- October 24, 2021
విండోస్ 10 వాడే యూజర్లకు గుడ్ న్యూస్…….

ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, పర్సనల్ కంపూటర్లు వాడేస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ కరోనా కాలంలో అంతా ఆన్ లైన్ అయిన తరువాత మరింత ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక చిన్న పిల్లలు క్లాసులు వినాలన్నా, పెద్దవారు పనులు చేసుకోవాలన్నా ల్యాప్ టాప్‌లు, ఫోన్లే, కంప్యూటర్లే దిక్కయ్యాయి. అయితే కంప్యూటర్లు వాడే ప్రతీ ఒక్కరూ కూడా విండోస్ గురించి తెలుసుకుంటారు.
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. తమ సిస్టంలో కొత్త విండోస్‌ను పెట్టేసుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే ఇందులో కొన్ని వర్షన్లు మాత్రమే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఉదాహరణకు ఒకప్పుడు అందరూ కూడా విండోస్ 7ని ఉపయోగించే వారు. కాకపోతే, తర్వాత విండోస్ 8, 8.1 రావడంతో అందరూ వాటిపై దృష్టి సారించారు. కొత్తలో వాటిని వాడినా కూడా ఆ తరువాత అందరూ విండోస్ 7కే మొగ్గుచూపారు. విండోస్ 8, 8.1లోని కొన్ని లోపాలతో యూజర్లు అసంతృప్తి చెందారు. దీంతో మళ్ళీ విండోస్ 7కే ఓటు వేశారు.
అలా విండోస్ 7 అనేది అందరికీ మంచి చాయిస్‌గా మారింది. ఇక ఇప్పుడు విండోస్ 10 హవా నడుస్తోంది. దీనికి అప్డేటెడ్ వర్షన్‌గా 11 కూడా వచ్చింది. విండోస్ 11 లో కూడా చాలా లోపాలు ఉన్నాయి అని చాలా ప్రముఖ టెక్ నిపుణులు రివ్యూలు ఇస్తున్నారు. దాంతో మళ్లీ అంతా విండోస్ 10 కే మొగ్గు చూపుతున్నారు. పైగా విండోస్ 11 అప్డేట్స్ ప్రతి ఒక్కరికీ రాదు. కనుక అందరూ విండోస్ 11 పొందలేకపోతోన్నారు. ఎవరైతే విండోస్ 10 వాడాలి అనుకుంటున్నారో వారికోసం మైక్రోసాఫ్ట్ ఓ నిర్ణయాన్ని తీసుకుంది.
విండోస్ 10ను వాడుతున్న వారికి 2025 వరకు సేవలను అందిస్తామని చెప్పింది. పైగా ఈ అప్డేట్స్ ప్రతి నెల మాత్రమే వస్తాయి. విండోస్ 10 లో వచ్చే పెద్ద అప్డేట్ (విండోస్ 10 21H2). ఇది నవంబర్ నెలలో రానుంది. ఇదే మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చే పెద్ద విండోస్ 10 ఫీచర్ అప్డేట్ అని తెలుస్తోంది. ఎవరైతే 2018 కన్నా ముందు కంప్యూటర్లు కొన్నారో వాళ్ళకి వచ్చే లాస్ట్ ఫీచర్ అప్డేట్ ఇది మాత్రమే. తర్వాత ఎటువంటి అప్డేట్ రాదు అని మైక్రోసాఫ్ట్ సంస్థ తేల్చి చెప్పింది.