• December 18, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. రుద్రాణి పైశాచికం.. బిడ్డను బేరం పెట్టేసిన కార్తీక్

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. రుద్రాణి పైశాచికం.. బిడ్డను బేరం పెట్టేసిన కార్తీక్

    కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే శనివారం నాడు అంటే Karthika Deepam Episode 1226 నాటి ధారవాహికలో కార్తీక్ పెద్ద చిక్కులో ఇరుకున్నాడు. కోటేశ్ అప్పును తీరుస్తాను అని సంతకం పెడతాడు. కానీ అందులోని చిక్కుముడిని మాత్రం తరువాత చెబుతుంది రుద్రాణి. అది విని కార్తీక్ నివ్వెరబోతాడు. మరోవైపు కార్తీక్ ఇంట్లో మోనిత ఆగడాలకు సౌందర్య అడ్డు కట్ట వేస్తుంది. మొత్తానికి కార్తీక దీపం ఎపిసోడ్ నేటి ఎపిసోడ్ మాత్రం మంచి ఫాంలోకి వచ్చింది.

    కోటేష్ తీసుకొచ్చిన బిడ్డ మీద కార్తీక్, దీపలకు అనుమానం వస్తుంది. రోజుల బిడ్డలా లేడే.. నెలల బిడ్డలా ఉన్నాడంటూ దీప, కార్తీక్ అడుగుతారు. ఈ బిడ్డ ఎవరు? నిజం చెప్పు.. అని దీప అడుగుతుంది. చాలా సార్లు గర్భం పోగొట్టుకుంది.. పిల్లలు పుట్టడం కష్టమంటే.. ఈ అనాథ బిడ్డను తెచ్చుకున్నాం.. పేపర్ మీద సంతకం పెట్టి మరీ తీసుకొచ్చాం.. ఈ విషయాన్ని ఊర్లో చెప్పకండి.. శ్రీవల్లి బిడ్డే అని చెప్పాం.. అని కోటేష్ అబద్దం చెబుతాడు. చట్టబద్దంగా దత్తత తీసుకుని మంచి పని చేశావ్ అని డాక్టర్ బాబు అంటే.. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది.. అని దీప అంటుంది.

    ఇక సీన్ రుద్రాణి మీద ఓపెన్ అవుతుంది. ఏరా పెద్ద గడ్డం.. వాడి పొలం కాగితాల్ని తీసుకున్నావా? అని రుద్రాణి అడుగుతుంది. వాడి పెళ్లట.. వచ్చాక తీసుకుంటాను.. అని అంటే.. తీసుకోకపోతే.. వాడిపెళ్లి, నీ పెళ్లి కలిపి చేసేస్తానని రుద్రాణి ఫైర్ అవుతుంది. అక్కా అక్క.. అంటూ అబ్బులు పరిగెత్తుకుంటూ వస్తాడు. శ్రీవల్లిని ఇంట్లోకి ఆహ్వానించడం, ఇంట్లోకి రావడం అన్ని విషయాలను రుద్రాణికి చెబుతాడు.

    మళ్లీ సీన్ దీప, శ్రీవల్లి మీద ఓపెన్ అవుతుంది. అక్కా మిమ్మల్ని చూస్తుంటే డబ్బులున్న వారిలా కనిపిస్తున్నారు.. మీరు ఇంత సాయం చేస్తున్నారు.. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు..? అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంది. వల్లి అలా అడగొచ్చా? నీకు బుద్ది ఉందా?.. అని కోటేషు ఫైర్ అవుతాడు. పిల్లలు మీరు పక్కకి వెళ్లి ఆడుకోండి అని దీప చెప్పడం.. తమ్ముడిని తీసుకెళ్తాం అని శౌర్య అనడం జరుగుతుంది.

    పరిస్థితులు బాగా లేక ఇక్కడికి వచ్చాం.. ఇంతకంటే చెప్పలేం అని దీప చెబుతుంది. ఆ రుద్రాణి మిమ్మల్ని ఏమైనా చేస్తుందనే భయంగా ఉందని కోటేష్ అంటే.. భయపడుతూ ఉంటే అదే వ్యాధిలా మారుతుంది.. అని దీప అంటుంది. అయినా మీరు ఎందుకు భయపడటం.. అని డాక్టర్ బాబు అంటాడు. అప్పు తీసుకున్నాం కదా?.. అని కోటేష్ అంటాడు. అవును అదొకటి ఉంది కదా? తరువాత చూద్దాంలే అని అంటాడు కార్తీక్.

    సీన్ మోనిత మీద ఓపెన్ అవుతుంది. గోడకు తగిలించిన ఫ్రేమ్‌తో మోనిత సెల్ఫీలు దిగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు అమ్మ గారు అని ప్రియమణి అడుగుతుంది.. నువ్, నేను మీ కార్తీక్ అయ్య ఇంట్లో ఇలా ఉంటాం.. ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టి అందరి నోళ్లు మూయిస్తానని అనుకున్నావా?.. ఇవన్నీ జరుగుతాయని నువ్ ఊహించలేదు కదా?.. అని మోనిత రెచ్చిపోతూ ఉంటుంది.

    ఇక మోనిత అలా ఎగురుతూ ఉంటే.. ఆ ఫోటోను తీసి అవతల పారేసిన సౌందర్య.. మోనితను చెడుగుడు ఆడుకుంటుంది.. ఏంటే ప్రియమణి.. ఈ ఫోటోను నేలకేసి కొడతానని ఊహించావా? లేదా? ఏంటే మాట్లాడవ్.. ఊహించావా? లేదా?.. మోనిత నువ్ ఊహించావా? లేదా?.. అని ఫైర్ అవుతుంది. కార్తీక్ లేడని మేం బాధపడుతుంటే.. నువ్వొచ్చి భయపడితే భయపడతామని అనుకున్నావా.. నిన్ను చంపి.. సంతాప సభ పెట్టి.. పెద్ద ఫ్లెక్సీ పెడతాను.. కొడుకు కనిపించడం లేదన్నావ్.. బాధలో ఉన్నావో.. నాటకాలు ఆడుతున్నావో తెలియాలి కాబట్టి ఇక్కడే ఉంచాను.. అంతే కానీ నీ తాటాకాలు చప్పట్లకు భయపడి కాదు.. ఇలానే కలలు కంటూ ఉండు.. నిన్నూ, నీ అసిస్టెంట్‌ను గేట్ అవతలకు గెంటేస్తాను.. అని సౌందర్య అంటుంది. దీంతో కోపంతో మోనిత ఊగిపోయింది.

    అబ్బులు గాడు కార్తీక్‌ను రుద్రాణి దగ్గరకు తీసుకెళ్తాడు. అక్క రమ్మందని అబ్బులు చెబుతాడు. రాకపోతే అని కార్తీక్ అంటే.. అక్కే ఇక్కడకు వస్తుందని అబ్బులు అంటాడు. నేను వెళ్లకపోతే.. తనే ఇక్కడకు వస్తుంది.. నన్ను ఏమైనా అంటే.. రుద్రాణిని దీప కొడుతుంది.. అని కార్తీక్ లోలోపల అనుకుంటూ ఉంటాడు. సరే పదా అని కార్తీక్ అంటాడు. అవసరమా? కార్తీక్ బాబు.. దీని దీప భయపడుతూ ఉంటే.. భయపడకు దీప అని కార్తీక్ అంటాడు.

    నువ్ ఇంట్లోంచి ఫోటో తీసేస్తే.. ఇంటి ముంద పదిఫ్లెక్సీలు పెట్టిస్తాను.. మోనిత మాటలను గుర్తు చేసుకుంటూ ఆదిత్య రగిలిపోతాడు. పాలు తాగు ఆదిత్య అని శ్రావ్య అంటే.. పాలు కాదు విషం తీసుకునే పరిస్థితి ఇచ్చింది.. ఫోటో పెట్టింది, ఇంట్లోకి వచ్చింది.. ఫ్లెక్సీ పెడుతుంది.. గుమ్మం బయటకు గెంటేయాలని ఉంది.. అని ఆదిత్య అంటాడు. కానీ చేయలేవ్ కదా?. ఆ మోనితకు మన బలమే ఆయుధంగా మారింది.. మీరు ఏం చేయలేరు.. రేపు దీపక్క వస్తే నా మొహం ఎలా చూపించాలి.. పాపం పోనీలే అనుకుని ఇక్కడే ఉంచామని.. అనాలా. అని శ్రావ్య బాధపడింది. తనని కచ్చితంగా పంపిచేద్దామని ఆదిత్య అంటాడు.

    కార్తీక్ బాబును ఒంటరిగా పంపించాల్సింది కాదేమో.. ఏమైనా ప్రమాదాన్ని తలపెడుతుందా?..అని దీప బాధపడుతూ ఉంటుంది. అందరూ అనుకున్నట్టు,చెప్పుకుంటున్నట్టు చాలా చెడ్డ తిక్కదాన్ని.. నచ్చితే తల మీద… నచ్చకపోతే నేలకేసి కొడతాను.. కోటేష్ నా దగ్గర అప్పుడు తీసుకున్నాడు.. ఆ దస్తావేజుల మీద సంతకం పెట్టాడు, అసలు కట్టలేదు అప్పు కట్టలేదు.. అప్పుడు వాడి ఇంటిని స్వాధీనం చేసుకున్నాను..అప్పుడు మీరు వచ్చారు.. ఇంట్లో ఉన్నారు.. ఉండమంటే ఉండాలి కదా?..

    మంచి పనులు చేస్తే కొందరికి బలం.. చెడ్డపనులు చేస్తే నాకు బలం.. వస్తుంది. నీ పెళ్లాం.. పేరేంటో దీప.. శ్రీవల్లి, కోటేష్‌ను ఇంట్లోనే పెట్టేసుకుంది.. ఇన్ని మంచి పనులు చేస్తూ పుణ్యం కట్టుకుంటే ఎలా.. అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూనే ఉన్నాను.. అసలు, వడ్డీలు రాలేదు.. అందుకే ఇంటిని స్వాధీనం చేసుకున్నాం.. నా ఇంట్లోకి మీరు వచ్చారు.. మీరు దేశోద్దారకుడిలా మంచి పనులు చేశారు.. మీరు గొప్పోళ్లో, సారో ఎవరో తెలీదు కానీ.. కోటేశు అప్పు నువ్ తీరుస్తావా?.. బాధ్యత తీసుకుంటావా? వాళ్లను బజారుకీడ్చమంటావా?. మూడులక్షలు అంటే తక్కువేం కాదు.. నీ జీవితం అంటూ రుద్రాణి రెచ్చిపోయింది.. నేను కోటేశ్ అప్పు తీర్చేస్తాను.. శభాష్.. వారిని ఆదుకో.. సంబంధం లేదని వెళ్లిపోతే ఏ బాధా ఉండదు..అని అంటుంది. నెల రోజుల్లో అప్పు తీర్చాలని సంతకం పెడతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. కానీ అప్పు తీర్చకపోతే ఏం జరుగుతుందనేది మాత్రం కార్తీక్ అడగలేదు. ఇద్దరమ్మాయిలో ఒక అమ్మాయిని తెచ్చేసుకుంటామని రుద్రాణి తరువాత చెబుతుంది. దీంతో కార్తీక్ తన కూతురిని బేరానికి పెట్టినట్టు అయింది. మరి ఈ గండం నుంచి కార్తీక్, దీప ఎలా గట్టెక్కుతారో చూడాలి.

    Leave a Reply