- November 24, 2021
అమ్మ బర్త్ డే.. మళ్లీ ఎప్పుడు వస్తావ్ అమ్మా.. పాట ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్

నటుడు, రచయిత అయిన ఉత్తేజ్ భార్య పద్మావతి గత రెండు నెలల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో తన భార్య చనిపోవడంతో ఉత్తేజ్ కన్నీరుమున్నీరయ్యాడు. ఇక ఉత్తేజ్ చిన్న కూతురు పాట ఉత్తేజ్ అయితే అమ్మను తలుచుకుంటూ.. చిరంజీవి ఒళ్లో పడి పెదనాన్న అంటూ గుండెలవిసేలా ఏడ్చేసింది. అమ్మ చనిపోయిందన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను అంటూ పాట ఉత్తేజ్ ఎమోషనల్ అవుతోంది.
నేడు తన అమ్మ పుట్టిన రోజు అంటూ పాట ఉత్తేజ్ ఎమోషనల్ అయింది. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా.. కానీ వెరీ బ్యాడ్ బర్త్ డే నాకు.. నువ్ మాతో లేవనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను. నిన్ను ముట్టుకోవాలని ఉందమ్మా.. నిన్ను ఫీల్ అవ్వాలని ఉంది.. మళ్లీ ఇంతకు ముందులా నీ బర్త్ డేలను సెలెబ్రేట్ చేసుకోవాలని ఉంది.. అమ్మా నీ ఫుడ్‌ని చాలా మిస్ అవుతున్నాను..
ఎప్పుడమ్మా మళ్లీ వండుతావ్ నీ చేత్తో.. ఎన్నో మెమోరీస్ నీతో.. కానీ అవన్నీ మళ్లీ ఎందుకు అవ్వట్లే.. బీ స్ట్రాంగ్.. అమ్మ గుర్తొచ్చినప్పుడుల్లా మెమోరీస్ గుర్తు తెచ్చుకో అని చెబుతున్నారు.. కానీ ఏదేమైనా నా వల్ల అవ్వట్లే.. నువ్ లేకుండా నా లైఫ్ ఇంత వరెస్టా?.. అందరూ అంటున్నారు. అమ్మ నీ పక్కనే ఉంది కానీ నువ్ నాకు కనిపించడట్లేదు అమ్మ.. ఒకసారి కనిపించు అమ్మ..
నాతో షూటింగ్‌కు ఎవరు వస్తారు.. నన్ను ఎవరు రెడీ చేస్తారు.. ఎవరు ఫుడ్ తినిపిస్తారు.. ఏదో ొక విధంగా హ్యాపీగ ఉందాం నా మూడ్‌ని డైవర్ట్ చేద్దాం అంటే అస్సలు అవ్వట్లేదు.. కనీసం నా సక్సెస్, అక్క బేబీని, నాన్న డైరెక్టర్ అవ్వడం చూడలేదు ఎందుకు.. నాతో ట్రావెల్ చేస్తా అన్నావ్.. నాతో నే ఉంటా అన్నావ్.. మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయావ్.. నువ్ కనిపిస్తే కొట్టేయాలని ఉంది అమ్మా బాగా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అమ్మా’ అని ఉత్తేజ్ కూతురు పాట ఉత్తేజ్ భోరున ఏడ్చేస్తోన్న ఎమోజీలను షేర్ చేసింది.