• June 21, 2024

Ninda Movie Review నింద మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్‌లోని కొత్త కోణం

Ninda Movie Review నింద మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్‌లోని కొత్త కోణం

    Ninda Movie Review వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించాడు. కాండ్రకోట మిస్టరీ అంటూ ముందు నుంచీ అంచనాలు పెంచేశారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేయడంతో ఆసక్తి పెరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    కథ
    జడ్జ్ (తణికెళ్ల భరణి) తన చివరి కేసులో ఓ నిరపరాధి బాలరాజు (ఛత్రపతి శేఖర్)కు శిక్ష విధించానని బాధపడుతుంటాడు. నిరపరాధి అని నమ్ముతాడు కానీ.. సాక్ష్యాలన్నీ కూడా బాలరాజుకి వ్యతిరేకంగా ఉంటాయి. ఈ విషయాన్ని జడ్జ్ తన కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్)కి చెబుతాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్‌లో పని చేసే వివేక్ ఈ కేసుని సాల్వ్ చేసేందుకు బయల్దేరుతాడు. ఈ క్రమంలో వివేక్ చేసిన పనులేంటి? బాలరాజుని కేసులోంచి ఎలా బయటకు తీసుకొచ్చాడు? అసలు నేరస్థులను ఎలా పట్టుకుంటాడు? అసలు బాలరాజు, మంజుల గతం ఏంటి? ఈ కేసు ఏంటి? అన్నది కథ.

    నటీనటులు
    వరుణ్ సందేశ్ పూర్తిగా కొత్త పాత్రలో కనిపిస్తాడు. ఇంత వరకు కనిపించనట్టుగా కనిపిస్తాడు. సీరియస్ లుక్‌లో, సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటాడు. వరుణ్ సందేశ్‌ని చూసి ఆడియెన్స్ కచ్చితంగా సర్ ప్రైజ్ ఫీల్ అవుతారు. వరుణ్ సందేశ్‌లో ఇంత మంచి పర్ఫార్మర్ ఉన్నాడా? అని అనుకుంటారు. క్యూ మధు, అన్నీ, శ్రేయా రాణి పాత్రలు కీలకంగా ఉంటాయి. బాలరాజుగా శేఖర్ మెప్పిస్తాడు. జడ్జ్‌గా తనికెళ్ల భరణి, మైమ్ మధు ఇలా చాలా పాత్రలు సినిమాలో కీ రోల్ పోషిస్తాయి.

    విశ్లేషణ
    కాండ్రకోట మిస్టరీ అనగానే ఇదేదో దెయ్యం కథ అనుకుని ఉంటారు. టీజర్ ట్రైలర్ వచ్చాక ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. అసలు ఈ కథలోని మెయిన్ పాయింట్ చాలా పాతదే. అప్పుడెప్పుడో వచ్చిన అభిలాష నుంచి మొన్న వచ్చిన కృష్ణమ్మ వరకు ఇదే పాయింట్ కనిపిస్తుంటుంది. తప్పు చేయకుండానే జైల్లో శిక్ష అనుభవిస్తుంటారు. అలాంటి వారిని బయటకు తీసుకు రావడానికి ఎవరో ఒకరు సాయం చేస్తుంటారు. ఈ నింద చిత్రంలో హ్యూమన్ రైట్స్ నుంచి వివేక్ వస్తాడు.

    తప్పు చేయని వారికి శిక్ష పడకూడదనే కాన్సెప్ట్ చుట్టూ ఈ నింద తిరుగుతుంది. ఈ సినిమా కోసం రాసుకున్న పాయింట్ పాతదే అయినా కథనంలో ఓ కొత్తదనం చూపించాడు. ఇందులో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా వివేక్ కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళతో మాట్లాడటమే సాగుతుంది. ఇంటర్వెల్‌కి కథ ఆసక్తికరంగా మారుతుంది.

    ఇక సినిమాకు సెకండ్ హాఫ్ కీలకంగా అనిపిస్తుంది. ద్వితీయార్దంలో కథ ఆసక్తిగా సాగుతుంది. అసలు బాలరాజు, మంజు ఎవరు? వాళ్ళ కథలేంటి? వివేక్ కిడ్నాప్ చేసిన వాళ్ళ కథలేంటి?ఇలా ఒక్కో చిక్కు ముడు విప్పుతూ ముందుకు కథను తీసుకెళ్తారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు రెగ్యులర్‌‌గా చూసేవాళ్లకు మాత్రం ట్విస్ట్ అర్థమైపోతుంది. క్లైమాక్స్‌లో ఊహించని ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు అనే పాయింట్‌ను డైరెక్టర్ బాగానే అల్లుకున్నాడు.

    టెక్నికల్‌గా చూసుకుంటే.. తక్కువ లొకేషన్స్‌లో తీసినా విజువల్స్ బాగుంటాయి.. ఆర్ఆర్ బాగుంటుంది. పాటలుఓకే అనిపిస్తే.. మాటలు ఆలోచింపజేస్తాయి. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి. మొదటి సినిమానే అయినా అద్భుతంగా నిర్మించాడు.

    రేటింగ్ 3