• October 24, 2021

అది బహిరంగ రహస్యమే.. టీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి కామెంట్స్

అది బహిరంగ రహస్యమే.. టీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి కామెంట్స్

    తెలంగాణ మొత్తం కూడా హుజురాబాద్ ఎన్నికల వైపు చూస్తోంది. అక్కడ ప్రధానంగా ఈటెల రాజేందర్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ ఈటెల అన్నట్టుగా అక్కడి వ్యవహారం నడుస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్ కూడా సందు చూసి దూరేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఉపఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం హద్దులు కూడా దాటేస్తోంది. మొన్నటికి మొన్న కేటీఆర్ కొన్ని ఆరోపణలు చేశారు.

    రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ గోల్కొండ రిసార్ట్‌లో కలిశారంటూ కేటీఆర్ అన్నారు. ఆ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గోల్కొండ రిసార్ట్స్‌లో నేను ఈటెల కలిశామని కేటీఆర్ ఆన్నారు. అది బహిరంగ రహస్యమే. ఈటెలతో చీకటి ఒప్పందం కోసం కలవలేదు. వేం నరేందర్ రెడ్డి కుమారుడి లగ్న పత్రిక సందర్భంగా కలిశాను. కేసీఆర్ చేసే కుట్రలన్నీ కూడా ఈటెల వివరించారు. ఈటెల, కిషన్ రెడ్డి భేటీ ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ కాదా? అంటూ గతాన్ని తవ్వాడు.

    Leave a Reply