- October 17, 2021
రీ ఎంట్రీపై మనసులో మాట బయటపెట్టిన వడ్డే నవీన్

వడ్డే నవీన్ ఒకప్పుడు అందరికీ హాట్ ఫేవరేట్. చేసింది కొన్ని చిత్రాలే అయినా ప్రేక్షకుల్లో ఎప్పటికీ నిలిచిపోయేలాంటి సినిమాలు చేశాడు. పెళ్లి, కోరుకున్న ప్రియుడు వంటి లవ్ స్టోరీ చిత్రాల్లో నటించి అమ్మాయిల మనసులను దోచుకున్నాడు. ఆ తరువాత కాలక్రమేణ నవీన్ సినిమాలను తగ్గించాడు. గురు చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. శ్రీహరి, నవీన్ కలిసి చేసిన ఆ చిత్రం అంతగా వర్కవుట్ అవ్వలేదు. అయితే గత కొన్నేళ్లు నవీన్ తెరకు దూరంగా ఉండిపోయాడు.
రెండేళ్ల క్రితం నవీన్ తన తనయుడికి సంబంధించిన ఫంక్షన్ చేశాడు. ఆ సమయంలో ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా ఆ ఈవెంట్‌కు వెళ్లారు. అప్పుడే నవీన్, ఆయన ఫ్యామిలీ ఫోటోలు బయటకు వచ్చాయి. అంత వరకు వడ్డే నవీన్‌కు సంబంధించిన అంశాలేవీ కూడా బయటకు రాలేదు. అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా వడ్డే నవీన్ గురించి వెదుకులాట ప్రారంభించింది. మరీ ముఖ్యంగా అలీతో సరదాగా షోలో అయితే యూట్యూబ్ వీడియో కింద వడ్డే నవీన్ గురించి కామెంట్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి.
ఆ షోకి వడ్డే నవీన్‌ను పిలవండని నెటిజన్లు రిక్వెస్టులు పెడుతూనే ఉన్నారు. అయితే తాజాగా మా ఎన్నికల నేపథ్యంలో వడ్డే నవీన్ బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే కొు బాన్ని విషయాలపై స్పందించాడు. మా ఎన్నికలు బాగానే జరుగుతున్నాయని, అందరూ కలిసి ఉంటేనే బాగుంటుందని అన్నాడు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఏదైనా సందర్భం ఉంటేనే మీడియా ముందుకు రావాలని అనుకుంటున్నాను.. అందుకే నేను బయట ఎక్కువగా కనిపించడం లేదని అన్నాడు. మంచి స్క్రిప్ట్ దొరికితేనే సినిమా చేస్తాను అని ఖరాఖండిగా చెప్పేశాడు.