• May 14, 2024

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’ షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’ షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్

    సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

    తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రజినీకాంత్ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయడంతో చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.

    ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే. వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

    తారాగాణం : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, జీఎం సుందర్, రోహిణి, అభిరామి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ, సాబుమోన్ అబుసమద్, సుప్రీత్ రెడ్డి తదితరులు

    సాంకేతిక బృందం.

    బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
    ప్రొడ్యూసర్: సుభాస్కరన్
    రచయిత & దర్శకుడు: టీ.జే. జ్ఞానవేల్
    సంగీతం: అనిరుధ్ రవిచందర్
    డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి
    ప్రొడక్షన్ డిజైనర్: కె. కధీర్
    యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్
    ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
    క్రియేటివ్ డైరెక్టర్: బి కిరుతిక
    ఆర్ట్ డైరెక్టర్: శక్తి వెంకట్ రాజ్
    మేకప్: బాను బి – పట్టాణం రషీద్
    కాస్ట్యూమ్ డిజైన్: అను వర్ధన్ – వీర కపూర్ – దినేష్ మనోహరన్ – లిజి ప్రేమన్ – సెల్వం
    స్టిల్స్: మురుగన్
    పబ్లిసిటీ డిజైన్: గోపీ ప్రసన్న
    VFX పర్యవేక్షణ: లవన్ – కుసన్
    టైటిల్ యానిమేషన్: ది ఐడెంట్ ల్యాబ్స్
    సౌండ్ డిజైన్: సింక్ సినిమా
    సౌండ్ మిక్సింగ్: కన్నన్ గణపత్
    రంగు: రఘునాథ్ వర్మ
    DI: B2H స్టూడియోస్
    DIT: GB రంగులు
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుబ్రమణియన్ నారాయణన్
    హెడ్ అఫ్ లైకా ప్రొడక్షన్స్: G.K.M. తమిళ కుమరన్
    లేబుల్: సోనీ మ్యూజిక్
    పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)