- July 31, 2025
కింగ్డమ్ ట్విట్టర్ రివ్యూ.. కొండన్నకి హిట్

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం నేడు (జూలై 31)న థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీకి పెరిగిన హైప్, వచ్చిన బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సితార బ్రాండ్, గౌతమ్ తిన్ననూరి మీదున్న నమ్మకం, విజయ్ దేవరకొండ క్రేజ్ ఇలా అన్నీ కలిపి సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చేలానే ఉన్నాయి. బుకింగ్స్‌లో కింగ్డమ్ బాగానే జోరు చూపించింది. ఇక ఇప్పుడు ట్విట్టర్‌లో కింగ్డమ్ హవానే కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ సత్తాను చాటే చిత్రమని చాలా మంది చెబుతున్నారు. విజయ్ కింగ్డమ్ చిత్రంలో అదరగొట్టేశాడని అంతా ఒకే మాట అంటున్నారు. విజయ్‌ని గౌతమ్ బాగా చూపించాడని, విజయ్‌కి బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టే అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్‌గా ఉందని, సినిమా ఆరంభమే అదిరిపోయిందని చెబుతున్నారు.
ఫస్ట్ హాప్‌లో అక్కడక్కడా కాస్త స్లో అనిపిస్తుందట. కానీ స్టోరీ నుంచి గౌతమ్ మాత్రం డీవియేట్ కాలేదట. ఒక్క సీన్ కూడా పక్క దారి పట్టకుండా కథలో భాగంగానే వస్తుందట. సెకండాఫ్ కోసం భారీ సెటప్ రెడీ చేస్తాడట. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిందని అంటున్నారు. ఇక సెకండాఫ్ కూడా అంతే స్థాయిలో మెప్పిస్తుందట. కావాల్సినంత ఎమోషనల్ డెప్త్ ఉంటుందట. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుందట.
బీజీఎం, విజువల్స్, టెక్నికల్ వాల్యూస్, విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్, గౌతమ్ మేకింగ్, టేకింగ్ ఇవన్నీ పాజిటివ్ అంశాలే అవుతాయని, కొండన్నకి సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడిందని అంతా అంటున్నారు. ఇక రౌడీ అభిమానులు పండుగ చేసుకునే టైం వచ్చిందన్నట్టే.