• January 15, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. అందుకే ఆ ఇద్దరి మీద కన్నేసిందట.. దీపపై రుద్రాణి కుట్రలు

Karthika Deepam నేటి ఎపిసోడ్.. అందుకే ఆ ఇద్దరి మీద కన్నేసిందట.. దీపపై రుద్రాణి కుట్రలు

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 15 శనివారం నాటి Karthika Deepam Episode 1250 ధారావాహికలో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు. ఇక మరో వైపు బస్తీలో మోనిత దేవత అవుతుంది. రంగరాజు, హిమల మీద రుద్రాణి ఎందుకు కన్ను వేసిందో అసలు గుట్టు విప్పేసింది. అలా కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    నానమ్మ, తాతయ్యలు గుర్తుకు రావడం లేదా? అని పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతాడు కార్తీక్. కొన్ని చెప్పలేను.. ఇంకొన్ని చెప్పినా అర్థం కావు అంటూ పిల్లలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు… కారు బంగ్లాలు అన్నీ వదిలేసి వచ్చాం.. నువ్ పెద్ద డాక్టర్‌వి.. ఇక్కడ మనం ఇలా ఉన్నా అని పిల్లలు అంటారు. అవన్నీ నేను ఎప్పుడో మరిచిపోయాను.. మీరు కూడా మరిచిపోండి..అని పిల్లలకు చెబుతాడు.

    ఇక మోనిత తమను కాపాడటంతో లక్ష్మణ్, అరుణలు దేవతగా కొలుస్తారు. డాక్టర్‌గా అది నా బాధ్యత.. అని మోనిత కలరింగ్ ఇస్తుంది. దీపమ్మ మీద అభిమానంతో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాం.. మీ స్థానంలో ఇంకొకరు ఉంటే కళ్ల ముందు ప్రాణాలు పోతున్నా కూడా.. పట్టించుకోరు.. అని మోనిత మీద ప్రేమను కురిపిస్తారు. అరుణ నేను ఇచ్చిన మందులు వాడుతున్నావా? అని మోనిత మరింతగా నటిస్తుంది.

    డబ్బులు ఇస్తుండటంటే.. లక్ష్మణ్ నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా.. మీరు బాగుంటే చాలు.. డబ్బులు బాగానే ఉన్నాయి నాకు.. అని మోనిత అంటుంది.ఈ బస్తీలో ఎవరు ఏమన్నా.. ఏ అవసరం ఉన్నా కూడా నన్ను పిలవండి అని లక్ష్మణ్ అంటాడు.. ఏ పని ఉన్నా నేను చేసి పెడతాను.. మీరు మా పాలిట దేవత.. అని అరుణ ఎమోషనల్ అవుతుంది. థ్యాంక్యూ మీ అభిమానం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.. అని మోనిత అంటుంది. వాళ్లు వెళ్లిపోతారు. నీ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అయిపోతోన్నారు దీపక్క..అని మోనిత సంబరపడుతుంది.

    నా పిల్లల జోలికొస్తే ఊరుకునేది లేదు.. అని దీప అన్న మాటలను రుద్రాణి గుర్తు చేసుకుంటుంది. ఈ కాఫీ ఎక్కడ చేశావ్ రా.. అని తన మనిషిని అంటుంది. మనఇంట్లోనే అక్కా..అని చెప్పడంతో ఆ కాఫీని విసిరి కొట్టేస్తుంది. ఆ గదిని వాడొద్దని చెప్పాను కదా? ఒక్కసారి చెబితే అర్థం కాదా? ఎంత దైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి వంట చేస్తుంది? నేనంటే భయం పోయిందా? అని రుద్రాణి చిందులు తొక్కుతుంది.

    ఆ వంటగదిని వాడొద్దు.. మైలపడింది.. అందులోకి వెళ్తే.. దీప ధైర్యమే గుర్తుకువస్తుంది. అన్ని కష్టాల్లో ఉండి కూడా అలా ఎలా ఉంటుందో.. వాళ్లు నాకు దత్తత ఇచ్చిన రోజునే వాడుతాను.. రంగరాజు వీపు మీద పుట్టుమచ్చ ఉందిరా అలా ఉంటో రాజయోగం.. అదొక సెంటిమెంట్.. హిమను చూస్తుంటే మా అమ్మను చూసినట్టుందిరా అదొక సెంటిమెంట్.. అందుకే ఆ ఇద్దరిని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను.. అని అసలు విషయం చెబుతుంది రుద్రాణఇ.

    వారిని దత్తత తీసుకున్నప్పుడే వంటగదిని తెరుస్తాను.. బయటి నుంచి కాఫీని తీసుకురా.. అని రుద్రాణి అంటుంది. ఏంట్రా గుణుగుతున్నావ్ అని రుద్రాణి అంటుంది. నీ ఆలోచనలు అర్థం కావడం లేదు అక్క.. అని అంటాడు. నీక్కూడా అర్థమైతే.. ఈ రుద్రాణి ఎలా అవుతుందిరా అని అంటుంది. దీపమ్మ నీ కథకు శుభం కార్డు నేను ఇస్తాను అమ్మ..అని రుద్రాణి మళ్లీ ఏదో ప్లాన్ వేస్తుంది.

    మై డియర్ మమ్మీ మేం ఎక్కడికి వెళ్తాం.. అంటూ నాటి రోజులన్నీ గుర్తు చేసుకుంటాడు కార్తీక్. అమ్మనాన్నలతో సంతోషంగా గడిపిన రోజులను తలుచుకుంటూ, పిల్లల ప్రశ్నలకు గుర్తు చేసుకుని డాక్టర్ బాబు బాధపడ్డాడ. పిల్లల మనసులోకొత్త ప్రశ్నలు వస్తున్నాయి.. పెద్దోడా అని నానమ్మ పిలుస్తుంది కదా? గుర్తుకు రావడం లేదా? అని అడుగుతున్నారు.. తల్లిదండ్రులను మరిచిపోయావా? అని పరోక్షంగా అడుగుతున్నారు.. అని దీపతో కార్తీక్ చెప్పుకుంటాడు.

    నిజమే నేను వాళ్లను వదిలేశాను.. మా డాడీకి తల్లిదండ్రుల మీద ప్రేమ లేదా? అని అడుగుతున్నట్టే.. కదా? అక్కడ వారికి శోకం.. ఇక్కడ పిల్లలుక సౌకర్యం లేకుండా చేశాను.. కష్టాల్లో నిన్ను భాగస్వామ్యం చేశాను.. నీకు ఏనాడూ ఆనందాన్ని పంచలేదు.. నేనేం సాధించాను దీప.. ప్రతీసారి నేను ఓడిపోతోంటే నువ్ గెలిపించావ్.. చివరకు వెనక్కి చూుకుంటే.. ఏం మిగిలింది.. మోనిత నుంచి ప్రపంచం నుంచి పారిపోయి నుంచి వచ్చాం.. అక్కడే వదిలేసి వచ్చామని అనుకున్నాం కానీ అవన్నీ నా నీడలా వెంటే వచ్చాయని ఆలస్యంగా తెలిసింది.. నేను చేసిన పొరబాటుకు ఆస్తినంతా రాసిచ్చి ఉద్దరించాను అని అనుకున్నాను కానీ నా వాళ్లను బలి చేస్తున్నాను అని అనుకోలేదు అంటూ కార్తీక్ వెళ్లిపోతాడు..

    అప్పిగాడు మోనితతో దిగిన సెల్ఫీని చూసుకుని మురిసిపోతాడు. మంచిది అంటూ పొగిడేశాడు. అడగ్గానే సెల్ఫీ ఇచ్చింది. టిప్ కూడా ఇచ్చింది ఇంకేం కావాలి అని అప్పిగాడు కార్తీక్‌తో అంటాడు. టీజర్ చూడగానే బొమ్మ హిట్టా? లేదా? అని చెబుతాడు.. అప్పుగాడు ఇక్కడ.. స్టార్ హీరో అవుతా స్టార్ హోటల్ కడతా? అది కూడా నువ్వే చూసుకో.. అని కార్తీక్‌కు చెబుతాడు.

    అక్కడ కూడా ఇదే పోస్ట్ ఇస్తావా? అని జోక్ వేస్తాడు కార్తీక్. నువ్ కూడా అందంగానే ఉంటావ్ కదా?. నువ్ కూడా హీరోగా ట్రై చేయోచ్చు కదా? అని కార్తీక్‌ను అప్పుగాడు అనడం నవ్వేస్తాడు. రైస్.. అని కస్టమర్లు అడుగుతారు. వాడు అయితే అడిగినా రాడు.. నువ్ అడక్కముందే వచ్చి వడ్డిస్తున్నావ్ అని కార్తీక్‌ను కస్టమర్లు పొగుడుతారు. బావా ఈ ఫోటోను పెద్దది చేసి హోటల్‌లో పెడతా.. కన్నడ హీరోయిన్ అని కలరింగ్ ఇస్తాను.. అని అప్పిగాడు రెచ్చిపోతాడు. మీ ఇద్దరి జోడి సూపర్ ఉంటుంది బావ.. అని అప్పిగాడు అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. రుద్రాణి మాటలను తలుచుకున్న దీప.. ఆమె ఆలోచనలను పసిగడుతుంది. ఎలాగైనా అప్పు తీర్చుకుండా ఉండాలని చూస్తోందని తెలుసుకుంటుంది. మొత్తానికి అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లి తన తల్లిదండ్రులను చూస్తాడు.

    Leave a Reply