• October 20, 2021

కోరిక తీర్చని కోహ్లీ.. ఇకపై ఆర్సీబీ బాధ్యతలు ఎవరికో?

కోరిక తీర్చని కోహ్లీ.. ఇకపై ఆర్సీబీ బాధ్యతలు ఎవరికో?

    ఈసాల కప్ నమదే.. అంటూ ఆర్సీబీ జట్టు ప్రతీసారి ఐపీఎల్ బరిలోకి దిగుతుంది. కానీ ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్‌ను సాధించలేకపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టు ఇంత వరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయింది. ఆర్సీబీ జట్టు బాధ్యతలను కోహ్లీ ఏడేళ్ల క్రితం తీసుకున్నాడు. అప్పుడు అందరిలోనూ కొంత నమ్మకం వచ్చింది. ఆర్సీబీ జట్టు ఐపీఎల్‌లో రాణిస్తుంది.. కప్పు కొడుతుందని అందరూ నమ్మారు. కానీ చివరకు అది కలగానే మిగిలింది.

    ఆర్సీబీకి కప్పు తీసుకురావడంలో కోహ్లీ విఫలమయ్యాడు. 2016లో ఒకసారి ఫైనల్, 2020, 2021లో ఫ్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లగలిగాడు. కానీ కప్పు మాత్రం కొట్టలేకపోయాడు. అయితే కోహ్లీ వచ్చే ఏడాది నుంచి ఆర్సీబీ బాధ్యతలనుంచి వైదొలగనున్నట్టు ప్రకటించాడు. దీంతో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసిది ఎవరా? అని చర్చ నడుస్తోంది. అయితే ఆర్సీబీ యాజమాన్యం బుజ్జిగించి బతిమిలాడితే కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో.

    అయితే అప్పటికీ కోహ్లీ నిర్ణయం మార్చుకోకపోతే ఇద్దరికి మాత్రం కెప్టెన్ అయ్యే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. ఏబీ డివిలియర్స్, మాక్స్‌వెల్‌లో కెప్టెన్ అయ్యే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ మరీ ముఖ్యంగా మ్యాక్స్‌వెల్‌కు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సారి అత్యధిక మొత్తంలో అంటే దాదాపు 14 కోట్లకు పైగా పెట్టి మరి అతడిని కొనుగోలు చేసింది. దానికి తగ్గట్టే 513 పరుగులు చేశాడు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ అవుతారేమో చూడాలి.

    Leave a Reply