• December 11, 2021

DHEE 14 : ‘ఢీ’ నుంచి రష్మీ సుధీర్ అవుట్.. కారణం అదేనా?

DHEE 14 : ‘ఢీ’ నుంచి రష్మీ సుధీర్ అవుట్.. కారణం అదేనా?

    Sudigali Sudheer Rashmi Gautam బుల్లితెరపై రష్మీ సుధీర్ చేసే హంగామాకు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. ఈ ఇద్దరి కలిసి చేసిన ఏ షో కూడా ఫ్లాప్ అవ్వలేదు. సుధీర్ రష్మీ కలిసి ఉంటే చాలు.. ఆ షో హిట్ అవుతుందని అంతా అంటారు. అది నిజం కూడా. రష్మీ సుధీర్ అలా జోడిగా తెరపై కనిపిస్తే చాలు, మేం చూస్తుండిపోతామని అభిమానులు కామెంట్లు పెడుతుంటారు. అయితే తాజాగా ఢీ షో నుంచి రష్మీ సుధీర్ అవుట్ అయ్యారు.

    ఈ వారం ఢీ 13వ సీజన్ అయిపోయింది. వచ్చే వారం ఢీ 14వ సీజన్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో రష్మీ సుధీర్ కనిపించలేదు. గణేష్ మాస్టర్, ప్రియమణి, ఆది మాత్రమే ఉన్నారు. సుధీర్ రష్మీ కనిపించలేదు. దీంతో అందరూ కూడా సుధీర్ రష్మీ గురించి అడుగుతున్నారు. వారు ఎక్కడ? ఎందుకు ప్రోమోలో లేరంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.

    సుదీర్ అన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మాకు సుదీర్ అన్న కావాలి ఈ షో లో, జై సుదీర్ అన్న… సుదీర్ రష్మీ లేకుండా కష్టం షో.. ఈ షో మళ్ళీ రావడం ఎంత సంతోషం గా ఉందో సుదీర్ అన్న లేక పోవడం కూడా అంతే బాధగా ఉంది, సూదీర్ లేని షోని చూడటానికీ నా కళ్ళు ఒప్పుకున్నా నా మనస్సు ఒప్పుకోవడంలేదు సార్, మేము ఈ షో చూస్తుంది డాన్స్స్ కోసం కాదు సుదీర్ అన్న కామెడీ కోసం అంటూ ఇలా యూట్యూబ్‌లో కామెంట్ల వర్షం కురుస్తోంది.

    అయితే సుధీర్ రష్మీలు ఈ షో నుంచి తప్పుకోవాడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇతర ప్రాజెక్ట్‌లతో సుధీర్ బిజీగా ఉండటంతో ఢీ షోను వదులుకున్నాడని టాక్. ఇక రష్మీ సైతం సినిమా పనుల్లో బిజీగా ఉందని, అందుకే ఆమె కూడా వెళ్లిపోయిందనే ప్రచారం అందుకుంది. అయితే ఇప్పుడు మాత్రమే సుధీర్ రష్మీ కనిపించరు.. కొన్ని రోజులు తరువాత మళ్లీ వస్తారు.. బిజీగా ఉండటం వల్ల ఈ ఎపిసోడ్ షూటింగ్‌కు రాలేదని అంటున్నారు.

    మొత్తానికి సుధీర్ రష్మీ లేని ఢీ షోను చూసేందుకు ఎవ్వరూ ఇష్టపడటం లేదు. ఈ 14వ సీజన్‌లో అఖిల్ వచ్చాడు. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్.. ఈషోలో జూనియర్స్‌కు టీం లీడర్‌గా ఉంటాడట. అఖిల్ వల్ల ఈ షోకు ఎలాంటి ఉపయోగం ఉండదు, అతనికి అంత స్పాంటేనిటీ ఉండదు, హ్యూమరస్ కూడా ఉండదు. అతనితో ఎలా నెట్టుకొస్తారో చూడాలి.

    Leave a Reply