- November 6, 2021
Karthika Deepam Episode 1190 : బెట్టు చేసిన మోనిత.. ఆగ్రహించిన సౌందర్య.. మథన పడ్డ దీప

కార్తీకదీపం సీరియల్‌లో ఇప్పుడు మళ్లీ ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. మోనిత, మోనిత పుట్టిన బిడ్డ, కార్తీక్‌కు గండం అంటూ సౌందర్య నమ్మడం, దోష నివారణ పూజ కోసం ఏర్పాట్లు చేయడం, కార్తీక్‌కు అవన్నీ నచ్చకపోయినా ఒప్పించడం, ఈ విషయాలన్నీ కూడా దీప దగ్గర దాచడం జరుగుతూనే వస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్ అంటే Karthika Deepam Episode 1190లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
భారతితో సౌందర్య మాట్లాడటం చూసి, కారులో అర్దరాత్రి బయటకు వెళ్లడం చూసిన దీప ఈ విధంగా తన మనసులో తాను అనుకుంది. భారతితో అత్తయ్య గారు ఫోన్‌లో మాట్లాడాల్సి పని ఏంటి? అసలు ఏం జరుగుతోంది? అంటూ అన్నీ గుర్తు చేసుకుంటూ దీప బాధపడింది. వేళ కాని వేళ పూజ గది గురించి మాట్లాడుకున్నారట.. శుభ్రం చేయాలని అనుకున్నారట.. పొంతన లేని మాటలు చెప్పింది.. అందరూ అబద్దాలు చెబుతున్నారు.. ఎన్ని కష్టాలు పడితే.. మనసు అంత గట్టిగా అవుతుందట. ఇది కూడా నాకు మంచిదే.. వీళ్లంతా ఇలా చేస్తుంటే ఓ నిర్ణయం సులువుగా తీసుకోవచ్చు అని దీప అనుకుంటూ ఉంటుంది.
ఇక దీప దగ్గరకు శౌర్య వస్తుంది.. రా అని రూంలోకి తీసుకెళ్తుంది. అక్కడకు వెళ్లే సరికి హిమ, డాక్టర్ బాబు ఉంటారు. డాక్టర్ బాబును అలా చూసి దీప సైలెంట్‌గా ఉంటుంది. మౌనమే బెడ్రూంలో రాజ్యమేలుతూ ఉంటుది. పిల్లలు ఇద్దరూ ఎంత మాట్లాడినా కూడా ఆ ఇద్దరూ మాట్లాడుకోరు. చూపులతోనే అంతా గడిచిపోతుంటుంది.
ఇక సౌందర్య కారులో వెళ్తూ.. కుటుంబం కోసం ఒకడి, రెండు మెట్లు దిగుతాను.. కానీ కార్తీక్ కోసం పది మెట్లు దిగాల్సి వస్తుంది.. ఇది పుత్రవాత్సల్యమా? దీప మీద ప్రేమా? ఆ ఇద్దరూ బాగుండదాలనే కదా?. అన్నీ గుర్తు చేసుకుంది సౌందర్య.. దీప గురించి, తన మంచి గురించే ఇదంతా చేస్తున్నాను అని నమ్ముతుందా?.. నేరె ఒక మెట్టు దిగుతుంటే.. మోనిత రెచ్చిపోతుంది.. నువ్ కరెక్ట్‌గా ఉంటే ఇదంతా వచ్చేదే కాదురా కార్తీక్ అంటూ సౌందర్య బాధపడుతూ మోనిత వద్దకు వెళ్లింది.
మోనిత ఇంటి డోర్ బెల్ కొడితే.. ప్రియమణి వచ్చి డోర్ తీస్తుంది. అక్కడ సౌందర్యను చూసి ప్రియమణి షాక్ అవుతుంది. ఇక్కడేం చేస్తున్నావే అంటూ ఫైర్ అయింది. దీంతో కంగారు పడుతున్న ప్రియమణి ఏం చెప్పాలో తెలియకు తడుముకుంది. ఇంతలో మోనిత వచ్చింది. ప్రియమణిని లోపలకు వెళ్లమంది. ఏంటి ఇలా దారి తప్పి వచ్చావ్? అని మోనిత అంటుంది. నీకు అంతా తెలిసే అడుగుతున్నావ్ అని నాకు కూడా తెలుసు.. నేను ఒక మెట్టు దిగి వచ్చాను అని నువ్ ఓవర్ చేస్తున్నావని తెలుసు.. ఇదంతా నా కొడుకు,కోడలు దీప గురించి చేస్తున్నాను అని సౌందర్య అంటుంది. మరి నేను ఎవరిని నీ కోడిలిని కాదా? అంటే.. నోర్మూయ్ అంటూ అరుస్తుంది.
దెబ్బకు మోనిత భయపడుతుంది. నాకు ఇద్దరే కొడుకులు.. ఇద్దరే కోడళ్లు.. దీప, శ్రావ్య అని చెబుతుంది సౌందర్య. రేపు పూజకు మీ ఇద్దరూ రావాలని సౌందర్య అంటే.. రాకపోతే ఏం చేస్తారు అని మోనిత బెట్టు చేసింది. ఇది అభ్యర్థన కాదు.. ఆర్డర్ అని చెప్పి వెళ్లిపోయింది. ఆ తరువాత భారతికి మోనిత ఫోన్ చేసి పూజకు వస్తాను అని చెప్పు అంటుంది. సౌందర్య గారు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఒప్పేసుకుంటే సరిపోయేది కదా? అని ప్రియమణి అంటుంది.
దీన్నే అహం, ఇగో అంటారు అని మోనిత అంటుంది. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే.. బెడ్రూంలో హిమ, శౌర్య, డాక్టర్ బాబు, వంటలక్కలు ఉంటారు. కానీ ఏం మాట్లాడుకోరు. అందరూ చూపులతోనే గడిపేస్తారు.. ఇక లాభం లేదనుకుని శౌర్య, హిమలు పాత విషయాలు అడుగుతారు. మొదట ఎక్కడ చూసుకున్నారు.. ఎలా పరిచయం అయ్యారు అని పిల్లలు అడుగుతారు. డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరూ కూడా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తారు. అప్పుడు మీరు ఎలా ఉండేవారు.. ఇప్పుడు ఎంతలా మారిపోయారు అని డాక్టర్ బాబు గురించి దీప మనసులో అనుకుంటుంది.
నేను మారలేదు దీప.. పరిస్థితులే నన్ను దుర్మార్గుడిని చేశాయ్ అని కార్తీక్ తన మనసులో అనుకుంటాడు. అలా కాసేపటికి దీప అక్కడి నుంచి వెళ్తుంది.. అలా వెళ్లడం చూసి కార్తీక్ ఇంకా బాధపడతాడు. మోనిత విషయం తెలిసి ఉంటుందా? ఏం జరిగిందో తెలిసిందా? జరిగింది ఇది అని చెప్పలేను..అని కార్తీక్ తన మనసులో అనుకుంటాడు. అలా ఎపిసోడ్ మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక వచ్చే వారం దోష నివారణ పూజ జరుగుతుందేమో. అది దీప కంట పడుతుందేమో చూడాలి.