• October 24, 2021

ఇంటెల్‌కు మరో దెబ్బ.. మళ్లీ లీకైన ప్రాసెసర్

ఇంటెల్‌కు మరో దెబ్బ.. మళ్లీ లీకైన ప్రాసెసర్

    లీకులు అనేవి అన్ని చోట్ల కామన్ అయిపోయాయి. సంస్థ నుంచి అధికారికంగ రావాల్సిన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ముందే వచ్చేస్తున్నాయి. అలా ఇంటెల్ ప్రాసెసర్‌లు మార్కెట్లోకి ముందే లీకైపోతోన్నాయి. ఇంతకు ముందు కోర్ i9-11900K(Core i9-11900K)కూడా జర్మని‌లో లీక్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇంటెల్ సంస్థ అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయకముందే కొందరి చేతుల్లోకి అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసింది.

    మార్కెట్లో ఇంటెల్ కోర్ i9-12900K(intel core i9-12900K) అల్డర్ లేక్ ప్రాసెసర్లు వచ్చేశాయి. దీంట్లో సీపీయూ క్లాక్ స్పీడ్ 3.2 GHz – 5.2 GHzగా ఉందని తెలుస్తోంది. 16 కోర్‌తో రానున్న ఈ సీపీయూ 24 త్రెడ్స్‌తో ఉంటుంది. దానితో పాటు 30ఎంబీ ఎల్3 కూడా ఉంటుంది. ఈ ప్రాసెసర్ 125 వాట్స్ పవర్ తీసుకుంటుంది. DDR5 తో పాటు PCIe Gen 5 ని కూడా సపోర్ట్ చేసే ఈ ప్రాసెసర్, ప్రస్తుతం ఇంటెల్ Z690 ఇంటెల్ H670, ఇంటెల్ B660, ఇంటెల్ H610 మదర్ బోర్డ్స్‌కి పరిమితం అయింది. దీని ధర మాత్రం $670 డాలర్లు అంటే అక్షరాల 50 వేల రూపాయలన్న మాట. ఈ అల్డర్ లేక్ ప్రాసెసర్ నవంబర్ 4 తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

    Leave a Reply