా ఉంటోంది. అయితే ఈ విడాకులకు అసలు కారణాలు మాత్రం ఎప్పటికీ బయటకు రావు. కొందరేమో సమంతదే తప్పని అంటారు. ఇంకొందరు మాత్రం నాగ చైతన్య వల్లే ఇలా జరిగిందని అంటుంటారు. కానీ విడాకులకు దారి తీసిన అంశాలేంటన్నవి మాత్రం అస్సలు బయటకు రావడం లేదు.
సమంత తన పర్సనల్ లైఫ్‌ను ఇప్పుడు పక్కన పెట్టేసింది. తన దృష్టి అంతా కూడా కెరీర్ మీద పెట్టేసింది. చకచకా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తోంది. పుష్ప ఐటం సాంగ్‌తో సమంతకు మరింత ఊపు వచ్చింది. యశోద సినిమా షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఇక హాలీవుడ్ డైరెక్టర్‌తో సమంత మరో సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే.
అలా ఇప్పుడు సినీ కెరీర్‌ను సమంత పరుగులు పెట్టిస్తోంది. అంతే కాకుండా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అంటూ శిల్పా రెడ్డితో గోవాలో సమంత బికినీ అందాల ఆరబోతతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. బికినీలో సమంతను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇక సమంతకు వెన్నెల కిషోర్, చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ చాలా సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ ముగ్గురు కలిసి ఫుల్ చిల్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సమంత, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ కలిసి ఒకే చోట ముచ్చట్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరి మీద సమంత ప్రేమను కురిపించింది. మీ ఇద్దరూ లేకపోతే నేనేం చేయలేను అంటూ సమంత ఓ లవ్ సింబల్‌ను షేర్ చేసింది.