- October 31, 2021
ధైర్యం లేని వారే అలా చేస్తారు : విరాట్ కోహ్లీ

టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమిని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతోన్నారు. ఆ మ్యాచ్ ఇన్ని రోజులు అవుతున్నా కూడా చర్చలు మాత్రం ఆగడం లేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక మహమ్మద్ షమీయే ఇండియా ఓటమికి బాధ్యుడు అన్నట్టుగా విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. వ్యక్తిగతంగా దాడిని కూడా చేస్తున్నారు. ఇలాంటి వాటిపై తాజాగా విరాట్ కోహ్లీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
ఎవరో ధైర్యం లేని వారే ఇలా చేస్తారు. తమ పేర్లను కూడా బయటకు చెప్పకుండా ఇలాంటి ట్రోల్స్‌ను సోషల్ మీడియాలో చేస్తూ ఆనంద పడుతుంటారు. మనిషి సామర్థ్యం అత్యంత స్థాయికి దిగజారినప్పుడే ఇలాంటి పనులు చేస్తాడని, అయినా వినోదం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకోవడం అలవాటైంది. ఇది విచారకరమైన పరిస్థితి అని విరాట్ కోహ్లీ మండిపడ్డాడు. ఇక నేడు దుబాయ్‌లో భారత్ న్యూజిల్యాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.