- October 17, 2021
ది గ్రేట్ రిజిగ్నేషన్.. సంస్థలపై ఉద్యోగుల తిరుగుబాటు
కరోనా వేళ ఉద్యోగులు ఎంతగా బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు అనుభవించారో అందరికీ తెలిసిందే. అయితే కొన్ని చోట్ల కొన్ని సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసి పారేశాయి. ఇక మిగిలిన వారితో నానా చాకిరీ చేయించుకున్నాయి. తక్కువ వేతనం ఇస్తూ ఎక్కువ పని చేయించుకున్నాయి. అలా పని చేసే చోట ఏర్పడ్డ అసమానత్వం ఉద్యోగుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అందుకే ఈ ది గ్రేట్ రిజిగ్నేషన్ అనే ఉద్యమం పుట్టుకొచ్చిందట.
అమెరికాలో ప్రస్తుతం ఈ పదం ఎక్కువగా వినిపిస్తోందట. చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త కొలువులను వెతుక్కుంటున్నారట. ముఖ్యంగా రెస్టారెంట్లు, రిటైల్, హెల్త్ కోర్ వంటి విభాగాల్లోని ఉద్యోగులు మాత్రం ఎక్కువగా వారి వారి కొలువులకు రాజీనామా చేస్తున్నారట. ఒత్తిడి వాతావరణంలో పని చేసినా కూడా తక్కువగా వేతనాలు అందుతుండటంపై తిరుగుబాటుగా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొందట.
క్విట్ మై జాబ్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో సంస్థ మీద ఆరోపణలు చేస్తూ ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారట. అయితే ఈ దెబ్బకు కంపెనీలు దిగొచ్చాయట. వేతనాల్లో సవరణలు చేశారట. గంటకు 15 డాలర్లు ఇస్తామని ముందుకు వచ్చాయట. అమెరికా చరిత్రలో రెస్టారెంట్లు, బార్లలో పని చేసేవారి వేతనం గంటకు 15 డాలర్లు చేరిందట.