• November 12, 2021

Raja Vikramarka ట్విట్టర్ రివ్యూ.. ఆకట్టుకున్న కార్తికేయ

Raja Vikramarka ట్విట్టర్ రివ్యూ.. ఆకట్టుకున్న కార్తికేయ

    కార్తికేయ ఓ కమర్షియల్ హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 తరువాత మళ్లీ సక్సెస్ అందుకోలేకపోయాడు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా సక్సెస్ కొట్టలేకపోయాడు. చివరకు చావు కబురు చల్లగా అంటూ ప్రయోగం చేశాడు. కానీ అది కూడా వర్కవుట్ అవ్వలేదు. అయితే ఫలితాలతో సంబంధం లేకుండా ఇప్పుడు కార్తికేయ వరుసగా చిత్రాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నేడు(నవంబర్ 12) రాజా విక్రమార్క అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. ఇప్పటికే ట్విట్టర్‌లో రాజా విక్రమార్క గురించి ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. కార్తికేయ పర్ఫామెన్స్‌పై టాక్ నడుస్తోంది. సినిమా కథ, కథనాలు గురించి మాత్రమే కాకుండా కార్తికేయ నటన గురించి మాట్లాడుతున్నారు. తనికెళ్ల భరణి లీడ్ చేసే టీంలో కార్తికేయ ఉంటాడు. అయితే ఇలాంటి పాత్ర కార్తికేయకు కొత్తది కావడంతో.. బాగానే చేశాడని అంటున్నారు.

    అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది మరి కాసేపట్లో తెలియనుంది. ట్విట్టర్‌లో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ.. టైమ్ టు టైమ్ అప్డేట్లతో కామెంట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో పూర్తి రివ్యూ కాబోతోంది. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే.. కార్తికేయకు హిట్ పడేలా కనిపిస్తోంది.

     

    Leave a Reply