• November 5, 2021

Janaki Kalaganaledu Episode 165 : మైరావతి ఎంట్రీ.. జానకి కథ మలుపు తిరగనుందా?

Janaki Kalaganaledu Episode 165 : మైరావతి ఎంట్రీ.. జానకి కథ మలుపు తిరగనుందా?

    జానకి స్నేహితురాళ్లు వచ్చి జ్ఞానాంబను నానా రకాల మాటలు అంటారు. అయితే జానకి తన స్నేహితురాళ్లను వారించి.. ఇంట్లోంచి పంపించేస్తోంది. కానీ జ్ఞానాంబ మాత్రం అదంతా చేసింది జానకీ అని భ్రమపడుతుంది. కళ్లారా మీ ప్రేమను చూస్తున్నాను.. దేవతలాంటి మిమ్మల్ని నేను ఎందుకు అలా అంటాను.. మా అన్నయ్య, మా ఫ్రెండ్స్ చేసిన తప్పుకు నన్ను శిక్షించడం న్యాయం కాదు అత్తయ్య గారు అని జానకి ఏడుస్తుంది. నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు ఇచ్చిన గడువులో మొదటి రోజే విఫలమయ్యావని జ్ఞానాంబ అంటుంది.

    మీ ఫ్రెండ్ మాట్లాడిన మాటలు నువ్ ఈ పద్నాలుగు రోజుల్లో మాట్లాడతావో లేదో నేను చూస్తాను అని జ్ఞానాంబ వెళ్లిపోయింది. ఇక రామ కూడా జానకితో మాట్లాడుకుండా వెళ్లిపోతాడు. దీంతో జానకి హర్ట్ అవుతుంది. స్వీట్ కొట్టు వద్దకు జానకి వెళ్తుంది. అప్పటికే రామ తనలో తాను మథనపడుతుంటాడు. అత్తయ్య గారిని అవమాన పర్చాలని నేనేం చేయలేదు.. శ్రావణి వచ్చే సంగతి కూడా నాకు తెలీదండి.. మీరు నమ్మితే చాలు అని జానకి అంటుంది.

    మీరే తప్పు చేసి ఉండరు.. నాకు తెలుసు అండి అని జానకికి మద్దతుగా నిలబడతాడు రామ. అయితే శ్రావణి అలా అనడం తప్పండి.. ఆమె అన్నదాంట్లో ఒకటి మాత్రం నిజం ఉందండి అని రామ అన్నాడు. మీరు నన్ను చేసుకుని ఉండకపోతూ.. డాక్టర్నో, కలెక్టర్నో, ఇంజనీర్నో చేసుకుని దర్జాగా ఉండేవారు. ఈ స్వీట్ కొట్టోడిని అని రామ ముగించేలోపే.. జానకి అడ్డు పడుతుంది. మిమ్మల్ని చేసుకుని ఉండకపోతే నా భవిష్యత్తు ఎలా ఉండేదో గానీ దేవుడిలాంటి భర్త, బంగారం లాంటి జీవితాన్ని మిస్ అయ్యేదాన్ని. సంతోషం అంటే ఐశ్వర్యంలో ఉండదని, మంచి మనసు ఉంటే ఉంటుందని జానకీ అంటుంది.

    అక్కడ సీన్ కట్ చేస్తే జ్ఞానాంబ తెగ బాధపడుతుంది. జానకి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియకు కంగారు పడుతుంది. జానకి మంచిదేనని నీకు తెలుసు.. ఆమెకు అహంకారం కూడా లేదని నీకు తెలుసు..అ యినా కూడా ఎందుకు కంగారు పడుతున్నావ్ అని గోవింద రాజులు అంటాడు. జానకి మంచిదే అని నాకు తెలుసు.. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఎలా? అని నాకు భయంగా ఉంది.. ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియడం లేదు అని జ్ఞానాంబ అంటుంది.

    అప్పుడు తన తల్లి మైరావతి గురించి జ్ఞానాంబకు గోవింద రాజులు గుర్తు చేస్తాడు. మా అమ్మకు చెబితే అంతా చూసుకుంటుందని అంటాడు. అలా మొత్తానికి సీరియల్‌లో కొత్త కారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఊర్లో పెద్ద, నియంతలా ఉన్న మైరావతి బోనులో జానకి చిక్కబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇక మున్ముందు మైరావతి వల్ల జానకికి చిక్కులు తప్పేలా లేదు. రేపటి ఎపిసోడ్‌లోనే జానకికి కొత్త పరీక్షలు ఎదురుకాబోతోన్నాయి. మైరావతి తన కాళ్లకు దండం పెట్టడంలోనూ జానకి తప్పులను ఎంచినట్టు కనిపిస్తోంది.

    Leave a Reply