• October 31, 2021

Huzurabad Exit Polls : ఈటెలదే విజయమా?

Huzurabad Exit Polls : ఈటెలదే విజయమా?

    మొత్తానికి హుజూరా బాద్ పోరు ముగిసింది. గత నాలుగు నెలలుగా చర్చనీయాంశమైన హుజూరా బాద్ ఉప ఎన్నికలు శనివారం నాడు ముగిశాయి. టీఆర్ఎస్, ఈటెల రాజేందర్ మధ్యన జరిగిన ఈ పోటీలో ఎవరు గెలుస్తారా? అనేది అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ వంటి పార్టీల పేర్లు అక్కడ వినిపించినా కూడా ప్రధాన పోరు మాత్రం కేసీఆర్ వర్సెస్ ఈటెల అన్నట్టుగానే ఉంది. అక్కడ ఎవరు గెలిచినా ఓడినా ఈ ఇద్దరికే అది వర్తిస్తుంది.

    అయితే ఎగ్జిట్స్ పోల్స్ మాత్రం అన్నీ కూడా ఈటెలకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతీ సర్వేలో ఈటెల విజయం సాధించబోతోన్నాడని చెప్పేసింది. అయితే అన్ని సార్లు ఈ ఎగ్జిట్స్ పోల్స్ సర్వే నిజమవుతుందని చెప్పలేం. ఇక నవంబర్ 2న ఈ పోరుకు ముగింపు పలకబోతోన్నారు. నవంబర్ 2న ఫలితం రానుంది. అప్పుడు అసలు కథ తెలుస్తుంది. కేసీఆర్ పాచికలు ఫలిస్తాయా? లేదా ఈటెల రాజేందర్ మంచితనం అక్కడ గెలుస్తుందా? అన్నది చూడాలి.

    Leave a Reply