• November 6, 2021

Guppedantha Manasu Episode 288 : క్లాస్‌లో రెచ్చిపోయిన వసు.. రిషి ఎలా రియాక్ట్ అవుతాడో మరి!

Guppedantha Manasu Episode 288 : క్లాస్‌లో రెచ్చిపోయిన వసు.. రిషి ఎలా రియాక్ట్ అవుతాడో మరి!

    గుప్పెడంత మనసు సీరియల్‌లో శనివారం నాడు రిషి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పెళ్లి గురించి చెబుదాం, రిషిని కలుద్దామని వచ్చిన శిరీష్ భంగపాటు ఎదురవుతుంది. ఆ విషయాన్ని చెప్పేందుకు వెళ్లిన వసును రిషి బాధపెడతాడు. వచ్చిన వెళ్లక తప్పదు.. మనతో ఎప్పుడూ ఉంటారా? అంటూ వసుతో రిషి ఏదేదో మాట్లాడతాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడా? అని రిషి గురించి వసు అనుకుంటుంది. అయితే వసు రాసిన ఆర్టికల్ పేపర్లను కూడా చెత్తబుట్టలో పడేస్తాడు.

    రిషి అలా మాట్లాడటంతో వసు బాధపడుతుంది. తరువాత కలుస్తాను అని చెప్పాడు అంటూ మహేంద్రతో వసు చెబుతుంది. అంతే అన్నాడా? ఇంకా ఏమీ అనలేదా? అంటూ ఎంతో ఎగ్జైట్‌తో వసుని మహేంద్ర అడుగుతాడు. బిజీగా ఉన్నారని అన్నావ్.. కదా.. తరువాత కలుద్దాంలే అని వసుని తీసుకుని శిరీష్ వెళ్తాడు. అక్కడ సీన్ కట్ చేస్తే.. కాలేజ్‌లో జగతి మీద ఓపెన్ అవుతుంది. తోటి ఉపాధ్యాయులతో వసు రాసిన ఆర్టికల్‌ను చూపిస్తుంది.

    ఎంతో బాగా రాసిందని ప్రశంసిస్తారు. మీ వల్లే ఇదంతా జరగుతోంది. మిషన్ ఎడ్యుకేషన్ చాలా బాగా సక్సెస్ అయిందంటూ లెక్చరర్స్ అంటారు. నాది, నేను అనే మాటలు మనం ఎక్కువగా వాడకూడదు..ఇది అందరి కృషి వల్లే సక్సెస్ అయిందంటూ జగతి చెబుతుంది. అలా సీన్ అక్కడ కట్ చేస్తే.. రిషి, మహేంద్రలపై ఓపెన్ అవుతుంది. రిషి తన కేబిన్‌లో పని చేసుకుంటూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ అంటూ చెప్పినా కూడా రిషి పట్టించుకోడు మహేంద్రని.

    ఏంటి మూడ్ బాగా లేదా? అని మహేంద్ర అడుగుతాడు. అలా అని బోర్డ్ ఏమైనా పెట్టుకున్నానా? అని రిషి అంటాడు. గుడ్ మార్నింగ్ చెబితే తిరిగి చెప్పలేదు కదా? అంటాడు. మీకు గుడ్ మార్నింగ్ అయితే నాకు కావాలని ఉందా? అంటాడు రిషి. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య మాటలు వెళ్తూ వెళ్తూ.. శిరిష్, వసుల గురించి తీస్తాడు మహేంద్ర. దీంతో చిర్రెత్తుకొచ్చిన రిషి.. వేరే ఏదైనా ఉంటే మాట్లాడండని అరుస్తాడు. అదే సమయంలో జగతి వస్తుంది.

    మీరే రమ్మన్నారా? అంటూ మహేంద్రను రిషి అడుగుతాడు. చ చ నాకు తెలీదు అని అంటాడు. లోపలకి రావొచ్చా? అని మేడం అడుగుతుంది. రండి అని అంటాడు. కూర్చోమని చెప్పురా రిషి అని తన మనసులో అనుకుంటాడు మహేంద్ర. కూర్చోండి అని రిషి అంటాడు. జగతి కూర్చుంటుంది. నా కొడుకు మంచోడు అని మహేంద్ర లోలోపల అనుకుంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి జగతి చెబుతుంటే.. దాన్ని పక్కన పెట్టేదామని రిషి అంటాడు.

    పిల్లలను పరీక్షలకు సిద్దం చేద్దాం. ముందు మనకు అది ముఖ్య. తరువాత మిషన్ ఎడ్యుకేషన్ చూద్దామని అంటాడు. సరేనని జగతి వెళ్తుంది. ఇది మీకు కూడా అని మహేంద్రకు చురకలు అంటిస్తాడు రిషి. ఈ కాలేజ్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని గుర్తు చేయాల్సి వస్తుంది. ఈ మధ్య పెళ్లిళ్లు చేయడం, రాయబారాలు నడపడం ఎక్కువైందని అంటాడు. అలా ఈ ఇద్దరి మీద సీన్ కట్ చేస్తే.. క్లాసు రూంలో రిషిలా వసు ఇమిటేట్ చేస్తుంది. రిషి వచ్చాడని చూడకుండా వసు రెచ్చిపోతుంది. మరి వచ్చే వారం ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply