• October 24, 2021

Sreemukhi: మామిడి తోటలో అవినాష్, శ్రీముఖి రచ్చ.. కాపురం ముచ్చట్లతో హల్చల్

Sreemukhi: మామిడి తోటలో అవినాష్, శ్రీముఖి రచ్చ.. కాపురం ముచ్చట్లతో హల్చల్

    Sreemukhi జబర్దస్త్ అవినాష్, బిగ్ బాస్ ఫేమ్ అవినాష్, ముక్కు అవినాష్ ఇలా చాలా పేర్లతోనే ఫేమస్ అయ్యాడు. అయితే అవినాష్ పెళ్లి మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దాదాపు బుల్లితెర తారల సందడి మొత్తం అవినాష్ పెళ్లిలోనే కనిపించింది. కామెడీ స్టార్స్, జబర్దస్త్, బిగ్ బాస్ షోల సందడి మొత్తం అవినాష్ పెళ్లిలోనే ఉంది. ఇక శ్రీముఖి అయితే అవినాష్ ఇంట్లోనే ఉంది. పెళ్లి అవినాష్‌ది అయినా హడావిడి మాత్రం శ్రీముఖిదే.

    అలా అంతగా శ్రీముఖి ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తోంది. అయితే పెళ్లి అయిపోయినా కూడా ఇంకా అవినాష్ ఇంట్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. వీకెండ్ కాబట్టి అలా అవినాష్ ఇంటికి వెళ్లిందో తెలియదు. కానీ మొత్తానికి అవినాష్, శ్రీముఖి మాత్రం ఇప్పుడు తెగ రచ్చ చేస్తున్నారు. జగిత్యాలలో ఉన్నాను.. మామిడి తోటలో ఉన్నాను అంటూ అవినాష్, తాను ఉన్న వీడియోను శ్రీముఖి షేర్ చేసింది. అంతేకాకుండా కాపురం ఎలా ఉందంటూ అడిగేసింది.

    కాపురం ఇంకా మొదలుపెట్టలేదు.. ఇప్పటికైతే అంతా బాగానే ఉందంటూ అవినాష్ తప్పించుకున్నాడు. మొత్తానికి శ్రీముఖి ఓ గిఫ్ట్ ఇచ్చిందట. పెళ్లి కానుకగా స్కూటీని ఇచ్చినట్టు చెప్పాడు. అది సరదాగా చెప్పాడో లేదా నిజంగానే ఇచ్చిందో తెలియడం లేదు.మొత్తానికి ఆ స్కూటీ మీదే చక్కర్లు కొట్టేస్తున్నారు. అలా అవినాష్, శ్రీముఖి మాత్రం నెట్టింట్లో ఇప్పుడు దుమ్ములేపుతున్నారు. అవినాష్ పెళ్లి తరువాత కూడా తన ఊర్లోనే ఉంటే.. అవినాష్‌తో పాటు పెళ్లి చేసుకున్న హర్ష మాత్రం గోవాకు జంప్ అయ్యాడు. హనీమూన్ అంటూ దుమ్ములేపుతున్నాడు.

    Leave a Reply