• November 12, 2021

సమంత వల్లే అలా జరిగింది.. అసలు విషయం చెప్పిన ఉపాసన

సమంత వల్లే అలా జరిగింది.. అసలు విషయం చెప్పిన ఉపాసన

    సమంత, ఉపాసనల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. మొన్నటి దీపావళి సెలెబ్రేషన్స్‌లో సమంత, ఉపాసన, శిల్పా రెడ్డి కలిసి రచ్చ చేశారు. అయితే వీరి స్నేహం గత ఏడాదికి పైగా మరింత బలంగా మారింది. గత లాక్డౌన్ సమయంలో ఉపాసన, సమంత కలిసి కొన్ని వీడియోలు చేశారు. కుకింగ్ వీడియోలంటూ సమంత ఎంతో హెల్దీ టిఫిన్‌ను ప్రిపేర్ చేసింది. కొత్తరకపు ఇడ్లీని సమంత పరిచయం చేసింది. హెల్త్, ఫిట్ నెస్‌కు సంబంధించి ఉపాసన URLife అనే మ్యాగజైన్, వెబ్ సైట్‌ను పెట్టిన సంగతి తెలిసిందే.

    వాటికి సమంత ఉపసంపాదకురాలు. అలా URLife కోసం సమంత కొన్ని వీడియోలు చేసింది. తన హెల్త్ సీక్రెట్లను చెప్పేసింది. అలా ఉపాసన, సమంతల మధ్య స్నేహం ఏర్పడింది. ఇక సమంత గత లాక్డౌన్ సమయంలో అర్భన్ ఫార్మింగ్, హెల్దీ కుకింగ్ రెసిపీస్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. వాటిని ఉపాసనకు కూడా సమంత నేర్పింది. అయితే తాజాగా ఉపాసన ఓ మీడియాతో ముచ్చటించింది. అందులో ఎన్నో విషయాల మీద స్పందించిన ఉపాసన.. సమంత గురించి చెప్పింది.

    తనకు ఈ అర్భన్ ఫార్మింగ్ గురించి చెప్పిందే సమంత అని, ఆమె దగ్గరి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అని ఉపాసన తెలిపింది. నేను తెలంగాణ బిడ్డను. మనం ఎక్కువగా నాన్ వెజ్ తింటాం. పండుగలు, దసరా రోజున కూడా నాన్ వెజ్ తింటాం. కానీ సమంత ఎడిట్ చేసిన ఆర్టికల్స్ చూశాక. నాన్ వెజ్ మానేశాను. సమంతది జెన్యూన్ లవ్ అంటూ ఉపాసన ప్రేమను కురిపించింది. మొత్తానికి సమంత వల్లే ఉపాసన.. నాన్ వెజ్‌కు దూరంగా ఉంటోందన్న మాట.

    Leave a Reply