• August 2, 2025

అర్జున్ రెడ్డికి రూ. 5 లక్షలే – విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డికి రూ. 5 లక్షలే – విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ కెరీర్‌లో అర్జున్ రెడ్డి చిత్రం అలా మైలురాయిలా నిలిచిపోతుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం అంటూ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి. అర్జున్ రెడ్డి అయితే టాలీవుడ్ గతిని మార్చేసింది. అలాంటి అర్జున్ రెడ్డి సినిమాకు సందీప్ రెడ్డి వంగా, విజయ్ చాలా కష్టపడ్డారు. సందీప్ రెడ్డి వంగా అయితే ఈ చిత్రం కోసం ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారట. అలా ఎంతో కష్టపడి తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకులు మర్చిపోలేని విజయాన్ని అందించారు.

    విజయ్ తాజాగా కింగ్డమ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన అభిమానులు చూపించే ప్రేమ గురించి మాట్లాడారు. సినిమాలు చేయడం అనేది జాబ్.. కానీ ఈ జాబ్‌లో ఇంత ప్రేమ దొరుకుతుంది.. అభిమానులు అంతులేని ప్రేమను కురిపిస్తుంటారు.. వారి కోసం ఇంకెంతైనా కష్టపడాలనిపిస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అర్జున్ రెడ్డికి తనకు రూ. 5 లక్షలే వచ్చాయని, అప్పుడు అదే తనకు ఎక్కువ అని అన్నారు.

    అర్జున్ రెడ్డి మీద చూపించిన అభిమానం, తన మీద చూపించిన ప్రేమకు.. ఏదైనా తిరిగి చేయాలని అనుకున్నారట. అందుకే అర్జున్ రెడ్డికి వచ్చిన అవార్డుని వేలం వేశారట. అలా వచ్చిన రూ. 25 లక్షలతో అభిమానులకు వీలైనంత సాయం చేశారట.