- February 23, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. అసలు కథ తెలిసిన సౌందర్య.. మోనిత కొత్త నాటకం

కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 23 బుధవారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Epiosde 1283 ధారావాహికలో అసలు విషయం తెలుస్తుంది. మోనితకు తన బిడ్డ ఎక్కడుందో తెలిసిపోయింది. తమ ఇంట్లో ఉన్న బిడ్డ మోనిత కొడుకే అన్న విషయం
సౌందర్యకు కూడా తెలుస్తుంది. దీంతో అసలు కథ మళ్లీ మొదటికే వచ్చినట్టు అయింది. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ అలా ముందుకు సాగింది.
అప్పారావు రావడం, మోనితకు అసలు విషయం చెప్పడం తెలిసిందే. ఆ తరువాత సౌందర్యకు కూడా అసలు విషయం తెలుస్తుంది. కోటేష్ ఫోటోను అప్పారావు చూపించడంతో అర్థమవుతుంది. దీంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అందరూ ఆనంద్ మీద ప్రేమను పెంచుకుంటున్నారు అని బాధపడుతుంటుంది.
మరో వైపు మోనిత పెద్ద ప్లాన్ వేస్తుంది. తన బిడ్డ కార్తీక్ వద్ద ఉన్నాడని తెలిసే.. నాటకం ఆడుతుంది. ఇంకొన్ని రోజులు అక్కడే ఉంచితే.. ఇంకా ప్రేమ పెరుగుతుందని, ఆ తరువాత నాటకం ప్రారంభిద్దామని మోనిత అనుకుంటుంది. ముందు అమ్మ దగ్గర ఉన్నావ్.. తరువాత నాన్న దగ్గరకే వెళ్లావ్.. ఇక ఆ తరువాత అమ్మా నాన్నలతో కలిసి ఉంటావ్ అని తన బిడ్డ గురించి మోనిత ఆలోచిస్తుంటుంది.
మోనిత బిడ్డ అని తెలియక ఆనంద్‌తో తన కుటుంబం అల్లుకుపోతోన్న తీరు, శౌర్య హిమలు ఆనంద్‌తో ఉండటం, ఆనంద్ మీద దీప పెంచుకున్న ప్రేమ ఇలా అన్నింటిని తలుచుకుంటూ సౌందర్య బాధపడుతుంటుంది. ఇక మరో వైపు కార్తీక్, దీప వాగ్వాదం చేసుకుంటారు. మోనితన నమ్మొద్దని దీప అంటుంది. కానీ మనకు వేరే ఆప్షన్ లేదు.. ఆ బిడ్డను వెతికి తీసుకొస్తాను అని కార్తీక్ అంటాడు.
ఇంటికి వచ్చన కార్తీక్.. ఆనంద్‌ను ఎత్తుకుంటాడు. వీడిని ఎత్తుకుంటే అలసట పోతుంది.. ఏముందిరా నీలో అని అంటుంటాడు. అదంతా విని సౌందర్య బాధపడుతుంటుంది. ఇంట్లో ఉన్న బిడ్డ మోనిత కొడుకే అన్న విషయాన్ని ఆనంద్ రావుకు చెబుతుంది సౌందర్య. దీంతో ఆనంద్ రావు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
మోనిత బిడ్డను ఎత్తుకెళ్లిన వీడియోను ఇవ్వమని సౌందర్యను కార్తీక్ అడుగుతాడు. ఇక మోనిత అయితే తన బిడ్డను చూసుకునేందుకు కార్తీక్ ఇంటికి వస్తుంది. దీప బిడ్డను తాకనివ్వదు. నా బంగారు కొండ.. నా బిడ్డ అని దీప అంటే.. మోనిత నవ్వుతుంది. మరి ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి.