- October 29, 2021
Intinti Gruhalakshmi Episode 463: పిచ్చి దానిలా ప్రవర్తించిన అంకిత.. బలైన శ్రుతి

ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో ఇప్పుడు రెండు కోణాలున్నాయి. ఒకటి నందు లాస్య తులసి కథను నడిపించడం. మధ్యలో కొత్త కోడళ్ల పోరును చూపించడం. ముందు నుంచి అసలు శ్రుతీ అంటేనే ఇష్టం లేని అంకిత ఆమె అంటే అసహ్యంతోనే ఉంది. ఇక ప్రేమ్ శ్రుతీ పెళ్లి తరువాత అంకిత అసూయ, ద్వేషం అంతా కూడా పెరిగింది. అది నేటి ఎపిసోడ్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. శ్రుతీని తిట్టించాలని భర్త ఎంతో కష్టపడి కొనుక్కున ల్యాప్ టాప్‌ను కూడా ముక్కలు చేసేసేంది. ఆ నిందను శ్రుతీ మీద వేసేందుకు ప్రయత్నించింది.
గృహలక్ష్మీ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో కాస్త గందరగోళంగా ఎమోషనల్‌గా సాగింది. ఈ 463వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. శ్రుతీ అంకితల మీద మొదలైన ఈ సీరియల్ నందు తులసి లాస్యల మీద ముగుస్తుంది. తన పనులన్నీ చేయాలనే కండీషన్ పెట్టిన అంకిత.. వాటిని చేసేందుకు శ్రుతీ ఒప్పుకుంది. ఇంటి పనులే కాకుండా అంకిత రూం, బట్టలు ఇలా అన్నింటిని చేయించింది.
ఇదంతా ఓ వైపు జరుగుతుంటే.. ఆఫీస్‌కు వెళ్లిన నందు, లాస్య.. అక్కడ తులసిని అవమానించేలా మాట్లాడతారు. ఉద్యోగులను తిరిగి రప్పించడం అంటే.. వంటగదిలో వంట చేయడం అనుకుంటున్నావా? ఎంతో అనుభవం ఉన్న మేమే చేతులు ఎత్తేశామంటూ లాస్య పోజులు కొడుతోంది. ఉద్యోగుల కోసం మనం ఇలా వెయిట్ చేయాలా? అంటూ లాస్య చిరాకు పడుతుంది. సమయం రాకపోతే సింహం కూడా పిల్లిలా దాక్కోవాల్సి వస్తుంది అని తులసి సామెత చెబుతుంది.
అంటే నందును పిల్లిలా చేయాలని చూస్తున్నావా? అని తులసి మీద లాస్య ఫైర్ అవుతుంది. ఆ చాన్స్ నాకు నువ్ ఎక్కడ ఇస్తున్నావ్? అంటూ లాస్యకు కౌంటర్ వేస్తుంది. ఇక ఉద్యోగులు వస్తారా? రారా? అని తులసి మథన పడుతూ ఉంటుంది. మరో వైపు ఇంట్లో అంకిత తన నీచపు బుద్దిని చూపిస్తుంది.
శ్రుతిని తిట్టించాలని భర్త ల్యాప్ టాప్‌ను బద్దలు చేస్తుంది. తన లాప్ టాప్ ముక్కలై ఉండటం చూసి అభి ఫైర్ అవుతాడు. ఎవరు చేశారు? అంటూ అంకితను అడుగుతాడు. నాకేం తెలుసు ఇంతకు ముందు శ్రుతీ మన రూంను క్లీన్ చేసేందుకు వెళ్లింది.. తరువాత ఎవ్వరూ లోపలకి వెళ్లలేదు అని చెప్పుకొచ్చింది. దీంతో అభి.. శ్రుతీని నానా మాటలు అంటాడు.
శ్రుతీ పగలగొట్టడం ఎవ్వరూ చూడలేదు? అలాంటిప్పుడు ఎలా నిందలు వేస్తావ్? అని ప్రేమ్ అంటాడు. ఇలాంటివి ఎవరైనా చూస్తుండగా చేస్తారా? అని నాన్నమ్మ మధ్యలోకి దూరుతుంది. రెండు నెలలు సంపాదనతో కొన్నాను అని అభి ఫీలవుతాడు. సరేలే ఎలాగోలా కొందాం అని ప్రేమ్ అంటాడు.
కొనాల్సిన అవసరం లేదు.. శ్రుతీ మళ్లీ మా రూంలోకి రాకుండా ఉంటే చాలు అని చెప్పి వెళ్లిపోతాడు. ఇదంతా నీకు అవసరమా? అని శ్రుతిని ఏమీ అనలేక అక్కడి నుంచి ప్రేమ్ వెళ్లిపోతాడు. చూశావా? నీ మీద నాకు ఎంత కోపం ఉందో? అని అంకిత అంటుంది. నామీద కోపంతో లాప్ ట్యాప్ పగలగొడతావా?అని శ్రుతీ ఆశ్చర్యపోతుంది. ఇంకా నా పనులు చేస్తావా? అని అంకిత అంటుంది. నువ్ మారే వరకు చేస్తూనే ఉంటాను అని శ్రుతీ కూడా మొండిగానే ఉంది.
ఇక మరోవైపు ఆఫీస్‌లో ఎంప్లాయిస్ వస్తారు. వారితో మాట్లాడేందుకు నందు రెడీగా లేకపోవడంతో.. తులసి వచ్చి నచ్చజెబుతుంది. తులసి గారు వన్ మంత్ సాలరీ ముందే ఇస్తాను అన్నారు కాబట్టి వచ్చాం.. అదే మీరు చెబితే వచ్చే వాళ్లం కాదని ఎంప్లాయిస్ అంటారు. ఆ తరువాత ప్రాజెక్ట్ గురించి నందు వివరిస్తాడు. లంచ్ టైంలో ఆర్డర్ చేసిన పిజ్జాలను నందు లాస్యలు తింటూ.. పక్కనే లంచ్ బాక్స్ తింటున్న తులసి మీద కౌంటర్లు వేస్తారు. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి పిజ్జాలు తినలేరు. పప్పు, ఆవకాయ్ పులిహోర లాంటివి ఎర్రబస్సు ఎక్కి వచ్చిన వాళ్లే తింటారు.. పిజ్జాల్లాంటివి మన లాంటి వాళ్లు తింటారు అంటూ తులసికి వినబడేలా లాస్య అంటుంది. అవన్నీ వింటూ లాస్య పిచ్చితనానికి, మూర్ఖత్వానికి తులసి నవ్వుకుంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్‌లో మళ్లీ నందు ఫైర్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఎంప్లాయిస్ ముందు అగౌరపరిచిందని, వన్ మంత్ సాలరీ ముందే ఇస్తాను అని చెప్పి నన్ను తక్కువ చేసిందంటూ నందు ఊగిపోయాడు.దానికి తోడు అభి కూడా రెచ్చిపోయాడు. అయితే లాస్య ఏదో పుల్ల వేసినట్టు కనిపిస్తోంది. అదేంటో రేపు చూడాలి.