• December 7, 2021

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. అర్దరాత్రి ఆటలు.. వసుతో రిషి ప్రేమాయణం

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. అర్దరాత్రి ఆటలు.. వసుతో రిషి ప్రేమాయణం

    గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ అంటే.. మంగళవారం నాడు అంటే.. Guppedantha Manasu Episode 314 నాటి ధారావాహికలో మంచి సీన్లు పడ్డాయి. గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్‌లో రిషి, వసు, జగతి, మహేంద్రల మీద మంచి ఎమోషనల్ సీన్స్ వస్తాయి. ఇక వన భోజనాల సమయంలో మహేంద్ర, జగతి, రిషి పక్కపక్కనే ఓ వరుసలో కూర్చోవడంతో కన్నులపండువగా అనిపిస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఇలా సాగింది..

    విస్తరాకుల కోసం ఆటోలో వెళ్లిని రిషి, వసు తిరిగి వస్తారు. చేతిలో ఆకులను పట్టుకుంటే రిషి దగ్గరి నుంచి వసు తీసుకుంటుంది. మీరు మా కాలేజ్ ఎండీ ఇలా చేయకూడదు అని వసు అంటుంది. ఇక ఈ ఇద్దరిని ఇలా చూసిన దేవయాణి కుళ్లుకుంటుంది. వసుతోనే రిషి ఉంటున్నాడని, ఇదంతా జగతి ప్లాన్ అని ఆడిపోసుకుంటూ ఉంటుంది. మొత్తానికి భోజనాలు ప్రారంభిస్తారు.

    రిషిని మంత్రి పిలుస్తాడు. ఇక్కడ కూర్చో అని అంటాడు. ఇక జగతి మేడం రండి కూర్చోండి అని రిషి పక్క ప్లేస్‌ను చూపిస్తాడు. నేను తరువాత తింటాను సర్ అని జగతి అంటే.. మీ స్టూడెంట్స్ చూడండి ఎంత చక్కగా కలిసిపోయారు.. వారు వడ్డిస్తున్నారు కదా?. ఇది కాలేజ్ గొప్పదనం.. రండి మేడం వచ్చి కూర్చోండి అని మంత్రి అంటాడు. దీంతో రిషి పక్కన జగతి కూర్చోవడంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది.

    అలా ఈ ఇద్దరిని పక్కపక్కనే చూసిన మహేంద్ర అవాక్కవుతాడు. మహేంద్రను కూడా మంత్రి పిలుస్తాడు. కూర్చోమని అంటాడు. వన భోజనాలు అంటే ఇలానే అందరం కలిసి భోజనం చేయాలని అంటాడు. దీంతో మహేంద్ర, జగతి, రిషి పక్కపక్కనే కూర్చుంటారు. ఈ ఫ్రేమ్ చూడటానికి ఎంత బాగుందో కదా? అని వసు సంబరపడుతుంది.. ఇలాంటి రోజు వస్తుందని మనం అనుకోలేదు కదా? అని జగతితో మహేంద్ర అంటాడు. డాడ్ ఇక్కడ నేను కూడా ఉన్నాను.. నన్ను కూడా పట్టించుకోండని అనే సరికి.. ఏర్పాట్లు బాగా ఉన్నాయ్ కదా? అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు మహేంద్ర.

    కానీ దేవయాణి మాత్రం ఇంకా కుళ్లుకుంటూనే ఉంటుంది. ఏంటో ఈ జగతికి ఇలా అన్నీ కలిసి వస్తున్నాయ్ అని లోలోపల అనుకుంటుంది. మొత్తానికి జగతి ఎలా తింటుంది.. ఎలా చేస్తుందో చూస్తూ రిషి కూడా వాటిని ఫాలో అయ్యాడు. రిషికి వసు కొసరి కొసరి వడ్డించేసింది. మమ్మల్ని కూడా కాస్త పట్టించుకో అని మహేంద్ర కౌంటర్లు వేస్తాడు.

    మధ్యలో ఫోటోలు తీసేందుకు పుష్పను వసు పంపించగా.. రిషి కోపంగా చూస్తాడు. దీంతో వసు రంగంలోకి దిగుతుంది. రిషి కోపంగా చూసినా కూడా ఫోటో తీస్తూనే ఉంటుంది. గుడ్ మంచిది.. ఇలా మెమోరీస్‌ను ఫోటోలు బంధిస్తాయి..అందరినీ ఫోటోలు తీయ్ అని మంత్రి ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. దీంతో వసు రెచ్చిపోతుంది. మహేంద్ర వింత వింత పోజులు పెడుతూ ఉంటాడు.

    అలా వనభోజనాల కార్యక్రమం అయిపోయితుంది. చివర్లో వసు భోజనం చేస్తుంటే.. రిషి వడ్డిస్తాడు. తనకు ఎలా అయితే కొసరి కొసరి వడ్డించిందో అలానే వడ్డిస్తాడు. అది చూసి జగతి నవ్వుకుంటుంది. చివర్లో అందరూ వెళ్లిపోతారు. కానీ రిషి ఆగిపోతాడు. వసు కూడా ఆగుతుంది. కానీ ఒకరికొకరు తెలియకుండా ఆగిపోతారు. చాలా ఫుడ్ మిగిలింది ఇదంతా అనాథాశ్రమంకు పంపించి వస్తాను మేడం అని జగతితో వసు అంటుంది.

    వసు చెప్పకుండా వెళ్లిపోయిందేంటి? అని అసలు నిజం తెలియని రిషి అనుకుంటాడు. ఇక రాత్రి బాగా పని చేసిన వసు.. అలా రిషి కట్టిన ఉయ్యాలను చూస్తుంది. రిషి సర్ చాలా మారిపోయాడు. చెప్పిన మాట వింటాడు.. జెంటిల్మెన్ అంటూ పొగిడేస్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో అర్దరాత్రి పూట ఉయ్యాలాటలు ఆడుకుంటూ ఉంటారు. ఇక అదే మంచి సమయం అనుకుని వసుకి తన మనసులో మాట చెప్పేందుకు రిషి ప్రయత్నిస్తుంటాడు. ఒక విషయం చెప్పాలని టాపిక్ స్టార్ట్ చేస్తాడు అదేంటో మరి చూడాలి.

    Leave a Reply