• December 29, 2021

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు విషయంలో గౌతమ్‌కు రిషి వార్నింగ్.. నలిగిపోతోన్న జగతి

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు విషయంలో గౌతమ్‌కు రిషి వార్నింగ్.. నలిగిపోతోన్న జగతి

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే బుధవారం నాటి Guppedantha Manasu Episode 333 ధారావాహికలో జగతి చేసిన పనులుకు, అంటోన్న మాటలకు వసు బాధపడుతుంది. ఇక వసు విషయంలో గౌతమ్ కాస్త ఓవర్ చేస్తున్నాడు.. ఇదే విషయాన్ని స్వీట్ వార్నింగ్ ఇస్తూ గౌతమ్‌కు చెప్పేశాడు రిషి. గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

    రెస్టారెంట్‌లో వసు,గౌతమ్ ఉన్న సంగతి తెలిసిందే. నేను వెళ్తాను సర్.. అని వసు అంటుంది. నేను వస్తానని అన్నాను కదా?? అని గౌతమ్ అనే సమయంలో నేనూ వస్తాను.. అని రిషి ఎంట్రీ ఇస్తాడు. అరేయ్ నువ్వేంట్రా సడెన్‌గా.. అని గౌతమ్ షాక్ అవుతాడు. సర్ ప్రైజ్ ఇద్దామని.. ఇలా వచ్చారా? అని రిషి అంటాడు. కాఫీ తాగుతారా సార్ అని వసు అడుగుతుంది.

    నో థ్యాంక్స్ అని అంటాడు. మరి ఎందుకు వచ్చినట్టో అని గౌతమ్ అంటాడు. నువ్ పదా వసుధార. వీడు ఇక్కడే ఉంటాడేమో అని రిషి వెళ్లిపోతాడు. నేను ఎందుకు రాను..నేను కూడా వస్తాను.. కరెక్ట్ టైంకి ఊడి పడతాడు… ఏదో పని ఉన్నట్టు.. ఎదవ.. ఎవరో పిలిచినట్టు.. నేను ఏదో వసుధారతో టైం గడపాలని అనుకుంటే.. విలన్‌లా తయారయ్యాడు. అంటూ రిషి గురించి గౌతమ్ లోలోపల అనుకుంటాడు.

    థ్యాంక్స్ రిషి సర్.. కరెక్ట్ టైంకి వచ్చారు.. లేరంటే..గౌతమ్ సర్‌ని వదిలించుకోవడం కష్టమయ్యేది.. అని వసు మనసులో అనుకుంటుంది. వీడు జిడ్డులా ఉన్నాడు.. ఆటోలో కూడా వెళ్లేందుకు రెడీ అయ్యాడు.. కరెక్ట్ టైం చూసి చెప్పాలి.. లేదంటే ఇంకా ఎక్కువ చేసేలా ఉన్నాడు.. అని గౌతమ్ గురించి రిషి అనుకుంటాడు. వసు ఏదో చెప్పబోతోంటే గుడ్ నైట్ అని కోపంగా చెప్పేస్తాడు రిషి

    ఇక కారులోంచి దిగిన గౌతమ్ గుడ్ నైట్ వసుధార, స్వీట్ డ్రీమ్స్ అని కాస్త ఎక్స్ ట్రాలు చేస్తాడు.. ఇక్కడే ఉండి గుడ్ మార్నింగ్ చెప్పి రా..అని గౌతమ్ మీద సెటైర్లు వేస్తాడు. నన్ను వదిలేసి వెళ్తావా? అని గౌతమ్ అంటే.. నీకు కూడా వదిలేసి వెళ్లాలనే ఉంది కదా?.అని రిషి అంటాడు అవేం మాటలు రా..అని కారు ఎక్కేసి వెళ్తాడు గౌతమ్. అబ్బబ్బ రిషి సర్ ఏంటో అర్థం చేసుకోలేరు. అంటూ ఇంట్లోకి వెళ్లిన వసు.. జగతితో ఇలా చెబుతుంది.

    అప్పుడే వసుధార అది ఇది అని ఆనందంగా చెబుతారు.. అంతలోనే సీరియస్‌గా మారిపోతారు.. ఒక్కోసారి చిన్నపిల్లాడిలా ఉంటారు.. సడెన్‌గా మూడ్ మారిపోతంది.. మెసెజ్‌లకు రిప్లై ఇస్తూనే ఉంటారు.. సడెన్‌గా గుడ్ నైట్ అని పెట్టేస్తారు.. అంతెందుకు మేడం నేను మాట్లాడబోతోన్నాను గుడ్ నైట్ అనేశారు.. అని వసు ధార నోటికొచ్చినట్టు వాగుతూనే ఉంటుంది. దీంతో జగతి కూడా గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్లబోతుంది.

    ఇప్పుడే వచ్చాను కదా? అప్పుడే గుడ్ నైట్ ఏంటి..?అని వసు అంటుంది. నువ్ రిషి సర్ గురించి చెబుతున్నావ్.. నేను షార్ట్ ఫిల్మ్ గురించి పని చేస్తున్నాను.. నువ్ షార్ట్ ఫిల్మ్ పని చేశావా? అని జగతి ప్రశ్నిస్తుంది. లేదు మేడం.. అని వసు అంటుంది. మన మాటలు మాత్రమే కాదు.. పనులు కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి.. అని జగతి అంటుంది. మీరు పని చేస్తున్నారు.. కదా? అని వసు చెప్పబోతుంది.

    అన్ని పనులు నేనే చేయాలి.. మరి నువ్వేం చేస్తావ్.. వన భోజనాలు, ఉయ్యాలలు, కబుర్లు ఇవేనా?. అంటూ వసుని బాధపెడుతుంది. మీరెందుకు కొత్తగా మాట్లాడుతున్నారు.. అని వసు అంటుంది. నీ ఆలోచనలు, లక్ష్యాలు ఏవి,.. ఇంతకు ముందున్న ఏకాగ్రత లేదు.. అన్ని తగ్గిపోతోన్నాయి.. వంటకాల్లో అన్ని ఘుమఘుమలుంటాయి.. అన్నింటికి రుచిని ఇచ్చే ఉప్పుకు మాత్రం వాసన ఉండదు.. నువ్ ఉప్పులా కరిగిపోతోన్నాయి..

    రెస్టారెంట్ డ్యూటీ అయ్యాక ఇంటికి వస్తే.. బాగుంటుంది.. ఇష్టమొచ్చిన టైంకు వస్తే. ఇళ్లు అనరు.. నేను తినేశాను.. నువ్ తినేసి వస్తావని అనుకున్నాను.. తినకపోతే.. వంట చేసుకుని తిను.. అని చెడామడా తిట్టేసి వెళ్తుంది జగతి. మేడం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు .. ఇది మేడం మనస్తత్వం కాదు.. నేను ఏమైనా తప్పు చేశానా? అని వసు బాధపడుతుంది. సారీ వసు ఇంత కన్నా వేరే మార్గం లేదు.. అని జగతి లోలోపల కుమిలిపోతుంది.

    కారులో వెళ్తున్న రిషి.. జగతితో మాట్లాడిన మాటల గురించి గుర్తు చేసుకుంటూ.. వసుధారను పంపించే ఉద్దేశ్యం ఉందా? లేదా?.. అని అనుకుంటాడు. కారులో పాటలు పెట్టేందుకు గౌతమ్ ప్రయత్నిస్తాడు. సైలెంట్‌గా కూర్చోరా అని రిషి వారిస్తాడు.. వసుధార ఉందని మర్యాదగా ఉన్నా ఈ సైలెంట్‌ను భరించలేను అని గౌతమ్ అంటాడు.. నీ ధోరణి నీదేనా?. అని రిషి అంటే.. పెడతాను అంతే అని గౌతమ్ మొండి పట్టు పడతాడు.

    కారు దిగరా? అని గౌతమ్‌ని అంటాడు రిషి. అసలు నీ ఉద్దేశ్యం ఏంట్రా అని రిషి అడుగుతాడు.. నా ఉద్దేశ్యం ఏంట్రా? అని గౌతమ్ తిరిగి ప్రశ్నిస్తాడు.. నీ పద్దతి నాకు నచ్చడం లేదు.. అని రిషి అంటాడు. అదా నీ కడుపు మంట అని గౌతమ్ కౌంటర్ వేస్తాడు. షటప్ అని రిషి అరిచేస్తాడు. అమ్మాయిని రాత్రి పూట కలవడం ఏంట్రా.. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు.. ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండు. అని గౌతమ్‌కు రిషి వార్నింగ్ ఇస్తాడు.

    వసుధార అంటే.. అని ఏదో చెప్పబోతోంటాడు గౌతమ్. ఆపరా అని రిషి అరిచేస్తాడు. నువ్ నేను వద్దని అనుకున్నా.. విధి కలుపుతుంది.. నేను వెళ్లి ఏమైనా పరిచయం చేసుకున్నానా? అని గౌతమ్ అంటాడు. నువ్ ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావ్ అని గౌతమ్ ప్రశ్నిస్తాడు.. మనం ఫ్రెండ్స్.. ఫ్రెండ్స్‌లానే ఉందాం.. తను ఓ లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.. తనను డిస్టర్బ్ చేయకు.. చెప్పింది వినురా.. కారు ఎక్కు అని రిషి అంటాడు.

    అరేయ్ ఏంట్రా నీ దౌర్జన్యం.. దింపేటప్పుడు, కూర్చోపెట్టేటప్పుడు ఇలానేనారా? అని గౌతమ్ అంటాడు… అరేయ్ కూర్చోరా అని గౌతమ్‌ని రిషి కారులో ఎక్కిస్తాడు.. ఏంట్రా ఆ చూపు.. అని రిషి అంటే.. ఎలా చూడాలో కూడా నువ్వే చెబుతావా? అని గౌతమ్ కౌంటర్ వేస్తాడు. అరేయ్ ఇడియట్.. మైండ్‌లో ఏమున్నా తీసేయ్.. తను అద్భుతాలు చేస్తుంది.. బ్రిల్లియంట్ స్టూడెంట్.. అని చెబుతాడు రిషి. ఇప్పుడు పెట్టుకోవచ్చా సాంగ్స్.. అని గౌతమ్ అంటై రిషి చూపులను అర్థం చేసుకుని వద్దులేరా బాబు.. అని గౌతమ్ సైలెంట్ అయిపోతాడు.

    జగతి మాటలను తలుచుకుంటూ వసు బాధపడుతుంది. మేడం ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు.. నేను ఏమైనా తెలిసో తెలియక తప్పు చేశానా?.. తన తత్త్వానికి విరుద్దదంగా ఇలా ఎందుకు చేస్తున్నారు.. అని వసు బాధపడుతుంది. ఇక మరో వైపు ఫణీంద్ర,మహేంద్ర, గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం గౌతమ్ ప్లాన్స్ ఏంటి? అని ఫణీంద్ర అంటాడు.

    ఏదో అనుకున్నాను.. ఏదో జరుగుతోంది.. అనుకోని మంచి ఏదో జరగబోతోన్నట్టు అనిపిస్తోంది పెదనాన్న గారు.. అని గౌతమ్ చెబుతాడు. ఇంతలో మహేంద్రకు వసు ధార ఫోన్ చేస్తుంది. అన్ని విషయాలు చెప్పేస్తుంది. అంతగా టెన్షన్ పడకు వసు.. మేడం ఇలా ఉండరు.. నాక్కూడా తన మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు.. ఎవరైనా ఏమైనా అన్నారో తెలియడం లేదు.. కొత్త ఆలోచన వచ్చినట్టుంది.. అదేంటో నాకు తెలియడం లేదు..నేను చూసుకుంటాను.. వదిలేయ్.. అని వసుకు సర్ది చెబుతాడు మహేంద్ర. ఇవన్నీ కూడా రిషి వింటాడు.

    మేడం ఎందుకిలా మాట్లాడుతున్నారో అందరికీ చెప్పే బదులు.. డైరెక్ట్‌గా మేడంనే అడుగుతాను.. మేడం.. ఒక్క మాట మాట్లాడాలి.. అని జగతిని ప్రశ్నిస్తుంది వసు. కాలేజ్ టైం అవుతుంది అని జగతి అంటే.. అయితే అవ్వనివ్వండి.. నేను ఏం తప్పు చేశాను.. మీలో మార్పు ఎందుకు వచ్చింది.. నా వల్ల ఏదైనా పొరబాటు, తప్పు చేసినా అడగొచ్చు కదా? నన్ను అడిగే హక్కు, నిలదీసే హక్కు.. ఉంది మేడం.. ఎందుకు కొత్తగా ప్రవర్తిస్తున్నారు.. ఏమైంది మేడం మాట్లాడారేంటి.. చెప్పండి మేడం.. అని వసు ప్రశ్నలు కురిపిస్తుంది.

    నువ్ ఇంట్లోంచి వెళ్లిపోవాలి వసు.. అని జగతి చెబుతుంది. మేడం.. ఏమంటున్నారు.. అని వసు అంటుంది. అర్థం కాలేదా? నువ్ ఇంట్లోంచి వెళ్లిపోవాలి.. హాస్టల్‌కి వెళ్లిపో.. అని జగతి అంటుంది. ఇంట్లోంచి వెళ్లిపోవాలా? ఎందుకు మేడం.. అని వసు అడుగుతుంది. కారణాలు అడగొద్దు వసుధార.. అని జగతి అంటుంది. ఎందుకు వెళ్తున్నానో.. తప్పేంటో తెలియాలి కదా?. అని వసు అంటే.. తప్పొప్పుల గురించి అవసరం లేదు.. వెళ్లమంటున్నాను వెళ్లాలి అంతే.. అని జగతి అంటుంది.

    నా వల్ల జరిగిన తప్పేంటి.. అని వసు ప్రశ్నిస్తుంది. రిషి పంపించమన్నాడు.. అని జగతి చెబుతుంది. రిషి సర్ పంపమన్నాడా?.. అయితే రిషి సర్‌తోనే తేల్చుకుంటాను మేడం..అని వసు వెళ్తున్నట్టు.. జగతి కల కంటుంది. ఇదంతా కలనా?అని జగతికి అర్థమవుతుంది. వసుకి నేను ఏం చెప్పలేదా? ఇదంతా నా ఊహనా?. ఏమైనా అడిగావా? వసు అని జగతి అంటుంది.

    అడగాలనే వచ్చాను. కానీ మీరు కొత్తగా మాట్లాడారు.. ఏమైంది మేడం.. నేను ఏమైనా తప్పు చేశానా? నా ప్రశ్నకు మీరేం చెప్పడం లేదు.. నా వైపుని నుంచి ఏమైనా మార్చుకోవాలా? అని వసు అడుగుతూనే ఉంటుంది. కాసేపు నన్ను వదిలేస్తావా ప్లీజ్.. అని వసు నుంచి జగతి తప్పించుకుంటుంది. ఇక అలా ఎపిసోడ్ ముగుస్తుంది. జగతి మేడం ప్రవర్తన గురించి రిషికి చెబుతుంది వసు. ఇకపై ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోతాను అని రిషికి చెప్పడంతో షాక్ అవుతాడు. మరి మున్ముందు వసు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

    Leave a Reply