• October 29, 2021

ఆరు వేలు మాకు ఎందుకు ఇవ్వరు.. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటర్ల ఆందోళన

ఆరు వేలు మాకు ఎందుకు ఇవ్వరు.. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటర్ల ఆందోళన

    హుజూరాబాద్ ఉప ఎన్నికల్లొ భాగంగా ఎన్ని రకాల ప్రలోభాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అక్కడ ఈటెల వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది. అయితే రేపు (అక్టోబర్ 30)న ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. తమ ఇంటి పక్కన వాళ్లందరికీ ఆరు వేలు ఇచ్చారు.. మాకు ఎందుకు ఇవ్వడం లేదు.. మేం ఓటర్లం కామా? అంటూ కొందరు ఓటర్లు రోడ్డు మీదకు రావడంతో రచ్చ రచ్చగా మారింది.

    ఓటుకు డబ్బులు ఇవ్వడమే కాదు తీసుకోడం కూడా నేరమని తెలియని అమాయక ప్రజలున్నారని మరోసారి అర్థమైంది. ఇక ఈ ఉప ఎన్నికను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే దళిత బంధు అంటూ హడావిడిగా ప్రజల్లోకీ తీసుకెళ్లింది. కేవలం దళితులకే పది లక్షలు ఇస్తారా? మాకు ఇవ్వరా? అని మిగిలిన వర్గాల ప్రజలు ఆందోళన చెందారు.

    అలా ప్రతీచోటా ఇలాంటి ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఆరు వేలు ఇవ్వలేందంటూ కొందరు రోడ్డు మీదకు వచ్చిన వీడియోలు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక రేపు జరిగి పోరులో ఎవరు గెలుస్తారు? అన్నది చూడాలి. ఈటెల గెలుస్తాడా? టీఆర్ఎస్ గెలుస్తుందా? అని రాష్ట్రమంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Leave a Reply