• October 16, 2021

సీడబ్ల్యూసీ మీటింగ్.. ఈసారైనా అధ్యక్షుడిని ఎన్నుకుంటారా?

సీడబ్ల్యూసీ మీటింగ్.. ఈసారైనా అధ్యక్షుడిని ఎన్నుకుంటారా?

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నేడు (అక్టోబర్ 16) ప్రారంభమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు,దేశంలోని ప్రధాన సమస్యలు, రైతుల పోరాటం, పంజాబ్, చత్తిస్ గడ్‌లోని ఘటనల గురించి చర్చించబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ సారైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారా? లేదా? అనే చర్చ నడుస్తోంది.

    ఇప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతూ వస్తోంది. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వస్తోంది. పార్టీ బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించాలని అందరూ కోరుతున్నారు. అయితే ఈ సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

    Leave a Reply