• November 16, 2021

సుమ షోలో వెగటు పుట్టించే సీన్లు!.. రెచ్చిపోయిన కార్తీకదీపం భాగ్యం

సుమ షోలో వెగటు పుట్టించే సీన్లు!.. రెచ్చిపోయిన కార్తీకదీపం భాగ్యం

    సుమ నిర్వహించే షోలు ఏవైనా సరే కాస్త పద్దతిగానే ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ షోలను చేస్తుంది. ఆమె వేసే పంచ్‌లు సెటైర్లు సైతం అందరూ కలిసి ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. అయితే ఈ మధ్య ఆమె హోస్ట్‌గా వస్తోన్న షోలు కాస్త శ్రుతి మించిపోతోన్నాయి. ప్రతీ షోలో ముద్దులు, హగ్గులతో వచ్చిన గెస్టులు నానా హంగామా చేస్తున్నారు. ఈ మధ్య రొమాన్స్ కాస్త శ్రుతి మించిపోతోండటంతో సుమ కూడా ఏమీ చేయలేక అలా చూస్తుండిపోతోంది.

    అదంతా డైరెక్షన్ టీం చూసుకుంటుంది.. నాకెందుకు లే అని సుమ వదిలేసినట్టుంది.తాజాగా స్టార్ట్ మ్యూజిక్ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు వచ్చారు. ఐదో సీజన్‌లో ఎలిమినేట్ కంటెస్టెంట్లు అక్కడకి వచ్చారు. లోబో, ఉమాదేవీ, నటరాజ్ మాస్టర్, శ్వేతా వర్మ, హమీద, సరయు వచ్చారు. నటరాజ్ మాస్టర్, సరయు, హమీద ఒకవైపు ఉన్నారు. లోబో, ఉమాదేవీ, శ్వేతా వర్మ ఓ వైపు ఉన్నారు. అయితే లోబో, ఉమాదేవీల రొమాన్స్ చూసి సుమ కూడా సిగ్గుపడిపోయింది.

    ఇదేం రొమాన్స్ రా బాబు అన్నట్టుగా తలదించుకుంది. కింద కూర్చుంటే పైకి లేవలేడు.. పైకి లేస్తే ఆగడు అని కౌంటర్లు వేసింది. మీరు కొత్త కొత్త పదాలు, బూతులు బాగానే అన్నారు. అవన్నీ విన్నాంలే అని ఉమా దేవీకి కౌంటర్లు వేసింది సుమ. బీప్‌లు వేస్తే మీరు ఎలా విన్నారు అని సుమకు రివర్స్ కౌంటర్ వేస్తుంది సుమ. అయితే మీరు ఓ బుక్ రాయాలి అని మళ్లీ సెటైర్ వేసింది సుమ.

    అయినా నేను ఏమన్నాను.. ఎర్రి** అంటూ దారుణమైన మాట మళ్లీ అనేసింది. దీంతో అందరూ మళ్లీ షాక్ అయ్యారు. ఇది ఇలానే ఆ రోజు కూడా షన్ను.. ఎప్పుడూ విననట్టు.. అవేంటో తెలియనట్టుగా రియాక్షన్లు ఇచ్చాడంటూ ఉమా దేవీ వెక్కించింది. అలా ఉమా దేవీ పిచ్చి మాటలు, పచ్చిగా మాట్లాడుతున్నా కూడా సుమ వారించలేదు. మొత్తానికి సుమ షోలకు ఉన్న వ్యాల్యూ కూడా పోయేట్టుంది.

    Leave a Reply