• February 23, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు, రిషి చాటింగ్.. భలే మోసం చేశారు కదరా!

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు, రిషి చాటింగ్.. భలే మోసం చేశారు కదరా!

    గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 23 బుధవారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 381 ధారావాహికలో వసు, రిషిలు తెగ మథన పడ్డారు. అర్దరాత్రి నిద్రలోంచి మెల్కొన్నారు. ఇక చాటింగ్ చేసిన తీరు, వారు చూపించిన చాటింగ్, ఆ టైమింగ్ మాత్రం అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది. అలా మొత్తానికి గుప్పెడంత మనసప

    షార్ట్ ఫిల్మ్ గురించి రిషి తెగ సంబరపడుతూ మహేంద్ర, ఫణీంద్రలకు చెబుతుంటాడు. అది వింటూ ధరణి అక్కడే ఉండిపోతోంది. దేవయాణికి వాటర్ బాటిల్ ఇవ్వాలన్న విషయాన్ని మరిచిపోతుంది. చివరకు గుర్తొచ్చిన ధరణి.. దేవయాణి దగ్గరకు వెళ్తుంది. ఏంటి హాల్‌లో రిషి మాటలు వినిపిస్తున్నాయ్ అని దేవయాణి అడుగుతుంది.

    అది మనకు సంబంధం లేనిది అత్తయ్య.. కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు అని ధరణి అంటుంది. కాలేజ్ మనది కాదా?.. తెలివితక్కువ దద్దమ్మ అని అని ధరణిని లోలోపలే తిట్టుకుంటుంది దేవయాణి. ఇక వసు అయితే రిషి ఆలోచనలతో పిచ్చెక్కిపోతుంది. ఇంత రాత్రి నాకు ఎందుకు ఇంతలా గుర్తుకు వస్తున్నాడు నిద్ర ఎందుకు పట్టడం లేదు అని అనుకుంటుంది వసు.

    జగతి మేడం వాళ్ల అబ్బాయనా? సీరియస్ సింహమనా? జెంటిల్మెన్ అనా? ఎందుకు గుర్తుకు వస్తున్నాడు..అసలు సర్ ఇప్పుడు ఏం చేస్తుంటాడు.. అని వసు అనుకుంటుంది. ఇక అదే సమయంలో రిషి కూడా వసు గురించి ఆలోచిస్తుంటాడు. ఫోన్ చేయాలా? అని అనుకుంటాడు. ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుండదు అని ఫోన్ చేయకుండా మెసెజ్ చేస్తాడు.

    రిషి సర్ మెసెజ్ రావడంతో వసు తెగ సంబరపడిపోతుంది. అయితే ఈ ఇద్దరూ చాటింగ్ చేసుకుంటారు. కానీ ఆ సిట్యువేషన్ చూస్తే ఏ అర్దరాత్రో అయినట్టు చూపిస్తారు. కానీ చాటింగ్‌లో టైం చూస్తే మాత్రం ఉదయం 8 గంటల ప్రాంతంలో కనిపిస్తుంది. మొత్తానికి సీరియల్‌ను చూసే వాళ్లను భలే మోసం చేసేశారు.

    అలా మొత్తానికి ఆ రాత్రి గడిచిపోతుంది వారికి. ఇక ఉదయాన్నే జగతికి మంత్రి పీఏ ఫోన్ చేస్తాడు. షార్ట్ ఫిల్మ్ చూస్తాను అని మంత్రి అన్నాడంటూ చెప్పుకొస్తాడు. కాలేజ్‌లో రిషి రాకను కారు సౌండ్‌తో వసు గుర్తు పడుతుంది. వసుని చూసి కూడా మాట్లాడకుండా వెళ్తాడు రిషి. అదేంటి చూసీ కూడా మాట్లాడకుండా వెళ్తున్నాడు అని వసు అనుకుంటుంది.

    ఇదేంటి వసు ఆపుతుందని అనుకున్నా.. ఆపడం లేదు అని రిషి అనుకుంటాడు. అలా ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు పిలుచుకుంటారు. మొత్తానికి ఈ ఇద్దరూ ఏదో ఒకటి మాట్లాడుతుండగా.. మధ్యలో గౌతమ్ వచ్చి డిస్టర్స్ చేస్తాడు. గౌతమ్ రావడంతోనే వసుని లోపలకు వెళ్లమని రిషి ఆర్డర్ వేస్తాడు.

    వసుని అంతలా భయపెట్టకు అని గౌతమ్ అంటాడు. భయానికి, భక్తికి, గౌరవానికి తేడా తెలీదులే నీకు అని రిషి అంటే.. నాకు చాలా తెలుసు.. నీకు తెలీదు.. నా మనసులో ఏముందో నీకు తెలీదు అని అంటాడు.. తన సంగతి నేను చూసుకుంటాను.. నీ సంగతి నువ్ చూసుకో.. అని రిషి కౌంటర్ వేస్తాడు. నువ్వూ అర్థం కావు.. వసుధార అర్థం కాదు.. నా జీవితం ఏంటో నాకే అర్థం కాదు.. అని గౌతమ్ అనుకుంటాడు.

    అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో క్లాస్ రూంలో వసు నిద్రపోతోంది. ఏంటి ప్రాబ్లం.. ఏమైంది అని వసుని రిషి అడుగుతాడు. మీరే నా ప్రాబ్లం అని అందరి ముందే వసు చెప్పేస్తుంది. దీంతో రిషి షాక్ అవుతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి మరి.

    Leave a Reply