• February 16, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. మోనితకు దీప వార్నింగ్.. ముక్కలు ముక్కలు చేయించేసింది

Karthika Deepam నేటి ఎపిసోడ్.. మోనితకు దీప వార్నింగ్.. ముక్కలు ముక్కలు చేయించేసింది

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 16న బుధవారం ప్రసారం కానున్న Karthika Deepam Epiosde 1277 ధారావాహికలో మోనితకు దీప గుణపాఠం చెప్పేందుకు రెడీ అవుతుంది. మరో వైపు మోనిత ఇంకో ప్లాన్ వేస్తుంది. తన బాబాయ్‌కు హార్ట్ ఆపరేషన్ అంటూ కార్తీక్ వద్ద డీల్ కుదుర్చుకుంటుంది. అయితే మోనిత మాటలకు కార్తీక్ ఆలోచనలో పడతాడు. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    దీప ఇంట్లోనే వస్తువులన్నీ సర్దుతుంటుంది. ఇళ్లంత సర్దడాన్ని సౌందర్య చూస్తుంటుంది. ఇళ్లు చాలా మారిపోయింది. ఇంట్లోని వస్తువులు ఒక చోట లేవంటూ దీప అంటుంది. ఇంట్లో మనషులు సరిగ్గా లేనప్పుడు వస్తువులు కూడా అంతే.. నువ్ ఇన్ని రోజులు లేవు కదా? అందుకే ఇలా అయిపోయిందంటూ దీపను పొగిడేస్తుంది. కార్తీక్ ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడో నువ్ భార్యగా దొరికావ్ అని సౌందర్య అంటుంది.

    ఆ తరువాత కార్తీక్ వద్దకు మోనిత వస్తుంది. మళ్లీ పాత పాటే పాడుతూ కార్తీక్‌ని విసిగిస్తుంటుంది. బస్తీలో దవాఖానా, ఫోటో ఫ్రేమ్ పెట్టడం గురించి మాట్లాడుతుంది. మన బాబు అంటూ కార్తీక్‌ని విసిగిస్తుంది. నువ్వే కదా? తండ్రివి అని అంటుంది. దీంతో కార్తీక్‌కు చిర్రెత్తుకొస్తుంది. తన బాబాయ్‌కి హార్ట్ ఆపరేషన్ చేస్తే.. ఇవన్నీ మానేస్తాను అని, బస్తీలో హాస్పిటల్ తీసేస్తాను అని మోనిత అంటుంది. దీంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.

    వారణాసితో దీప వీడియో కాల్ మాట్లాడుతుంది. వంటలక్క వైద్యశాల బోర్డ్‌ని పీకి అవతల పారేయమని వారణాసికి చెబుతుంది. దీంతో వారణాసి చెలరేగిపోతాడు. అందరినీ బెదిరిస్తాడు. హాస్పిటల్ బోర్డ్‌ను చించి ముక్కలు ముక్కలుగా చేసి పారేస్తాడు. మొత్తానికి దీప మాత్రం మోనితకు సరైన గుణపాఠం చెప్పేందుకు రెడీ అవుతుంది. ఇక మోనిత మాటలను తలుచుకుంటూ కార్తీక్ ఆలోచనలో పడతాడు. నిజంగానే మోనితకు బాబాయ్ మీద అంత ప్రేమ ఉందా? అయినా ఈ విషయం ఓ సారి దీపకు చెబుదామని కార్తీక్ అనుకుంటాడు.

    అయినా ఆపరేషన్ చేస్తే తప్పేంటి? ఓ పేషెంట్‌ను కాపాడిన వాడిని అవుతాను అంటూ కార్తీక్ అనుకుంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్ ఇంటికి మోనిత వస్తుంది. దీపకు వార్నింగ్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. కానీ రివర్స్‌లో దీపే షాక్ ఇస్తుంది. ఇక ముందు ముందు అసలు కథ చూస్తావ్ అన్నట్టుగా మోనితకు దీప వార్నింగ్ ఇస్తుంది.

    Leave a Reply