• November 13, 2021

Karthika Deepam Episode 1196 : దీప ప్లాన్ ఏంటి?.. వదిలి వెళ్లిపోనున్న వంటలక్క?

Karthika Deepam Episode 1196 : దీప ప్లాన్ ఏంటి?.. వదిలి వెళ్లిపోనున్న వంటలక్క?

    కార్తీకదీపం సీరియల్ ఎటునుంచి ఎటో వెళ్లిపోతోంది. దోష నివారణ పూజ గురించి తెలిసినా దీప సైలెంట్‌గా ఉంది. మోనిత ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో మోనితకు దీప ఇచ్చిన వార్నింగ్.. ఆ వార్నింగ్ మోనిత కంగారు పడటం,.. దీప ఇంకా ఇంటికి రాలేదంటూ సౌందర్య కార్తీక్ ఆందోళన చెందుతుంటారు. సీరియల్ ఎపిసోడ్‌ నంబర్ 1196లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    రెడీగా ఉండు.. సినిమా మొదలు కాబోతోంది.. ఎందుకు పెట్టుకున్నాను రా అని తల గోడకు బాదుకునేలా చేస్తా.. నీ మీద ఒట్టు అని దీప వెళ్లిపోతోంది. ఇక దీప వెళ్లిపోవడం మోనితలో కంగారు పుడుతుంది. దీప ధైర్యం ఏంటి ప్రియమణి అని మోనిత భయపడుతుంది. తుఫానులా వచ్చి దులిపేసి పోయింది చూస్తుంటే దీపమ్మ సినిమానే హిట్ అయ్యేలా ఉందమ్మా అని ప్రియమణి కౌంటర్లు వేస్తుంది..దీప ధైర్యం ఏంటి అని మోనిత అనుకుంటూ ఉంటుంది.

    ఇంట్లో శౌర్య, హిమలు దీప కోసం ఎదురుచూస్తుంటారు. బాబాయ్.. అమ్మ కనిపించిందా? అని ఆదిత్యను అడుగుతారు.. నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను నాకు తెలీదు అని చెబుతాడు.. పొద్దున వెళ్లింది. అమ్మ ఇంకా రాలేదు.. ఫోన్ కూడా తీసుకెళ్లలేదు.. అని చెబుతారు పిల్లలు. ఏమైనా గొడవ జరిగిందా? అని ఆదిత్య అడుగుతాడు… గొడవ జరగలేదు అయినా ఎవ్వరూ ఏం చెప్పడం లేదు.. ఇంట్లో వాళ్లు చెప్పే సమాధానాలు అన్నీ అబద్దాలే అని పిల్లలు అంటారు.. వదిన కనిపించకపోవడం ఏంటి? ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మళ్లీ ఏంటి? అని ఆదిత్య తన మనసులో అనుకుంటాడు.

    వలవల ఏడ్వాల్సిన దీప ఎందుకు అలా చేసింది.. అన్ని పకడ్భందీలా ఏర్పాట్లు చేసుకున్నాను.. అన్ని ప్లాన్లు కరెక్ట్‌గానే వేశాను కదా.. నా అంచనాలు మించి ప్రవర్తిస్తుంది. ఏమై ఉంటుంది.. అని మోనిత తెగ ఆలోచిస్తుంటుంది. మోనిత ఆలోచలను పసిగట్టిన ప్రియమణి ఇంకా రెచ్చగొట్టే పని చేసింది. దీపమ్మ గురించే అంతలా ఆలోచిస్తున్నావని నాకు తెలుసు అని ప్రియమణి అనేసింది. దీంతో మోనితకు కాలిపోయింది. నీకు తెలివి, అతి తెలివితేటలున్నాయని నాకు తెలుసు.. నా దగ్గర చూపించకు.. అవసరం లేని వాటి గురించి ఆలోచించకు.. ఎక్కడుండాలో అక్కడే ఉండు.. కాఫీ చెత్తగా ఉంది.. అంటూ ప్రియమణి పరువుతీసింది.

    నా ఇంటికి వచ్చి.. నాకు వార్నింగ్ ఇస్తుందా?. నేను టెన్షన్ పడాలా? నేను టెన్షన్ పెట్టే బ్యాచ్. టెన్షన్ పడే బ్యాచ్ కాదు.. దీపకు ఇస్తాను చూడు మంచిగా ఇస్తాను.. వెయిట్ చేయ్ దీపక్క..అంటూ మోనిత రెచ్చిపోతోంది.
    అయినా నేనేంటి? నా కార్తీక్‌కు ఫోన్ చేయడమే మానేశాను.. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఫోన్ చేయడమే మానేస్తామా?.. కార్తీక్ లిఫ్ట్ చేసినా చేయకపోయినా ఫోన్ చేయాలి.. వేరే నంబర్లతో చేస్తాను.. అంటూ కార్తీక్‌కు ఫోన్ చేస్తుంది. అసలే దీప కనిపించడం లేదని వెతికే పనిలో ఉన్న కార్తీక్‌ను మోనిత ఇంకా విసిగిస్తుంది.

    హలో డాక్టర్ బాబు అని మాట్లాడుతుంది. దీప అనుకుని వెంటనే.. ఎక్కడికెళ్లావ్ దీప.. నువ్వేనా? అని అంటాడు. దీంతో మోనిత పగలబడి నవ్వుతుంది. డాక్టర్ బాబు అని పిలవగానే దీప అని అనుకున్నావా.. నువ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోకపోతే.. మానేస్తాను అని అనుకున్నావా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది.. షటప్.. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు.. నువ్వెవరో నేనొవరో.. అని కార్తీక్ ఫైర్ అవుతాడు. నేను ఎవరా? ఇద్దరం కలిసి పూజలు చేశాం.. ఇంకెంటి విశేషాలు.. దీప ఏం చేస్తుంది.. అరుస్తుందా? ఏడుస్తుందా? కుమిలిపోతోందా?.. నేను చెప్పినట్టు విను.. నువ్ నా నుంచి తప్పించుకోలేవు.. దీపను నెత్తిన ఎక్కించుకున్నావో.. పాతాళానికి తొక్కేస్తాను.. అని మోనిత కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది. దీంతో.. షటప్ మోనిత. ఇంకో మాట మాట్లాడాని మర్యాదగా ఉండదు.. అని తిట్టిపడేస్తాడు కార్తీక్. నువ్ ఎంత ఎక్కువగా ప్రేమిస్తే.. నేను దీపను అంత ఎక్కువగా ద్వేషిస్తాను అని మోనిత అనుకుంటుంది.

    ఆ తరువాత సీన్‌ సౌందర్య, ఆనంద్ రావుల మీద ఓపెన్ అవుతుంది.. చేసిందంతా చేసి ఇప్పుడు టెన్షన్ పడి ఏం లాభం.. దీపకు ముందే చెప్పమని అన్నాను.. ఏదో పూజ అన్నావ్.. ఇప్పుడు ఎందుకు టెన్షన్.. అని ఆనంద్ రావు అంటాడు. నేను చేసింది కూడా కార్తీక్ కోసమే.. మనకే నష్టం కదా? అని సౌందర్య చెబుతుంది. కార్తీక్ ఒక మాట అన్నాడు అని దీప 11 ఏళ్లు దూరంగా ఉంది. దీపకు తోడుగా మనం ఉండేవాళ్లం.. కానీ ఇప్పుడు ఎలా.. తన రెక్కల కష్టంతో పిల్లలను పెంచి పోషించుకుంది అని ఆనంద్ రావు అంటాడు.

    పిల్లల కోసమైనా ఇంటికి వస్తుందనే ఆశ ఉండేది. కానీ మీరు ఇలా అంటూ ఉంటే ఆ ఆశకూడాపోతోంది అని సౌందర్య అంటుంది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. కొన్ని రోజులు ఏడ్చి అమ్మను మరిచిపోతారని అనుకుందేమో.. ఇంటికి వస్తుందని నాకైతే నమ్మకం లేదు.. వాడు ద్రోహం చేశాడు.. నవ్ తప్పు చేశావ్.. అని ఆనంద్ రావు అంటాడు. జరిగింది కాదండి.. ఇకపై ఏం చేయాలో చెప్పండి అని సౌందర్య.. చెప్పడానికి ఏం లేదు. ఇదంతా మన కర్మ.. దీప ఇంటికివస్తే దేవుడి లీల.. రాకపోతే కర్మ.. అనుకోవాలి అని ఆనంద్ రావ్ అంటాడు. భగవంతుడా.. దీపను ఇంటికి తీసుకురా.. నేను చేసింది కూడా దీప మంచికోసమే కదా అని సౌందర్య కుమిలిపోతుంది.

    అమ్మ ఎటు వెళ్లింది అంటూ హిమ అడుగుతుంది. నాకేం తెలసు.. నాకు ఏమైనా చెప్పిందా? అని శౌర్య అంటుంది. ఇలా ఇంటి గుమ్మం ముందు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.. అమ్మ ఈ మధ్య కోపంగా ఉంటుంది.. ఎందుకు కోపంవస్తుంది అని అడిగితే.. కోపంగా చూస్తుంది.. అని పిల్లలు మాట్లాడుకున్నారు. ఇంట్లో వాళ్లంతా నార్మల్‌గా ఉన్నారని అనుకుంటున్నావా? అని హిమ అనడం.. అవన్నీ ఆలోచించొద్దని నానమ్మ చెప్పింది కదా?. ఇంట్లో వాళ్లని బాధపెట్టకూడదు అని శౌర్య అంటుంది.

    మనం ఇక్కడ ఇలా కూర్చుంటే అమ్మకు కోపం వస్తుందా అని హిమ… కోపం రాకముందే.. నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేద్దాం అని శౌర్య అంటుంది. ఆటోలో కూరగాయలు పట్టుకుని దిగుతుంది దీప. అమ్మను చూడటంతోనే పిల్లలు వస్తారు. ఆ వెంటే కార్తీక్ కూడా కారులోంచి దిగుతాడు.. దీప ఎందుకు మాట్లాడటం లేదు.. అరవడం లేదు అని ఆలోచిస్తుంటాడు కార్తీక్.. ఎక్కడికి వెళ్లావ్.. ఇద్దరూ కలిసి రావొచ్చు కదా? అని పిల్లలు అంటారు.

    దారులు వేరమ్మా.. మీ నాన్న దారి.. నా దారి వేరమ్మ.. అదేనమ్మ మీ నాన్న వెళ్తున్న దారి వేరు.. నేను వెళ్తున్న దారి వేరు.. ఒకే కారులో ఎలా వెళ్తాం.. మార్కెట్‌కు వెళ్లి చాలా రోజులైంది.. అందుకే వెళ్లాం.. అప్పుడెప్పుడో బస్తీలో ఉన్నప్పుడు చేశా అని ఇలా దీప చెప్పుకుంటూ వెళ్తుంది.. అప్పుడే బాగుండేది అమ్మ అని శౌర్య అంటుంది.. అలవాటు తప్పింది కదా అందుకే వెళ్లాను అని దీప అంటుంది.. బస్తీలో ఉన్నంత షాపింగ్ చేశాం.. ఇప్పుడు ఎందుకు అవసరం అమ్మ అని శౌర్య అంటుంది.. అలవాటు పోతే మళ్లీ ఇబ్బంది కదా? భూమి గుండ్రంగా ఉందంటారు.. ఎప్పుడేం అవసరం వస్తుందో తెలియదు కదా.. అందుకే వెళ్లాను.. అని దీప, శౌర్యలు వెళ్లిపోతారు.

    వచ్చే వారం కథ మలుపు తిరిగేలా కనిపిస్తోంది. దీప ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతోన్నట్టు కనిపిస్తోంది. గుత్తి వంకాయ కూర గురించి చెబుతూ.. ఇక మళ్లీ తింటారో తినరో అని అంటుంది.. అన్నీ అబద్దాలు చెబుతున్నారు అంటూ పరోక్షంగా డాక్టర్ బాబు మీద దీప కౌంటర్లు వేస్తుంది. అంటే దీప అందరికీ దూరంగా వెళ్లిపోతుందేమో. చూడాలి మరి.

    Leave a Reply