- November 1, 2021
Ban IPL : దారుణమైన పరాభవం.. టీమిండియాపై ట్రోల్స్

టీ20 ప్రపంచ కప్‌లొ టీమిండియాకు దారుణమైన పరాభవం ఎదురైంది. పాక్ చేతిలో జరిగిన ఓటమినే ఎవ్వరూ ఇంకా జీర్ణించుకోలేకపోతారు. దానికి మించి అనేలా నిన్నటి ఆటలో మన జట్టు దారుణమైన ఆటతీరును కనబర్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ భారీ స్థాయిలో పతనమైంది. ఏడు వికెట్ల నష్టానికి 110 రన్స్ తీసి పరువుపోగొట్టుకుంది. ప్రెటోల్ రేటు కంటే చాలా తక్కువ రన్స్ తీశారంటూ నెట్టింట్లో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక అది అలా ఉంచితే.. ఏడు వికెట్లు కోల్పోవడం, మొదటి పది ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం, పేలవమైన ప్రదర్శనతో టీమిండియాను జనాలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మనవాళ్లు ఇరవై ఓవర్లలో 110 పరుగులు తీస్తే.. మరో వైపు న్యూజిలాండ్ మాత్రం ఈ స్కోర్‌ను అవలీలగా చేదించింది. కేవలం 14.3 ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించి ప్రపంచం ముందుగా భారత్ పరువు తీసింది. ఐపీఎల్ మ్యాచులే దీనంతటికి కారణం వాటిని బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో రెచ్చిపోయి ఆడే మన వాళ్లు ఇలాంటి మ్యాచుల్లో చేతులెత్తేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు Ban IPL అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.