• August 11, 2025

వార్ 2 ఈవెంట్.. కియారాను గాలికి వదిలేశారా?

వార్ 2 ఈవెంట్.. కియారాను గాలికి వదిలేశారా?

    ‘వార్ 2’ ఈవెంట్ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆగస్ట్ 14న రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ హృతిక్, ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడారు. వారిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్నారు. కానీ వార్ 2 ఈవెంట్‌లో ఏ ఒక్కరు కూడా కియారా పేరుని ఎత్తలేదు.

    ‘వార్ 2’లో కియారా బికినీ ధరించి కనిపించడం, బికినీ సీన్లు, బికినీ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ అంతా కూడా వార్ 2 ట్రైలర్, టీజర్‌లలో కియారా బికినీ సీన్లనే హైప్ చేశారు. అయితే కియారా పేరుని మాత్రం ఈ  ఈవెంట్‌లో ఎక్కడా ఎత్తలేదు. అసలు కియారా అని ఓ వ్యక్తి ఈ వార్ 2కి పని చేసిందని కూడా ఎవ్వరికీ గుర్తు లేదేమో అన్నట్టుగా కనిపించింది.