• October 27, 2021

వాళ్లిద్దరూ అది చేశారు.. సుమ, నవ్యస్వామిపై కార్తీకదీపం వంటలక్క కామెంట్స్

వాళ్లిద్దరూ అది చేశారు.. సుమ, నవ్యస్వామిపై కార్తీకదీపం వంటలక్క కామెంట్స్

    కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు అయితే కార్తీకదీపం సీరియల్ గురించి పడి చచ్చిపోయే వారు. మా వంటలక్క, డాక్టర్ బాబు కలుస్తారా? లేదా? కార్తీక్, దీప ఎప్పుడు ఒక్కటవుతారు అంటూ లెక్కలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చేవి. అయితే ఈ సీరియల్ ప్రస్తుతం గాడి తప్పింది. ఎటు నుంచి మొదలై ఎటు వైపు వెళ్తోందో తెలియనంతగా తికమక పెట్టేస్తోంది. ప్రేక్షకులకు ఈ సీరియల్ మీద ఇంట్రెస్ట్ పోతోంది.

    అందుకే అది టీఆర్పీ రేటింగ్‌ల మీద ప్రభావం చూపుతోంది. ఈ మధ్య కార్తీకదీపం కంటే ఎక్కువగా గుప్పెడంత మనసు, జానకీ కలగనలేదు అనే సీరియల్స్ దుమ్ములేపుతున్నాయి. అత్యంత తక్కువ సమయంలో ఇవి ఎక్కువగా ఆదరణను దక్కించుకున్నాయి. అయితే వంటలక్కకు ఉండే క్రేజ్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్‌కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె తెలుగు నటి కాకపోయినా కూడా మన ప్రేక్షకుల సొంత మనిషిలా ఆదరిస్తున్నారు.

    అందుకే వంటలక్క క్రేజ్‌ను తెనాలి డబుల్స్ హార్స్ మినపగళ్లు వారు క్యాష్ చేసుకుంటారు. మొదట్లో ఒక్క సుమ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేది. ఆ తరువాత సుమతో పాటు వంటలక్క కూడా జాయిన్ అయింది. ఈ మధ్య ఈ ఇద్దరితో పాటుగా నవ్యస్వామి కూడా వచ్చి చేరింది. ముచ్చటగా ముగ్గరు అన్నట్టుగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తీసుకెళ్తున్నారు. సుమక్క పువ్వు లాంటి ఇడ్లీ చేస్తే నవ్య సూపర్ సాంబర్ చేసింది. నేను వాటికి అత్యవసరమైన తెనాలి డబుల్ హార్స్ ఉత్పత్తులను ఆర్డర్ చేశాను అని యాడ్ గురించి చెప్పేసింది.

    Leave a Reply