• December 29, 2021

Karthika Deepam : బిడ్డల కోసం భయపడ్డ కార్తీక్.. బాబును ఎత్తుకెళ్లిన రుద్రాణి.. చూస్తుండిపోయిన వంటలక్క

Karthika Deepam : బిడ్డల కోసం భయపడ్డ కార్తీక్.. బాబును ఎత్తుకెళ్లిన రుద్రాణి.. చూస్తుండిపోయిన వంటలక్క

    కార్తీక దీపం ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ అంటే.. బుధవారం నాటి Karthika Deepam Episode 1235 ధారావాహికలో కొన్ని చిక్కు ముడులకు సమాధానాలు దొరికేశాయి. మోనితను ఇంట్లోంచి వెళ్లగొట్టేశారు. రుద్రాణి వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్తుంది. కోటేశు బిడ్డను ఎత్తుకొచ్చాడని తెలిసిపోయేలా ఉంది. ఇక కార్తీక్ ఆచూకి గుట్టు కూడా బయటపడే సమయం వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఎలా గడిచిందంటే..

    ఇంకోసారి గడప తొక్కాలని ప్రయత్నించకు వెళ్లిపో అని మోనితకు సౌందర్య వార్నింగ్ ఇస్తుంది.. థ్యాంక్స్ అత్తయ్య గారు.. నేను బాధ్యతను మరిచినా కూడా మీరు మాత్రం మీ మనవడు ఎక్కడున్నాడు.. ఏమైపోయాడు అని గుర్తించారు. ఈ విషయంలో మీ తప్పు లేదని తెలిసింది.. సంతోషం.. గడప తొక్కొద్దు.. ఇంటికి రావొద్దని అన్నారు.. అది బాగా లేదు.. నా బిడ్డను, కార్తీక్‌ను పట్టుకుంటాను.. ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను.. మీ ఆరోగ్యం జాగ్రత్త.. చలి బాగా పెరిగింది.. మార్నింగ్ వాక్‌లు కాకుండా కాకుండా ఈవెనింగ్ వాక్‌లు చేయండి.. శ్రావ్య.. అత్తయ్య, మావయ్య గారిని బాగా చూసుకోండి.. నన్ను ఆశీర్వదించండి.. అంటూ కాళ్లు మొక్కబోయింది మోనిత. కానీ సౌందర్య మాత్రం దూరం జరుగుతుంది.దీంతో మోనిత బయటకు వెళ్లిపోతుంది.

    ఇక సీన్ కోటేశ్ శ్రీవల్లి బారసాలపై ఓపెన్ అవుతుంది. బాబుకు ఏం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు..అని పంతులు అడుగుతాడు. ఆనంద్ అని కోటేశ్ చెబుతున్నప్పుడే.. రుద్రాణి ఎంట్రీ ఇచ్చి రంగరాజు.. రంగరాజు..అని చెబుతుంది. ఏం శ్రీవల్లి పేరు బాగుందా? నచ్చిందా?.. ఈ బిడ్డను నేను దత్తత తీసుకుంటాను.. అని రుద్రాణి దౌర్జన్యం చేస్తుంది.

    ఇది అన్యాయం అక్క.. అని కోటేశ్ అంటాడు. అన్యాయం, న్యాయం లాంటివి ఉండవు.. బలవంతులు చేసిందే న్యాయం.. దత్తత తీసుకున్నాను.. అయిపోయింది.. అంతే అని రుద్రాణి బెదిరిస్తుంది. నీ దగ్గర కన్నా నా దగ్గరే దర్జాగా పెరుగుతుంది.. అని ఏడుస్తున్న శ్రీవల్లిపై రుద్రాణి జాలి చూపించదు. మీరు తప్పు చేస్తున్నారు అని కార్తీక్.. బిడ్డను ఇచ్చేయండి.. అని దీప అంటారు.

    నీకు నీ గొడవకు సంబంధం లేదు.. అడుగు ముందుకు వేస్తే చాలా దూరం వెళ్తుంది.. అని రుద్రాణఇ అంటుంది. పాపం వాళ్ల బిడ్డ.. అని కార్తీక్ అంటాడు. హలో సారు మీ మొగుడు పెళ్లాలు ఎక్కువ చేశారు.. నాకు బాబును పెంచుకోవాలని ఉంది.. ఒప్పందం ప్రకారం అయితే నీ బిడ్డలను తీసుకెళ్లాలి తీసుకెళ్లమంటావా? అని కార్తీక్‌ను కట్టిపడేస్తుంది… అప్పు రద్దు చేస్తాను అంటున్నాను కదరా అని కోటేశ్, శ్రీవల్లికి రుద్రాణి చెబుతుంది.

    వంటలక్క ముందుకు వస్తుంటే.. వంద మందిని పిలుస్తాను.. నువ్వు నీ పిల్లలు అన్యాయం అవుతారు.. దీప.. అడుగు ముందుకు వేశావంటే అన్యాయం అవుతారు.. ఊరు కాను ఊరు వచ్చావ్.. ఏదైనా చేయగలను.. ఏదైనా చేయగలను.. నీ పిల్లల మీద ఏ మాత్రం ప్రేమున్నా.. అడ్డు రాకండి..అని రుద్రాణి హెచ్చరించడంతో దీప ఆగిపోతుంది. తమ్ముడు అని పిల్లలు ఏడుస్తుంటే.. తమ్ముడు కాదమ్మా.. ఇప్పుడు వాడికి పేరుంది.. రంగరాజు తమ్ముడు..అని రుద్రాణి చెప్పి వెళ్తుంది.

    రేయ్ ఆదిత్య ఇక్కడేం చేస్తున్నావ్.. వంటగదిలోకి వెళ్లు అని సౌందర్య అంటుంది. నేను వెళ్లాలా? అని ఆదిత్య అంటాడు. మా ముగ్గురికి కాఫీ పట్టుకునిరా అని చెబుతుంది. దీంతో శ్రావ్య నవ్వేస్తుంది.. చాలా ఉత్సాహంగా ఉన్నావ్ సౌందర్య అని ఆనంద్ రావు అంటాడు.. మోనిత బిడ్డ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది కాబట్టి ఆనందంగా ఉన్నాను.. అని సౌందర్య అంటుంది. మోనిత నోటికొచ్చినట్టు వాగింది కదా? అత్తయ్య.. అని శ్రావ్య అంటుంది. తన గురించి అందరికీ తెలిసిందే కదా?.మొత్తానికి రత్నసీత హెల్ప్ చేసింది.. అని సౌందర్య అంటుంది.

    రత్నసీత సాయంతోనే కార్తీక్‌ని వెదుకుదామని ఆనంద్ రావు అంటాడు. పెద్దాడు త్వరలోనే వస్తాడనిపిస్తుంది అంటూ సౌందర్య చెబుతుంది..అమ్మ మనసు కదా? అలానే ఉంటుంది.. అని ఆనంద్ రావు అంటాడు.

    ఆ మోనిత ఏంటి.. బిడ్డ కనిపించడం లేదనే మొహంలో ఆ బాధ ఉండదు.. అని శ్రావ్య అంటే.. ఆనంద్ రావు మాత్రం జాలి పడతాడు. కన్న తల్లే కదా? వాడు బిడ్డే కదా?.. మనం ఎంత సేపు మోనిత మీదున్న కోపంతో బాబు మీద కాస్తంత కూడా జాలీ చూపించలేదు..ఎక్కడికి తీసుకెళ్లారో.. ఏం చేశారో.. అని ఆనంద్ రావు బాధపడతాడు. మోనిత మీద కోపంతో బాబు గురించి ఆలోచించలేదు.. అని సౌందర్య అంటుంది.

    ఎన్నో కాన్పుల తరువాత ఇలా బాబు దొరికితే.. బిడ్డను కూడా లాక్కెళ్లింది.. నా ఇళ్లు తీసుకున్నా బాధపడలేదు.. నా కలలు, ప్రేమను తీసుకెళ్లింది.. నేను ఎలా తట్టుకోలేను.. అని శ్రీవల్లి పరివిధాలుగా తపిస్తుంది. ఏం చేస్తావ్ శ్రీవల్లి.. అని కోటేశ్ అంటాడు. నాలుగు గోడల మధ్య కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది.. మనం మాత్రం ఇలానే ఉన్నాం.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిదింత చెబుదాం.. పదా అని శ్రీవల్లి అంటుంది. నువ్ ఊరుకోవయ్యా.. అన్నింటికి భయపడతావ్.. కనకపోయినా.. పెంచిన ప్రేమ గొప్పదని అంటారు.. వాడిని నేను ఎలా ఒదులుకుంటాను.. అని శ్రీవల్లి బయల్దేరబోతోంది. దీప ఆపడానికి ప్రయత్నం చేస్తుంది.. నన్ను ఆపకండి..అని శ్రీవల్లి అంటుంది.

    ఏమయ్యా. నువ్ వస్తావా? నేను వెళ్లాలా?.. అని శ్రీవల్లి అంటుంది. మనం కూడా వెల్దామా? అని దీప అంటే.. మనం ఉన్న పరిస్థితుల్లో.. అని కార్తీక్ అంటాడు. దీంతో శ్రీవల్లి అర్థం చేసుకుని.. మీరు పోలీస్ స్టేషన్‌కు రావాలో కూడా వద్దో తెలీదు.. మా కోసం ఇప్పటికే చాలా కష్టపడ్డారు.. మీరు రావొద్దు.. నేనే వెళ్తాను అని అంటుంది.సస

    ఈపాటికే అన్ని ఫోటోలు, మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు.. అని దీపతో కార్తీక్ అంటాడు. నేను వెళ్తున్నాను.. అంటూ శ్రీవల్లి బయటకు వచ్చేస్తుంది. శ్రీవల్లి కోసం కోటేశ్ కూడా ఆమె వెంటే వెళ్తాడు. మనం సాయం చేయలేకపోతోన్నాం అని దీప బాధపడుతుంది.. పరిస్థితులను బట్టి మసులు కోవాలి.. అని కార్తీక్ అంటాడు. అవును రుద్రాణి మీతో ఏదో మాట్లాడుతోంది.. అని దీప పసిగడుతుంది. ఏం లేదు దీప అని కార్తీక్ కాఫీ అడుగుతూ మాట మార్చేస్తాడు.

    వంటలక్క ప్రజా వైద్యశాలలో మోనిత అలా కూర్చుంటుంది. వీడేంటి నా బాబును ఎత్తుకెళ్లాడు.. వీడు ఎవ్వడు.. వీడిని ఎక్కడ పట్టుకోవాలి.. కార్తీక్ ఎక్కడున్నాడు.. నా బాబు ఎక్కడున్నాడు.. నేను ఎలా ఉంటున్నాను.. నాకే అర్థం కావడం లేదు..మొండి ధైర్యమా? ప్రేమ ధైర్యమా? నువ్ ఇలానే ఉండాలి.. ఇలానే ఆలోచించాలి.. అంటూ తనలో తాను అనుకుకుంటుంది మోనిత.

    దోమలు కొట్టుకుంటున్న నర్సమ్మపై మోనిత సెటైర్లు వేస్తుంది.. దోమలు కొటుకుంటున్నావా?. అని మోనిత అడుగుతుంది. ఏం చేద్దాం పేషెంట్స్ రావడం లేదు కదా? మేడం అని నర్సమ్మ అంటుంది. అంత పెద్ద డాక్టర్‌వి కదా? ఇక్కడెందుకు హాస్పిటల్ పెట్టారు అని అడుగుతుంది.. నువ్ ప్రశ్నలు వేయోద్దు.. నేను వేస్తే సమాధానాలు చెప్పాలి.. నాకు కోపం ఎక్కువ.. సిల్లీప్రశ్నలు వేయకు..అడగాలి అంటే.. మనసులో అడుక్కో.. నీకు నువ్వే సమాధానం చెప్పుకో..

    హాస్పిటల్ ముందు వారణాసి యాక్టింగ్.. రాకుండా వెళ్లిపోతారు. ఎవ్వరూ రావడం లేదేంటి మేడం అని నర్సమ్మ అడుగుతుంది. ఎలుకలు బోనులో పడ్డట్టు.. ఒకసారి రెండో సారి కాకపోయినా మూడోసారి మన దగ్గరకు రావాల్సిందే.. వస్తారు.. మోనిత అనుకున్నది మిస్ కాదు.. ఎవడ్రా నువ్.. నా కొడుకుని తీసుకుని వెళ్లావ్ అంటే ఎంత ధైర్యం రా.. నువ్ నాకు దొరకాలి..అంటూ మోనిత అనుకుంటూ ఉంటుంది.

    రుద్రాణి మాటలను కార్తీక్ గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. ఏంటి సామీ ఏం ఆలోచిస్తున్నారు.. అని దీప అడుగుతుంది. రుద్రాణి విషయంలో తప్పు చేశానేమో అని కార్తీక్ బాధపడతాడు. రుద్రాణి మనుషులను కొట్టకుండా ఉండాల్సిందని కార్తీక్ అంటే.. నేను మరి రుద్రాణినే కొట్టాను.. అయిపోయిందాని గురించి ఆలోచించి వేస్ట్.. ఆ పరిస్థితుల్లో అది రైట్ అనిపించింది. మన ఉండే పరిస్థితుల్లో ఇలా చేయాల్సింది కాదు అని డాక్టర్ బాబు, దీప అనుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్ తన మనసు మార్చుకుంటాడు. పోలీస్ స్టేష్‌కు వెళ్లేందుకు రెడీ అవుతాడు. మరో వైపు కార్తీక్ ఫోన్ దొరికడంతో ఎంజాయ్ చేస్తున్న మహేష్‌ను రత్న సీత పట్టుకుంటుంది.. సౌందర్య వద్దకు తీసుకొస్తుంది. అసలు నిజం తెలుస్తుంది. ఇక త్వరలోనే కార్తీక్ ఆచూకి అందరికీ తెలుస్తుందేమో చూడాలి.

    Leave a Reply