• November 17, 2021

Evaru Meelo Koteeswarulu : కోటి రూపాయల ప్రశ్న ఇదే.. సమాధానం ఏంటంటే?

Evaru Meelo Koteeswarulu : కోటి రూపాయల ప్రశ్న ఇదే.. సమాధానం ఏంటంటే?

    తెలుగు బుల్లితెరపై కొత్తగూడెం ఎస్సై రాజా రవీంద్ర కొత్త చరిత్రను లిఖించాడు. మొదటిసారిగా కోటి రూపాయలు గెలుచుకుని నయా హిస్టరీని క్రియేట్ చేశాడు. మంగళవారం జరిగిన ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్‌లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు రాజా రవీంద్ర. గత రెండు రోజులు ఈయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. కొత్తగూడెం ఎస్సై, ఆటలు, పోటీ పరీక్షల్లో ఆయన సాధించిన విజయాలన్నీ కూడా వైరల్ కాసాగాయి.

    ఇప్పుడు కోటి రూపాయలు గెలుచుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇప్పుడు ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటి? దాని సమాధానం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అది ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టాలపై సంబధించిన విషయాన్ని అడిగారు. 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టాలు, అందులో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్‌కు ఎవరు అధ్యక్షతన వహించారు అనేది ప్రశ్న.

    ఆ ప్రశ్నకు రంగనాథ్ మిశ్రా, రంజిత్ సింగ్ సర్కారియ కమిషన్, బీపీ మండల్, ఎస్ ఫజల్ అలీ అని ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఫజల్అలీ కమిషన్ అనేది రైట్ ఆన్సర్. అలా మొత్తానికి షోలో మొదటిసారిగా కోటి రూపాయల ప్రశ్నను చూశాం. రాజా రవీంద్ర గెలుచుకున్నాడు కూడా. ఇంకా ఎవరైనా ఈ ఫీట్‌ను సాధిస్తారేమో చూడాలి.

    Leave a Reply