• December 28, 2021

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడడ్.. రెస్టారెంట్‌లో వసుతో గౌతమ్.. కంగారుపడ్డ రిషి

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడడ్.. రెస్టారెంట్‌లో వసుతో గౌతమ్.. కంగారుపడ్డ రిషి

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే మంగళవారం నాడు అంటే Guppedantha Manasu Episode 332 ధారావాహికలో జగతి బాధపడుతూ ఉంటుంది. జగతి చేష్టలు, మాటల వల్ల వసు ఫీలవుతుంది. జగతి ఎందుకు ఇలా చేస్తుందా? అని మహేంద్ర ఆరా తీస్తాడు. ఇక వసుతో గౌతమ్ ఎక్కడ క్లోజ్ అవుతాడా? అని రిషి కంగారు పడతాడు. అలా ఈ ఒక్క ఎపిసోడ్‌లో ఎన్నెన్నో ఎమోషన్లను చూపించారు. గుప్పెడంత మనసు సీరియల్ నేడు ఎలా సాగిందంటే..

    జగతి మేడం అన్న మాటలను మహేంద్రకు వసు చెబుతుంది. అంటే జగతి మేడంలో మార్పు వచ్చిందని అంటావా? వసు అని మహేంద్ర అడుగుతాడు. మామూలు మార్పు కాదు సర్.. మేడం గురించి నాకు తెలుసు.. ఆమె ఎప్పుడూ అలా ప్రవర్తించరు.. ఒకసారంటే చిరాకులో అని అనుకోవచ్చు.. కానీ ఇలా ఎప్పుడూ అనరు అని వసు చెబుతుంది.

    అలా వసు చెబుతూ ఉంటే ఇంట్లో మాత్రం జగతి ఒంటరిగా అన్నీ ఆలోచిస్తూ బాధపడుతుంది. అదే సమయంలో మహేంద్ర ఫోన్ చేస్తాడు. మహేంద్ర ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జగతి. ఇక ఎప్పటిలానే మహేంద్ర జోకులు వేస్తుంటాడు. బాగున్నావా? అని అడుగుతాడు. ఇందాకే కాలేజ్‌లో కలిశాం.. మళ్లీ ఇప్పుడు అడుగుతున్నారేంటి? అని జగతి చిరాకు పడుతుంది.

    ఇంటికి రావాలా? కాఫీ పెట్టాలా? అని మహేంద్ర అడుగుతాడు. కానీ జగతి వద్దని అంటుంది. కలిసి బయటకు వెళ్దామా?, అలా నడిచి వద్దామా. అని అని మహేంద్ర అంటాడు నేను రాలేను తలనొప్పిగా ఉంది.. అని ఫోన్ కట్ చేస్తుంది జగతి.

    ఏంటమ్మా మీ మేడం మాట్లాడుతూ ఉంటేనే కట్ చేస్తారు.. అని జగతి గురించి వసుతో మహేంద్ర అంటాడు. రిషి సర్ కూడా అంతే.. ఒక్కోసారి అలానే చేస్తాడు అని వసు చెబుతుంది. ఎంతైనా తల్లీకొడుకులు కదా? అని మహేంద్ర అంటాడు. ఏమంటున్నారు సర్.. మేడం.. అని వసు అడుగుతుంది. చెప్పేది వింటే కదా? అని మహేంద్ర అంటాడు. ఇవన్నీ నేను చూసుకుంటానులే.. నువ్ డ్యూటీకి వెళ్లు.. ఇవన్నీ ఆలోచించకు.. అని వసుకి సర్ది చెబుతాడు. జగతి డిస్టర్బ్ అయితే వసుని ఎందుకు ఇబ్బంది పెడుతోంది.. తెలుసుకోవాలి.. అని మహేంద్ర తనలో తాను అనుకుంటాడు.

    రిషి బట్టలను ధరణి సర్దిపెడుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు చేయాలా? వదిన.. అని రిషి అంటాడు. నువ్వంటే నాకు అభిమానం.. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది.. అని ధరణి అంటుంది. థ్యాంక్స్ వదిన అని రిషి బదులిస్తాడు. ఏమైనా స్నాక్స్ తీసుకుని రావాలా? రిషి అని ధరణి అడుగుతుంది. వదిన.. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు వదిన.. అంటాడు. వీడింకా రాలేదా? అని గౌతమ్ గురించి రిషి అడుగుతాడు.

    నీ దగ్గరికే వస్తానని అన్నాడు.. అంటూ ధరిణి చెబుతుంది. అవునా.. రాలేదే.. అని రిషి అంటాడు. ఇవన్నీ నేను సర్దుకుంటాను.. అని రిషి అంటాడు. నువ్ వెళ్లు వదిన అని బయటకు పంపించేస్తాడు. గౌతమ్ వేసిన పెయింటింగ్‌ను చూసేందుకు రిషి ప్రయత్నం చేస్తాడు. గౌతమ్ అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు గౌతమ్. నీ కళ్లు గిర్రున తిరుగుతాయ్.. అని గౌతమ్ అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు. మొత్తం అయ్యాక చూద్దాంలే అని గౌతమ్ ఊరుకుంటాడు.

    ఏంటి జగతి మాట్లాడవేంటి? అని మహేంద్ర అంటాడు.. తలనొప్పిగా ఉందని చెప్పా కదా? . అయినా వచ్చావ్.. ఇలా అడుగుతున్నావ్..ఏంటి అని మమేంద్ర మీద జగతి చిరాకు పడుతుంది. ఎప్పటికీ ఒకేలా ఉండం కదా? అని జగతి అంటుంది. నిన్ను ఏదో విసుగించాలని కాదు.. ఏం జరిగింది జగతి అని మహేంద్ర అడుగుతాడు. మహేంద్ర నా మనసు కనిపెట్టేశాడా?. మామూలుగా అడుగుతున్నాడా?.. అని జగతి లోలోపల అనుకుంటుంది.

    నా గురించి టెన్షన్ పడకు.. నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు అని జగతి చెబుతుంది. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? అని నేను అడగలేదు కదా? అని మహేంద్ర అంటాడు. తమరు అనుకుంటారు కదా? ఒకటికి పది అల్లుకుంటారు కదా? వర్క్ లోడ్ ఎక్కువైంది.. అందుకే ఇలా ఉన్నాను అంటుంది. కాఫీ పెట్టాలా? బయటకు వెళ్దామా? కాసేపు అలా వెళ్దామా? అని మహేంద్ర అడుగుతాడు.

    కానీ అన్నింటికి నో అని చెబుతుంది. నువ్ వెళ్లు మహేంద్ర.. అని జగతి అంటుంది. జగతి.. నీ మొహం అద్దంలాంటిది.. ప్రతీ చిన్న భావం అర్థమవుతోంది.. అని మహేంద్ర అంటాడు. ఇంత ప్రేమగా అడిగితే చెప్పేలా ఉన్నాను.. నీకు చెబితే.. రిషితో మళ్లీ అడుగుతావ్.. మళ్లీ రిషి బాధ పడతాడు.. అని జగతి లోలోపల అనుకుంటుంది. ఏదో జరిగిందని నాకు తెలుస్తోంది.. అది నేను తెలుసుకుంటాను.. మన మధ్య ఈ దాపరికాలు రావాల్సిన పరిస్థితి ఏంటో అని మహేంద్ర తనలో తాను అనుకుంటాడు.

    ఇక వసు రెస్టారెంట్‌లో గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. ఏంటో దేవుడి విచిత్రాలు.. రెస్టారెంట్‌లో దేవత కనిపిస్తోంది.. ఆ నవ్వు చూడు.. వెన్నెల వర్షం కురిసినట్టుంది.. అంటూ గాల్లో తేలిపోతాడు. ఇక వసు టేబుల్ అని తెలియకుండా రెస్టారెంట్‌లో కూర్చుని కాఫీల మీద కాఫీలు తాగుతాడు. ఎంతకీ వసు చూడకపోవడంతో పిలుస్తాడు గౌతమ్.

    మీరు ఎప్పుడు వచ్చారు సర్ అని వసు ప్రశ్నిస్తుంది. పూర్వకాలం వచ్చాను.. ఇవన్నీ నేను తాగిన కాఫీలే నువ్వే నన్ను చూడటం లేదు అని అంటాడు. ఇది నా టేబుల్ కాదు సర్.. అది నా టేబుల్ అని చెప్పడంతో అక్కడికి వెళ్లి కూర్చుంటాడు. మళ్లీ కాఫీ తాగుతాను అని అంటాడు. ఇది నువ్ ఇచ్చే స్పెషల్ కాఫీ కదా? అని వసుతో గౌతమ్ మాటలు కలిపేస్తాడు.

    అలా వసు ఇచ్చిన కాఫీని స్టేటస్‌లో పెట్టుకుంటాడు. అది చూసిన రిషి రెస్టారెంట్‌కు బయల్దేరుతాడు. ఎక్కడికి రిషి అని ధరణి అంటుంది. చిన్న పని వదిన.. వెళ్లేసి వస్తాను.. అని రిషి వెళ్లిపోతాడు. అత్తయ్య గారు.. అంటూ దేవయాణి దగ్గరకు పాలు తీసుకుని ధరిణి వెళ్తుంది.. నా మీద నీకు కోపం వస్తుందా? ధరణి అని దేవయాణి అడుగుతుంది. మీ మీద నాకు ఎందుకు వస్తుంది అత్తయ్య గారు అని ధరణి అంటుంది.

    నాకు వస్తుంది.. ఎన్ని సార్లు అడిగినా కూడా బెల్లం కొట్టిన రాయి.. రిషి వసుల మధ్య ఏం జరుగుతోందో చెప్పవు.. నీ వల్ల పైసా ఉపయోగం లేదు.. అని దేవయాణి అంటుంది. నాకేం తెలియదు.. ఎలా చెప్పమంటారు అని ధరణి అంటుంది. కారు సౌండ్ వినిపించింది.. ఎవరి కారు.. రిషిదేనా?. అని దేవయాణి అడుగుతుంది. రిషి బయటకు వెళ్లాడు అని ధరణి చెబుతుంది..

    ఈ టైంలో బయటకు వెళ్లడం ఏంటి.. అడగాలి కదా?.అని దేవయాణి అంటుంది. బయటకు వెళ్లేటప్పుడు అడగకూడదు కదా? అని ధరణి సమాధానం చెబుతుంది. వెళ్లేటప్పుడు అలా అను.. వచ్చాక ఏం అనుకుంటాడో అని అడగవు..అని ధరణి మీద అసహనం వ్యక్తం చేస్తుంది. ట్యాబ్లెట్లు నేను వేసుకుంటానులే.. వీటికైతే తక్కువ లేదు అని ధరణి మీద చిరాకు పడుతుతుంది. రిషి ఎక్కడికి వెళ్లినట్టు..అని దేవయాణి అనుకుంటూ ఉంటుంది.

    ఈ టైంలో వీడు అక్కడికి ఎందుకు వెళ్లినట్టు చెప్పకుండా? అని గౌతమ్ గురించి అనుకుంటూ రిషి వెళ్తాడు..ఇంతలో డ్యూటీ ముగించుకుని వసు వెళ్తోంటోంది.. మీరేంటి డ్రెస్ మార్చుకున్నారు అని గౌతమ్ అడుగుతాడు. మీరు కూర్చున్నారు కాబట్టి టైం తెలియడం లేదు అని వసు అంటుంది.. మీ కంపెనీలో టైం తెలియడం లేదు అది కరెక్ట్.. అని గౌతమ్ మాటలు కలుపుతాడు.

    అప్పుడే వెళ్తున్నావా?.. నేను నీ కోసం ఇంత సేపు వెయిట్ చేస్తున్నా అని గౌతమ్ అంటాడు. నా కోసం వెయిట్ చేయడం ఏంటి సర్? అని వసు అంటుంది.. ఎందుకంటే.. ఏదో మాట్లాడదామని అనుకున్నాను.. ఇలా వెళ్తావని నాకేం తెలుసు..అని గౌతమ్ అంటాడు. అయితే ఏంటో చెప్పండి సర్ అని వసు అంటుంది. ఇలా సడెన్‌గా అడిగితే ఎలా చెప్పను.. అని గౌతమ్ అంటాడు.

    అయితే నేను వెళ్తున్నాను సర్.. అని వసు అంటుంది. ఇంటికే కదా? నేను క్యాబ్ బుక్ చేస్తాను.. అని గౌతమ్ అంటాడు. నేను ఆటోలో వెళ్తాను..అని వసు అంటే నేను కూడా వస్తాను.. ఐ లవ్ ఆటోలు.. కార్లు వేస్ట్.. ఒక టైర్ మిగులుతుంది. మూడు చక్రాలే ఉంటాయి.. అని గౌతమ్ అంటాడు. నేను జోక్ వేశాను.. అని గౌతమ్ అంటే.. అది జోక్ అనుకోలేదు.. అని వసు కౌంటర్ వేస్తుంది. ఇది జోక్ అని గౌతమ్ నవ్వేస్తాడు.. నేను వెళ్తాను సర్ అని వసు.. నేను వస్తాను అని అన్నాను కదా? అంటూ గౌతమ్ చెబుతాడు. ఇంతలో నేనూ వస్తాను.. అంటూ రిషి కూడా జాయిన్ అవుతాడు. నువ్వెంట్రా సడెన్‌గా.. అని గౌతమ్ ఆశ్చర్యపోతాడు. సర్ ప్రైజ్ ఇద్దామని..అంటూ రిషి కౌంటర్ వేస్తాడు. ఇక అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో జగతి అసలు విషయం చెప్పేస్తుంది. ఇంట్లోంచి వెళ్లు.. హాస్టల్లో జాయిన్ అవ్వు.. మీ రిషి సర్ చెప్పాడు అని జగతి అంటుంది. దీంతో ఈ విషయం ఏంటో రిషి సర్‌తోనే తేల్చుకుంటాను అని వసు చెబుతుంది. మరి ఇక మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

    Guppedantha Manasu today Episode 332, Guppedantha Manasu Episode 332, Guppedantha Manasu serial today Episode 332, Guppedantha Manasu Daily serial Episode, Guppedantha Manasu New Episode, guppedantha manasu serial yesterday episode, guppedantha manasu today episode, గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ , గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్, గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ కావాలి, గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్, గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్, గుప్పెడంత మనసు డైలీ సీరియల్ , గుప్పెడంత మనసు, రిషి, వసు, వసుధార, మహేంద్ర, జగతి, గుప్పెడంత మనసు ఈరోజు సీరియల్, గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్, గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్, గుప్పెడంత మనసు టుడే ఎపిసోడ్

    Leave a Reply