• November 12, 2021

మీరేం అనుకున్నా నేను పట్టించుకోను.. సంతానంపై ఉపాసన కొణిదెల

మీరేం అనుకున్నా నేను పట్టించుకోను.. సంతానంపై ఉపాసన కొణిదెల

    ఉపాసన కొణిదెల నెట్టింట్లో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉపాసన అనగానే అందరికీ ఓ విషయం గుర్తుకు వస్తుంది. రామ్ చరణ్ ఉపాసనల వారసులు ఎప్పుడు వస్తారు? వారు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారు అని ప్రశ్నలు సంధిస్తుంటారు. ఎప్పుడూ వాటి గురించి అడుగుతుంటారు. అయితే అది తమ వ్యక్తిగత విషయం అని ఇది వరకే ఉపాసన ఎన్నో సార్లు చెప్పింది. కానీ ఎప్పుడూ అదే ప్రశ్న ఎదురవుతుంటుంది.

    దానికి కారణం కూడా ఉంది. రామ్ చరణ్‌తో పాటు బన్నీ, ఎన్టీఆర్‌లు కూడా ఒకే సమయంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. వారేమో తండ్రులయ్యారు. వారసులు వచ్చారు. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఇంకా అలానే ఉన్నాడు. దీంతో అభిమానుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. అయితే తాజాగా ఉపాసన ఈ కామెంట్లపై స్పందించింది. కాస్త సీరియల్ టోన్‌లో చిన్నపాటి వార్నింగ్‌లా ఇచ్చేసింది. ఓ మీడియాతో ఈ విషయాలన్ని ఉపాసన పంచుకుంది.

    పిల్లలు కనడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతం. దానికి గురించి సోషల్ మీడియాలో అందరూ కామెంట్లు చేస్తుంటారు. ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా అది పెద్ద సెన్సేషన్ చేస్తుంది మీడియా. నా వ్యక్తిగత విషయాలు చెప్పాల్సిన పని లేదు. మీరేం అనుకున్నాను నాకేం అభ్యంతరం లేదు.. నేను వాటిని పట్టించుకోను.. సమయం వస్తే ఆ శుభవార్తను సంతోషంగా నేనే చెబుతాను అని ఉపాసన పేర్కొంది.

    Leave a Reply