• October 20, 2021

బంగారు మయం కానున్న యాదాద్రి.. విరాళంగా అన్ని కేజీలా?

బంగారు మయం కానున్న యాదాద్రి.. విరాళంగా అన్ని కేజీలా?

    తెలంగాణ రాష్ట్రానికి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని తలమానికంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. అక్కడి పనులను తనిఖీ చేశారు. వచ్చే ఏడాది దేవాలయప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. స్వామివారి విమానగోపురాన్ని స్వర్ణ తాపడం చేయించబోతున్నామన్నారు సీఎం కేసీఆర్. ఇందు కోసం 125 కిలోల బంగారం అవసరమని కేసీఆర్ తెలిపారు.

    ఈ క్రమంలోనే తమ కుటుంబం నుంచి కిలో మీద 16 తులాలు స్వామి వారికి కానుకగా ఇస్తామని తెలిపారు. ఇక మంత్రి మల్లారెడ్డి కేజీ, మేడ్చల్ నియోజకవర్గం నుంచి కేజీ ఇస్తారట. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కేజీల బంగారం ఇస్తారట. భాస్కర్ రావు కావేరి సీడ్స్ తరపున కేజీ, జీయర్ పీఠం నుంచి కూడా ఒక కేజీ బంగారం ఇస్తారట. చాలా మంది ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు బంగారం ఇస్తారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ పార్థ‌సార‌ధి రెడ్డి 5 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారట.

    Leave a Reply