- December 11, 2021
Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. దేవయాణి వలలో చిక్కిన వసు.. ఆగ్రహంచిన రిషి
గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ ఎసిసోడ్ అంటే శనివారం నాటి ధారవాహిక అయిన Guppedantha Manasu Episode 318 లో దేవయాణి వేసిన వలలో వసు చిక్కుతుంది. అందుకే నేటి ఎపిసోడ్లో అన్ని రకాల ప్లాన్లు వేసింది దేవయాణి. రిషి వసుల మధ్య దూరం పెంచేందుకు దేవయాణి పథకం రచించింది. అలా మొత్తానికి దేవయాణి దెబ్బకు వసు రిషిల మధ్య దూరం పెరిగేట్టు కనిపిస్తోంది. గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఎలా కొనసాగిందో ఓ సారి చూద్దాం.
జగతి ఇంటికి వచ్చి దేవయాణి గొడవ పెట్టుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. అర్దరాత్రుళ్లు తిరగడం ఏంటో.. నువ్వైనా నీ శిష్యురాలికి చెప్పొచ్చు కదా? అని దేవయాణి అంటే.. ఒకరు చెబితే వినేంత చిన్నదాన్ని కాదు.. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు.. మీకు డౌట్ ఉంటే.. వెళ్లి రిషి సర్ని అడగొచ్చు అని వసు కౌంటర్ వేస్తుంది.. మాటకు మాట చెబుతుంది. ఇదే దూకుడు తగ్గించుకో అని దేవయాణి అంటుంది..
ఏం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన పని లేదు..నేన ఏం చేయాలో.. ఎక్కడెక్కడికి వెళ్లాలో.. చెప్పాల్సింది మీరు కాదు అంటూ వసు రెచ్చిపోతుంది.. వాళ్లు అరిచారని మనం అరిస్తే.. వాళ్లకు మనకు తేడా ఉండదు.. అని జగతి అంటుంది. ఒకరు అరుస్తూ చెబితే.. అదే భాషలో మనం కూడా సమాధానం ఇవ్వాలి మేడం.. మీలా మృదువుగా చెబితే అర్థం కాదు అంటూ వసు దుమ్ముదులుపుతుంది.
ఇదే నా చివరి హెచ్చరిక.. నేనేం చేయగలనో నీకు తెలుసు..పద్దతి మార్చుకోకపోతే.. పరిస్థితులు వేరేలా ఉంటాయి.. అని దేవయాణి హెచ్చరిస్తుంటుంది. మీరు వీధిలోకి వచ్చి అరిచినంత మాత్రాన మేం సమాధానం చెప్పాల్సిన పనిలేదు.. అని దేవయాణి అంటుంది. మీ ఇద్దరికి ఈ దేవయాణి అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని దేవయాణి అంటుంది.. మీ బెదిరింపులకు భయపడే అవసరం లేదు.. తప్పు చేయలేదు.. సమాధానం చెప్పాల్సిన పని లేదు అంటూ వసు ఇంకాస్త దూకుడుగా సమాధానాలు చెబుతుంది.. వసు మాట్లాడొద్దని చెప్పానా? అంటూ జగతి అక్కడి నుంచి తీసుకెళ్తుంది.
ఇక రిషికి దేవయాణి ఫోన్ చేస్తుంది. లంచ్ టైంలో మాట్లాడతాను అని చెప్పి కట్ చేస్తాడు. రిషి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు.. అబద్దం చెబుతున్నాడు.. అంటే దూరం అవుతున్నాడు.. జగతికి దగ్గరవుతున్నాడు.. పోనీలే అనుకుంటుంటే.. నువ్ నీ శిష్యపరిమాణువు ఎక్కువ చేస్తున్నారు.. మీ ఆటలు ఎలా సాగుతాయో నేనూ చూస్తాను.. అంటూ దేవయాణి ఓ ప్లాన్ వేసేస్తుంది.
తప్పు చేస్తే ఒప్పుకుంటాను.. పడతాను.. కానీ తప్పు లేకపోతే ఎవ్వరూ ఏమన్నా పడను.. అంటూ వసు చెబుతుంది. సమయం సందర్భం కూడా చూసుకోవాలి.. ఈ విషయాన్ని రిషి దగ్గర ప్రస్థావించకు అని జగతి అంటుంది.. చెప్పకపోతే రిషి సర్‌కు ఎలా తెలుస్తుంది.. చెప్పకపోతే మనమే దోషుల్లా ఉంటాం.. దాని కంటే నిజం చెప్పడమే కరెక్ట్.. అని వసు అంటుంది
నువ్ ఆవేశంలో మాట్లాడుతున్నావ్.. నువ్ చెప్పిందాంట్లో నిజం ఉంది.. నేను అనే దాంట్లో ఆలోచన ఉంది.. రిషి దృష్టిలో దేవయాణి ఓ దేవత. రిషి చెప్పినా నమ్మడు.. డిస్టర్బ్ అవుతాడు.. అంటూ జగతి చెబుతుంది. మీరెన్ని చెప్పినా కూడా నా మనసు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు..అంటూ వసు అనే సమయంలోనే రిషి ఎంట్రీ ఇస్తాడు.
ఏంటి లేటు అని రిషి అడుగుతాడు. మీ పెద్ద.. అని వసు అనేలోపు జగతి కంట్రోల్ చేస్తుంది. నా ముందు వసుని ఇలా కంట్రోల్ చేస్తోందంటే నేను లేని సమయంలో ఇంకెలా చేస్తుందో అని జగతి గురించి తప్పుగా ఆలోచిస్తాడు రిషి. టైం అవుతోంది క్లాసుకు వెళ్తావా? అని వసుని పంపించే ప్రయత్నం చేస్తుంది వసు. నేను చిన్నప్పుడు కొన్ని బొమ్మలతో ఆడుకునేవాడిని.. అవి కీ ఇస్తే కదిలేవి.. మనుషులు కూడా అలానే తయారయ్యారు.. అంటూ రిషి తనలో తాను అనుకుంటాడు.
క్లాస్ అయిన తరువాత ఒక సారి నా దగ్గరకు రా అని వసుకు చెప్పి వెళ్లిపోతాడు రిషి.. క్లాస్ ఇస్తాడేమో మేడం అని వసు అంటుంది. రిషి దృష్టిలో దేవయాణి ఓ దేవత.. మనం ఏం చెప్పినా వినడు.. ఎప్పుడొ ఒకప్పుప్పు తెలుసుకుంటాడు లే అని జగతి అంటుంది. నిజాలు చెప్పి ఒప్పించొచ్చు కదా? ఎప్పుడో తెలుసుకుంటాడని అలా వదిలేయ లేం కదా? అని వసు అంటే.. కాలేజ్‌లో ఈ డిస్కషన్స్ వద్దు అని చెప్పి జగతి వెళ్లిపోతుంది.
మేడం ఏంటో ఒక్కోసారి అర్థం కాదు. ఇలా ఓపిక పడితే.. ఎక్కువ కష్టాలు వస్తాయి.. ధైర్యంగా ముందుకు వెళ్తే.. తాడో పేడో తేలుతుంది కదా?. అని వసు అనుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే రెస్టారెంట్లో జగతి, వసు ఉంటారు. నువ్ ఇలానే సీరియస్‌గా సర్వ్ చేస్తే కస్టమర్లు ఫీలవుతారు కదా?.. మన వ్యక్తిగత అభిప్రాయాలు వృత్తి మీద చూపించొద్దు.. అని వసుకు జగతి సలహాలు ఇస్తుంది.
రిషి నిన్ను కాలేజ్ అయ్యాక కలవమన్నాడు కదా? కలవలేదా? కలవకపోతే .. రిషికి కోపం వస్తుంది కదా? అని జగతి అంటుంది. కోపం వస్తుందనే వెళ్లలేదు. నాకు కోపం వచ్చిందని వెళ్లలేదు.. రిషి సర్కి ఎదురుచెబితే.. మళ్లీ మీరు బాధపడతారని వెళ్లలేదు అని వసు చెబుతుంది.. వసు ఇంత దూరం ఆలోచించావ్ కదా?.. ఆ కోపాన్ని దూరం పెట్టలేవా? అని జగతి అడుగుతుంది.
నా కోపంలో న్యాయం ఉంది.. న్యాయంగా కూడా కోప్పడకపోతే.. అన్యాయం కదా? మేడం అని వసు అంటుంది. బాగా చెప్పావ్.. మన అనుకునే విషయంలో ఒక మెట్టు తగ్గితే ఏమవుతుంది.. అని జగతి అంటే.. రిషి సర్ విషయంలో అలా అనుకోవచ్చు కానీ దేవయాణి మేడం విషయంలో కాదు అని వసు అంటుంది. కలవడం వీలు కాదని మెసెజ్ పెట్టాను అని వసు అంటుంది.. దేవయాణి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేస్తున్నావేమో.. అని జగతి అనే సరికి రెస్టారెంట్ వద్దకు దేవయాణి వస్తుంది.
ప్లాన్ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటుంది. రిషి రాగానే నాకు మెసెజ్ చేయ్ అని ఒకడిని పురామాయిస్తుంది. అలా మొత్తానికి రెస్టారెంట్లో మంచి ప్లాన్ వేసింది దేవయాణి. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే ధరణి, మహేంద్రల మీద్ సీన్ ఓపెన్ అవుతుంది. ఏంటి ధరణి రమ్మన్నావ్ అంటూ మహేంద్ర కంగారుగా అడుగుతాడు.. మీకొక విషయం చెప్పాలి.. అత్తయ్య గారు బయటకు వెళ్లారు అని ధరణి అంటుంది..
వెళ్తే వెళ్లారు మనకేంటి..అని మహేంద్ర లైట్ తీసుకుంటాడు. అయ్యో మామయ్య గారు.. జగతి అత్తయ్యను కలవడానికి వెళ్లారు.. ఈటైంలో జగతి అత్తయ్య, వసులు ఎక్కడున్నారో తెలుసుకుని వెళ్లారు.. అని ధరణి చెబుతుంది. జగతి చూసుకుంటుందిలే.. వాళ్ల విషయంలో మనం జోక్యం చేసుకుంటే సమస్య పెద్దది అవుతుంది.. అని మహేంద్ర అంటాడు. ఈ మాటలన్నీ కూడా రిషి వింటాడు. పెద్దమ్మ.. వాళ్ల గురించి ఎందుకు ఎంక్వైరీ చేసింది.. అంటూ ఆలోచిస్తూ రెస్టారెంట్‌కు బయల్దేరుతాడు.
నన్ను క్షమించు నాన్న.. నీకు నచ్చని వాళ్ల దగ్గరికి నేను వెళ్తున్నాను.. అది కూడా నీ కోసమే.. అంటూ ఓ వాయిస్ మెసెజ్ పెడుతుంది రిషికి. ఇక రిషి కారు సౌండ్ వినడంతో.. మన మాటలు విన్నాడంటావా? అని ధరణితో మహేంద్ర అంటాడు. అటు నుంచి అటే ఎందుకు వెళ్తున్నాడు.. అంటూ ధరణి కంగారు పడుతుందది. ఇప్పుడే వస్తానమ్మ అంటూ మహేంద్ర కూడా బయల్దేరుతాడు.
రెస్టారెంట్‌కు వస్తే ఏంటి అలా భయపడుతున్నారు అని దేవయాణి అంటుంది. వస్తే ఏంటంటా భయం.. కాఫీ తాగడానికి వచ్చాను.. అని దేవయాణి అంటుంది. అక్క ఇంత సేపు ఇలా ఇక్కడ ఉందంటే కచ్చితంగా ఏదో ఒక ఆలోచన ఉండాలి అని జగతి అనుకుంటుంది.. ఈ మధ్య బాగా మాట్లాడుతున్నావే.. ఎదురు సమాధానాలు చెబుతున్నావ్ అని వసుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది..
సమాధానాలు చెప్పకపోతే ఈ సమాజంలో బతకలేం.. అని వసు అంటుంది. అచ్చం నీలానే మాట్లాడుతోంది అని దేవయాణి అంటుంది.. మా మేడంతో పోల్చకండి అని వసు ఎదురు సమాధానం చెబుతుంది.. నువ్ మీ మేడంలా కాదులే.. నువ్ అంతకు మించి.. అని అంటుంది దేవయాణి. రెండు కాపీలు తీసుకురా వసు అని జగతి అంటే.. మూడు తీసుకుని రా.. నువ్ కూడా తాగు అని వసుని దేవయాణి అంటుది.
నాతో కాఫీ తాగేందుకు కూడా భయపడుతున్నావా? అని వసుని ఇంకా రెచ్చగొడుతుంది దేవయాణి. నాకెందుకు భయం.. అని వసు అంటే.. ఇప్పుడు జగతి శిష్యురాలిలా కనిపిస్తున్నావ్ అని దేవయాణి అంటుంది. నాకు కావాల్సిన వాళ్లు వచ్చారు.. శ్రేయోభిలాషులు వచ్చారు.. స్ట్రాంగ్ కాఫీ తీసుకురా నాని అని వసు ఆర్డర్ చెబుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక వచ్చే వారం నాటి ఎపిసోడ్లో దేవయాణి వలలో వసు చిక్కుతుంది. ఆమె వేసి ప్లాన్‌కు వసు బలైపోయేలా ఉంది. ఎదిగిన కొడుకు మీదకు అమ్మాయిని ఉసిగొల్పుతావా? అని దేవయాణి రెచ్చగొడుతుంది. దీంతో వసు రెచ్చిపోతుంది. ఇంతలో రిషి వస్తాడు. అది గమనించిన దేవయాణి.. కిందపడిపోయినట్టు.. అది కూడా వసు తోసేసినట్టు నటిస్తుంది. దీంతో వసు మీద రిషి ఫైర్ అవుతాడు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య మరోసారి దూరం పెరిగేలా ఉంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- Guppedantha Manasu Daily serial Episode
- Guppedantha Manasu New Episode
- Guppedantha Manasu serial
- Guppedantha Manasu serial Episode 318
- Guppedantha Manasu serial today Episode
- Guppedantha Manasu serial today Episode 318
- guppedantha manasu serial yesterday episode
- Guppedantha Manasu Today Episode
- గుప్పెడంత మనసు
- గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్
- గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్
- గుప్పెడంత మనసు ఈరోజు సీరియల్
- గుప్పెడంత మనసు టుడే ఎపిసోడ్
- గుప్పెడంత మనసు డైలీ సీరియల్
- గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్
- గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ కావాలి
- గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్
- జగతి
- మహేంద్ర
- రిషి
- వసు
- వసుధార