• August 3, 2025

కింగ్డమ్‌కి మూడు రోజుల్లో ఎంత వచ్చిందంటే?.. తమిళంలో సగం రికవరీ

కింగ్డమ్‌కి మూడు రోజుల్లో ఎంత వచ్చిందంటే?.. తమిళంలో సగం రికవరీ

    కింగ్డమ్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంటోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం అభిమానుల్ని ఆకట్టుకుంటూ బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకున్నాడు. ఓపెనింగ్ డే 39 కోట్లు రాబట్టి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు కింగ్డమ్ మూడు రోజుల్లో సాధించిన వసూళ్లను చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతోన్నారు. దాదాపు వీకెండ్‌లోనే 80 శాతం వరకు రికవరీ చేసేలా కనిపిస్తోంది.

    రెండ్రోజుల్లో కింగ్డమ్ 53 కోట్ల వరకు రాబట్టింది. ఇక మూడు రోజుల్లో కింగ్డమ్ దుమ్ములేపేసింది. దాదాపు మూడో రోజు పద్నాలుగు కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అలా మూడు రోజుల్లో కింగ్డమ్ మూవీకి 67 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో అయితే ఇప్పటికే సగం రికవరీ చేసినట్టుగా సమాచారం. తమిళనాడు అడాప్టెడ్ సన్ అని నిరూపించుకున్నాడు విజయ్.