- November 12, 2021
Pushpaka Vimanam ట్విట్టర్ రివ్యూ.. ఓటీటీ చిత్రమే!
ఆనంద్ దేవరకొండ ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన పుష్పక విమానం సినిమా నేడు (నవంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల బొమ్మ పడింది. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈచిత్రానికి ప్రమోషన్స్ ఓ లెవెల్లో చేశారు. విజయ్ అంతా తానై ఈ చిత్రాన్ని ముందుండి నడిపించాడు. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. నిన్న మహమూబ్ నగర్‌లోని ఏవీడీ థియేటర్లో తమ సినిమాను ప్రీమియర్ షో వేసి చూసుకున్నారు దేవరకొండ బ్రదర్స్.
ఇక ఇప్పుడు ట్విట్టర్‌తో పుష్పక సినిమా గురించి టాక్ మొదలైంది. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. ప్రథమార్థం యావరేజ్.. ద్వితీయార్థం బిలో యావరేజ్.. ఇది ఓటీటీ సినిమా.,. అక్కడే చూడొచ్చు.. థియేటర్ వరకు రావాల్సిన పని లేదని కొందరు అంటున్నారు. ప్రథమార్థం అంతా కూడా సుందర్ భార్య లేచిపోవడం, దాన్ని సమాజానికి తెలియకుండా దాచి పెట్టడం, తన భార్యలా నటించేందుకు వేరే అమ్మాయిని తీసుకురావడం వంటి సీన్లతో ప్రథమార్థంసాగిందట.
ఇక ద్వితీయార్థంలో పోలీస్ ఆఫీసర్‌గా సునీల్ ఎంట్రీ, తన స్టైల్లో విచారణ కొనసాగించడం, మధ్యలో కొన్ని ట్విస్ట్‌లతో సినిమా ముందుకు సాగిందట. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సుందర్ ప్రయత్నించడం, అసలు క్రిమినల్ పట్టుబడటంతో కథ సుఖాంతం అవుతుందట. మొత్తానికి ద్వితీయార్థం మాత్రం అంత ఆసక్తికరంగా ఏమీ లేదని అంటున్నారు. మరి పూర్తి రివ్యూ వచ్చే సరికి టాక్ ఎలా మారుతుంది. సినిమా సంగతి ఏంటన్నది ఇంకాసేపట్లో తేలనుంది.