• December 15, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. అదిరిపోయిన ట్విస్ట్.. దీప ఒడిలో మోనిత బిడ్డ

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. అదిరిపోయిన ట్విస్ట్.. దీప ఒడిలో మోనిత బిడ్డ

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే.. బుధవారం నాటి ధారావాహిక అంటే Karthika Deepam Episode 1223 లో మంచి సీన్స్ పడ్డాయి. అదిరిపోయే ట్విస్ట్‌లు వచ్చాయి. మోనిత బిడ్దను కోటేశ్ ఎత్తుకెళ్లాడు.. చివరకు ఆ బిడ్డ దీప ఒడిలోకి చేరుకుంది. అటు వైపు కార్తీక్ ఇంట్లోకి మోనిత వచ్చి తిష్ట వేసింది. ఇక రుద్రాణి చెంప చెల్లుమనిపించింది దీప. మూడు లక్షల ఇరవై వేలు కట్టమని దీప, కార్తీక్‌లను రుద్రాణి సవాల్ చేసింది. అలా మొత్తానికి బుధవారం నాటి ఎపిసోడ్‌లో ఎన్నో వింతలు జరిగాయి.

    తన బిడ్డను ఎత్తుకెళ్లారంటూ మోనిత నానా రచ్చ చేసింది. ఏకంగా స్కూటినీ ఇంట్లోనే పార్క్ చేసింది. నా బిడ్డను ఆదిత్య ఎత్తుకెళ్లాడంటూ మోనిత హంగామా చేస్తుంది. ఆదిత్య ఎత్తుకెళ్లాడని నాటకాలా?.. కిడ్నాప్‌లు, ఎత్తుకెళ్లడం వంటివి నీకు తెలిసిన విద్యలు.. ఆదిత్య ఎందుకు ఎత్తుకెళ్తాడు అంటూ సౌందర్య, ఆనంద్ రావులు అంటాడు. నా బిడ్డను నేను ఎందుకు ఎత్తుకెళ్తాను అని మోనిత అంటుంది.

    ఎందుకిలా మమ్మల్ని టార్చర్ పెడతావ్.. వెళ్లిపో అమ్మ.. నీకు మాకు సంబంధం లేదు.. అని ఆనంద్ రావు అంటాడు. అలా అంటారేంటి మామయ్య గారు మిమ్మల్ని ఆది దంపతుల్లా చూస్తాను.. నేను మీకు దేవుడిచ్చిన కోడల్ని అని మోనిత వాగుతుంటుంది.. నా బిడ్డను ఎత్తుకెళ్తే.. ఏడుస్తూ ఉంటానని అనుకున్నారా?.. నెవ్వర్.. ఏడ్చే రోజులు పోయాయ్.. ఏడిపించే రోజులు వచ్చాయ్.. నా కొడుకు దొరికే వరకు ఇక్కడే ఉంటాను.. పెళ్లైతే అత్తిళ్లే కదా? దిక్కు అని మోనిత తిష్ట వేసుకుని ఉండిపోయింది.

    ఇక అక్కడ సీన్ కట్ చేస్తే మళ్లీపురిట్లోనే బిడ్డను కోల్పోయానని శ్రీవల్లి ఏడుస్తుంది. అయ్యో దేవుడా? నాకు మళ్లీ ఇలా ఎందుకు చేశావ్ అని శ్రీవల్లి బాధపడుతుంటే.. కోటేష్ ఓ బిడ్డను తీసుకొస్తాడు. ఆబిడ్డ ఎవరో కాదు మోనిత బిడ్డే. ఎలా ఎత్తుకొచ్చాడో చూపిస్తాడు… శ్రీవల్లి నీ బాధను ఎలా తీర్చాలి అని కోటేష్ బాధపడుతూ రోడ్డు మీద వెళ్తుంటే..కారులో బిడ్డ కనిపిస్తాడు. దేవుడా ఏంటిది పరీక్ష పెడుతున్నావా? దారి చూపుతున్నావా?.. తప్పు చేస్తున్నానో? న్యాయం చేశానో నాకే తెలియడం లేదు..నా శ్రీవల్లి మాత్రం సంతోషంగా ఉందని కోటేష్ అనుకుంటాడు. కానీ ఆ బిడ్డను ఎత్తుకొచ్చినట్టు చెప్పడు. ఎవరో వదిలేసి వెళ్లిపోయారన్నట్టుగా చెబుతాడు.

    అక్కడ సీన్ కట్ చేస్తే.. కార్తీక్, దీప, పిల్లలంతా కూడా భోజనానికి కూర్చుంటారు. ఏం ఆలోచిస్తున్నారు కార్తీక్ బాబు.. అని దీప అంటే.. ఏమీ లేదని సమాధానం చెబుతాడు. ఏం స్పెషల్ చేశావ్ అమ్మా అని శౌర్య అంటే.. ఆకలితో భోజనం వద్ద కూర్చుంటే.. ఏదైనా స్పెషల్‌గా ఉంటుందని దీప కౌంటర్లు వేస్తుంది.. ఇలా కింద కూర్చుని తింటుంటే బాగుందమ్మా అని హిమ అంటుంది.. ఇలా తింటుంటే ఆనందమే వేరు.. ఏమంటారు కార్తీక్ బాబు.. అని దీప అంటుంది. అవును దీప కార్తీక్ అనేస్తాడు.

    ఇక ఇంతలో రుద్రాణి వస్తుంది. ఇలా వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదా? అని దీప అంటుంది. వచ్చేలా చేశావ్ మరి.. నేనేం చేయను.. అంటూ రుద్రాణి ఇళ్లంతా చూసింది.. టైం బాగా లేక వచ్చాను అన్నావ్.. వంట సామాగ్రి.. అవీ ఇవీ చాలానే ఉన్నాయ్.. అవన్నీ నీవేనా? అని రుద్రాణి అంటుంది. బయట వాళ్ల వస్తువులున్నాయ్ అని.. నేనే తీసుకొచ్చాను.. అని కార్తీక్ అంటాడు.

    ఎవరివి? అని రుద్రాణి అడుగుతుంది.. శ్రివల్లి వాళ్లవి అని దీప సమాధానం చెబుతుంది.. ఆ మాట నాకు చెప్పాలి కదా? అని రుద్రాణి అంటుంది. ఇది రుద్రాణి సామ్రాజ్యం అని తెలీదా?. అని అంటుంది. నేనే వచ్చి చెబుదామని అనుకున్నాను.. అని దీప అనే లోపు.. నోర్మూయ్ అని అన్నాన్ని కాలితో తంతుతుంది. ఇక కార్తీక్ కోపంతో.. కాలితో తంతారా? చిన్న పిల్లలు అన్నం తింటున్నారని కూడా చూడర? అంటూ ఫైర్ అవుతాడు.

    నా మాట వినక పోతే అంతే.. గిన్నెలైనా, మనుషులైనా అంతే.. ఇది రుద్రాణి సామ్రాజ్యం.. అంటూ కార్తీక్‌ను నెట్టేస్తుంది రుద్రాణి. ఏయ్ అంటూ చాచి కొట్టిన దీప..తన విశ్వరూపాన్ని చూపించింది. మర్యాద.. మర్యాద నేర్చుకోండి.. ఏం మాట్లాడుతున్నారు.. మీలాంటి వాళ్లు.. వంద మంది ఆయనకు చేతులెక్కి మొక్కుతారు తెలుసా? నన్ను ఏమైనా అన్నా కూడా భరిస్తాను కానీ.. మిమ్మల్నిఎవరైనా తక్కువ మాట్లాడితే మాత్రం ఊరుకోను.. అంటూ దీప చెబుతుంది.

    అంత గొప్ప వాళ్లు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారో అని రుద్రాణి అంటుంది. అది నీకు అనవసరం అని దీప బధులిస్తుంది. బియ్యం ఇస్తాను అని అన్నా కూడా నువ్ తీసుకోలేదు.. అప్పుడే డౌట్ వచ్చింది.. అని రుద్రాణి అంటుంది. రెండు లక్షలకు కోటేష్ నా దగ్గర ఈ ఇంటిని తాకట్టు పెట్టాడు. ఇంత వరకు కట్టలేదు.. అందుకే సామాన్లు బయటకు విసిరేశాను.. మీరొచ్చారు.. ఆ విసిరేసినవి మీరు తెచ్చారు..

    తప్పు చేశారు.. నన్ను ఎదురించి మొదటి తప్పు.. కొట్టి పెద్ద తప్పు చేశావ్.. అని రుద్రాణి అంటుంది. మా వారిని ఇంకో మాట అంటే.. మళ్లీ కొడతాను..అని దీప రెచ్చిపోతోంది. ఇన్ని ఏళ్లలో నా ముందు మాట్లాడిన వాళ్లే లేరు.. ఉండనివ్వను.. అయ్యో పాపం కోటేశు.. అయ్యో పాపం శ్రీవల్లి.. అని బాగానే జాలి పడుతున్నారు కదా? అని రుద్రాణి అంటుంది. జాలి పడితే తప్పేంటంట అని దీప అంటుంది. అంత జాలి ఉంటే.. కోటేశ్ తీసుకున్న అప్పు, వడ్డి కలిపి 3.20 లక్షలు కట్టి జాలి గుండెను నిరూపించుకోండి.. ఏంటి మాట్లాడరేంటి?.. లక్షలు అనేసరికి జాలి గుండె జారిపోయిందా?. ఇంటి బయట నా వాళ్లున్నారు.. ఒక్క మాట చెబితే మిమ్మల్ని లోకాన్ని దాటించేస్తారు.. అని రుద్రాణి అంటుంది.

    ఏంటి భయపెడుతున్నారా? అని దీప అంటుంది. ఈ ఇంటికి అద్దె ఇద్దామని అనుకున్నాను. అసలు ఈ ఇళ్లే మీది కాదు.. ఇస్తే కోటేష్‌కే అద్దె ఇస్తాను అని దీప అంటుంది. నా అంచనాలకు మించే ఉన్నావ్.. ఎవరికి ఏ వాయినం ఇవ్వాలో.. ఎవరికెలా బుద్ది చెప్పాలో నాకు బాగా తెలుసు.. పిల్లలు వెళ్లొస్తానమ్మ.. ఈసారి వచ్చినప్పుడు చాక్లెట్లు తీసుకొస్తాను అని రుద్రాణి అంటుంది.

    అలా అక్కడ సీన్ కట్ చేస్తే మోనిత.. ఉదయాన్నే లేచి కార్తీకదీపం పాట పాడుతూ పూజలు చేస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. శుభోదయం అత్తయ్య గారు మామయ్య గారు అని చెబుతుంది మోనిత. పూజ చేస్తూ గుడ్ మార్నింగ్ అని చెబితే బాగుండదు అని తెలుగులో చెప్పాను.. హారతి తీసుకోండి.. అని మోనిత అంటుంది. కానీ వారు మాత్రం మొహం తిప్పేసుకుంటారు.

    ఏంటి పాట బాగుందా?. ప్రాక్టీస్ లేక కాస్త శ్రుతి తప్పింది.. ఒకప్పుడు పాటలు బాగా పాడేదాన్ని.. అని మోనిత అంటుంది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కోటేష్ ఎత్తుకొచ్చిన బిడ్డను దీప ఎత్తుకుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డలా లేడే.. పుట్టి చాలా రోజులు అవుతుందని డాక్టర్ బాబు అనుమానం వ్యక్తం చేస్తాడు. ఈ బిడ్డ ఎవరిది? అని కోటేష్‌ను దీప అడుగుతుంది.మొత్తానికి మోనిత బిడ్డ అని తెలిస్తే కథ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.

    Leave a Reply