• October 29, 2021

కోహ్లీ మాటలు బాధించాయి : అజయ్ జడేజా

కోహ్లీ మాటలు బాధించాయి : అజయ్ జడేజా

    భారత్ పాక్ మ్యాచ్ ముగిసినా కూడా దాని మీద మాత్రం చర్చ నడుస్తూనే ఉంది. టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాక్ చేతిలో భారత్ దారుణంగా ఓడిపోవడంతో అందరూ దిగులు చెందారు. అయితే మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాలు తనను బాధించాయని అజయ్ జడేజా అన్నాడు. ఓపెనర్లు త్వరగా అవుట్ అవ్వడంతో మ్యాచ్ చేజారిపోయిందంటూ కోహ్లీ తన వైఫల్యాన్ని ఎదుటి వారి మీద నెట్టినట్టు అనిపించింది. అయితే ఇదే విషయంలో అజయ్ జడేజా స్పందించాడు.

    పాక్ చేతిలో భారత్ ఓడిన తరువాత కోహ్లీ మాట్లాడిన మాటలు నచ్చలేదని అన్నాడు. ఓపెనర్లు తొందరగా అవుట్ అవ్వడం వల్ల మ్యాచ్‌లో వెనుకపడ్డామని అన్నాడు.. ఆ మాటలతో నిరాశ చెందాను.. ఓపెనర్లు అవుట్ అయినా కూడా విరాట్ లాంటి ఆటగాళ్లు తర్వాత బ్యాటింగ్ చేస్తారే.. జట్టు వెనుబడే అవకాశం లేదు.. ఆయన కూడా సరిగ్గా ఆడలేదు అనే మీనింగ్ వచ్చేట్టు జడేజా అన్నాడు. మొత్తానికి ఆది వారం జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఈ అపవాదులన్నీ తొలిగిపోతాయి.

    Leave a Reply