- January 15, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. మనసులో అనుకున్న రిషి.. వసు దెబ్బకు గౌతమ్ మొహం మాడింది
గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 15 శనివారం నాటి Guppedantha Manasu Episode 348 ధారావాహికలో మంచి సీన్లు పడ్డాయి. లవ్ లెటర్ రాసినవాడిని చూడాలని ఉందంటూ మరోసారి తన కోరికను రిషికి చెప్పింది వసు. ఇక లవ్ లెటర్ రాసినవాడిని వదిలేది లేదంటూ జగతి మొండి పట్టుపట్టింది. ఇక రెస్టారెంట్‌లో వసు చేసిన పనికి గౌతమ్ మొహం మాడిపోయింది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
మీరు అంటే నాకు ఇష్టం ఐ లవ్యూ అని అంటే.. ఒకరు అంటే.. ఆ అన్నది ఎవరో తెలుసుకోవాలని ఉంటుంది కదా? నాకు వచ్చిన మొదటి లెటర్ సార్ అది.. కొంచెం కోపం.. కొంచెం ఆత్రుత.. ఉంటుంది కదా?అని వసు అంటుంది. వాడి మీద కోపం రావడం లేదా? అని రిషి అంటాడు. నా జీవితంలో లక్ష్యం, గోల్ వేరు ఇవన్నీ పట్టించుకోను.. తన మీద నాకు ఏ కోపం లేదు సర్.. ఆ అక్షరాల్లో ఏదో స్నేహం, దగ్గరి భావం కనిపిస్తోంది.. ఈ ఒక్క కారణంతో తనను చూడాలని ఉందిసర్.. నా కడుపు నిండింది సర్.. అని అంటుంది. నా మనసు నిండింది..అని రిషి లోలోపల సంబరపడతాడు.
మహేంద్ర, జగతి అలా నడుచుకుంటూ వస్తుంటారు. ఎదురుగా వసు, రిషిలు కూడా నవ్వుకుంటూ వస్తుంటాడు. నవ్వుతూ వస్తున్నారు.. ఏ గొడవ పడలేదన్నట్టున్నారు అని జగతి అంటుంది.. గొడవ పడేవారి మధ్యలోనేఎక్కువ ప్రేమ ఉంటుందని నీకు తెలీదా? అని మహేంద్ర అంటాడు.. ఆ లెటర్ రాసిన వారు ఎవరో తెలుసుకోవాలి.. నువ్ రిషికి చెప్పు అని మహేంద్రను జగతి అడుగుతుంది.
దాన్ని ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటున్నావ్ అని మహేంద్ర అంటాడు. నువ్ చెప్పకపోతే నేనే చెబుతాను అని జగతి అనే టైంకు రిషి వస్తాడు. మహేంద్ర చెప్పొద్దు అన్నా కూడా జగతి చెబుతుంది. లెటర్ ఎవరు రాశారో కనిపెట్టాలి సర్.. కాలేజ్ క్రమశిక్షణకి సంబంధించిన విషయం అని ఇలా జగతి కాస్త ఓవర్ చేస్తుంది. దీంతో వసు కల్పించుకుని ఆ విషయాన్ని మేం ఇద్దరం చూసుకుంటాం.. ఈ విషయాన్ని ఇలా మాట్లాడటం నాకు బాగా లేదు అని వసు అంటుంది. దీంతో వసు, రిషి వెళ్లిపోతార. నేను వసు గురించి మాట్లాడుతుంటే.. రిషి, నేను చూసుకుంటానని వసు అంటోంది ఇది అన్యాయం కదా?.. అని జగతి అంటే.. రిషి వసుల మధ్య మ్యాజిక్ అదేనని మహేంద్ర అంటాడు..
వసు పేరు ఎందుకు రాశావ్‌రా అని గౌతమ్‌ని అడుగుతాడు రిషి.. ఇదేదో ఇంటర్నేషనల్ సమస్యగా చూడకు అని గౌతమ్ అంటాడు. కాలేజ్‌లో ఇలాంటివి చేయకు అని రిషి అంటే.. ఈ కాలేజ్‌లోకాకుండా బయట అయితే నీకు ఓకేనా? అని గౌతమ్ లాజిక్ తీస్తాడు. అలా ఇద్దరం మధ్య మాటల యుద్దం జరుగుతుంది. నువ్ ఆగమంటే ఆగుతానా? నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను అని గౌతమ్ తనలో తాను అనుకుంటాడు.
ఇక రెస్టారెంట్‌లోకి గౌతమ్ వస్తాడు. కాఫీ ఆర్డర్ చేస్తాడు. ఆ తరువాత రిషి కూడా ఎంట్రీ ఇస్తాడు. రిషిని చూసి వసు ఆనందపడిపోతుంది. అదేంటి? నన్ను చూసి నవ్విదాని కంటే ఎక్కువగా నవ్వుతోంది అని గౌతమ్ కంగారు పడతాడు. కాఫీ విత్ హార్ట్ సింబల్ తీసుకురా అని గౌతమ్ ఆర్డర్ చేస్తాడు. చూశావా? నా హార్డ్ సింబల్ కాఫీని వసు తీసుకు వస్తుంది? అని గౌతమ్ గాల్లో తేలిపోతాడు.
వసు తీసుకురాకు అని రిషి తన మనసులో అనుకుంటాడు. చివరకు వసు దగ్గరకు తెచ్చి.. నాని గాడి చేతిలో పెట్టి ఆ టేబుల్ వద్ద ఉన్న సర్‌కు ఇవ్వమని చెబుతుంది. దీంతో గౌతమ్ మొహం మాడిపోతుంది. రిషి మొహం వెలిగిపోతుంది. ఈ సర్‌కే హార్ట్ సింబల్ కాఫీ ఇవ్వు అంటూ సెటైర్ వేస్తాడు. దీంతో గౌతమ్ మొహం మరింతగా మాడిపోతుంది. మొత్తానికి అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
- Tags
- Guppedantha Manasu Daily serial Episode
- Guppedantha Manasu Episode 348
- Guppedantha Manasu New Episode
- Guppedantha Manasu serial today Episode 348
- guppedantha manasu serial yesterday episode
- Guppedantha Manasu Today Episode
- Guppedantha Manasu today Episode 348
- గుప్పెడంత మనసు
- గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్
- గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్
- గుప్పెడంత మనసు ఈరోజు సీరియల్
- గుప్పెడంత మనసు టుడే ఎపిసోడ్
- గుప్పెడంత మనసు డైలీ సీరియల్
- గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్
- గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ కావాలి
- గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్
- జగతి
- మహేంద్ర
- రిషి
- వసు
- వసుధార