- December 18, 2021
Pushpa Collection : ‘పుష్ప’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇదేం రికార్డులు సామీ!
Pushpa The Rise Day 1 Collection అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అంచనాలను అందుకోలేకపోయింది. అయితే పుష్ప టాక్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. ఎందుకంటే పుష్ప మీదున్న బజ్‌తో దాదాపు వీకెండ్ వరకు టికెట్లు బుక్ అయిపోయాయి. అలా టాక్, రివ్యూలను ఎవ్వరూ పట్టించుకోకుండా అందరూ పుష్ప సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మొదటి రోజు అయితే తెలుగు రాష్ట్రాల్లో పుష్ప కుమ్మేసింది.
పుష్ప రాజ్ దెబ్బకు రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఈ ఏడాది మొదటి రోజు కలెక్షన్లలో పుష్ప టాప్ ప్లేస్‌లో నిల్చున్నట్టు కనిపిస్తోంది. ఎవ్వరికీ అందని, కొట్టిన ఫీట్‌తో పుష్ప దుమ్ములేపేశాడని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 60 నుంచి 70 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేసినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ పుష్ప అదిరిపోయే కలెక్షన్లను రాబట్టినట్టు టాక్.
తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 40 కోట్ల రేంజ్ గ్రాస్‌ను అందుకునేలా ఉండగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్‌గా కలిపి 10-12 కోట్ల రేంజ్ గ్రాస్‌ను రాబట్టేట్టు కనిపిస్తోంది. ఇక ప్రీమియర్స్, బుకింగ్స్‌తోనే హాఫ్ మిలియన్ మార్క్‌ను ఓవర్సీస్‌లో అందుకుంది పుష్ప. అలా మొదటి రోజు ఓవర్సీస్‌లో 7-8 కోట్ల రేంజ్‌లో ఉండే కొల్లగొట్టినట్టు సమాచారం.
టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 60 కోట్లకు పైనే గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అఫీషియల్ లెక్కలు చూస్తే గానీ అసలు మ్యాటర్ బయటకు రాదు. మొదటి రోజే 60-70 కోట్ల మధ్యలో గ్రాస్‌ను కొల్లగొట్టేసి తగ్గేదేలే అని బన్నీ బాక్సాఫీస్‌ను బయపెట్టేసినట్టున్నట్టు కనిపిస్తోంది. లోపు గ్రాస్ ను అందుకునేలా ఉందని చెప్పాలి.
- Tags
- Pushpa 1st Day Collection
- Pushpa 1st Day Worldwide Collection
- Pushpa Day 1 Ceeded Collection
- Pushpa Day 1 Collection
- Pushpa Day 1 Gross Collection
- Pushpa Day 1 Nizam Collection
- Pushpa Day 1 overseas Collection
- Pushpa Day 1 Records
- Pushpa Day 1 Worldwide Collection
- Pushpa Day 1 Worldwide Gross Collection
- Pushpa Day 1 Worldwide Records
- Pushpa Day 1 Worldwide Share Collection
- Pushpa The Rise Day 1 Collection
- Pushpa The Rise Day 1 Worldwide Collection
- పుష్ప
- పుష్ప ఫస్ట్ డే కలెక్షన్
- పుష్ప ఫస్ట్ డే కలెక్షన్లు
- పుష్ప ఫస్ట్ డే కలెక్షన్స్
- పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ అంచనా