- October 24, 2021
ఇన్‌స్టాగ్రాంకు ట్విట్టర్‌లో మంచు లక్ష్మీ వార్నింగ్

మంచు లక్ష్మీ అంటే ఆషా మాషీ కాదు. ఆమె తలుచుకుంటే ఎవ్వరినైనా సరే నిలదీస్‌ఫై చేయగలదు. ఇప్పుడు తాజాగా మంచు లక్ష్మీ ఇన్ స్టాగ్రాం సంస్థ మీద కస్సుబుస్సులాడుతోంది. ఇన్ స్టాగ్రాం సంస్థకు తాను ఏదో రిక్వెస్ట్ పెట్టానని, అయినా ఇంత వరకు స్పందించలేదు అని మంచు లక్ష్మీ ఫైర్ అయింది. ఇన్ స్టాగ్రాం సంస్థను బెదిరిస్తూ ట్విట్టర్‌లో మంచు లక్ష్మీ విరుచుకుపడింది. అయితే మంచు లక్ష్మీ వేసిన ఈ ట్వీట్ కింద నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు.
హేయ్ ఇన్ స్టాగ్రాం.. మీకు నేను పర్సనల్‌గా ఓ ప్రశ్నను వేశాను.. నా సమస్య చెప్పుకున్నాను.. అయితే నేను మీ నుంచి త్వరగా, అనుకూలమైన సమాధానాన్ని ఆశించాను. కానీ మీరు ఇంకా పంపించడం లేదు అన్నట్టుగా మంచు లక్ష్మీ కాస్త వార్నింగ్ ఇచ్చేసింది. ట్విట్టర్‌లో మంచు లక్ష్మీ తన ఇన్ స్టా ఐడీని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు మంచు లక్ష్మీ ట్వీట్ మీద కౌంటర్లు వేస్తున్నారు.
ఏమైంది అక్క అని కొందరు సెటైరికల్‌గా అడుగుతున్నారు. వాళ్ల నాన్న మోహన్ బాబు ఎంటర్ కాక ముందే ఆ సమస్యను పరిష్కరించు లేదంటే.. ఫసక్ అవుతావ్ అని ఇన్ స్టాకు నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. ట్విట్టర్ నుంచి ఇన్ స్టాగ్రాంకు కంప్లైంట్.. వావ్ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయ్ అని మంచు లక్ష్మీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈమధ్య మాత్రం మంచు ఫ్యామిలీ ఫుల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో మంచు ఫ్యామిలీ ఇమేజ్ భారీగానే పెరిగింది.